కోల్‌కతా: పెళ్లయినా తమ ఇంటిపేరు మార్చుకునేందుకు 40 శాతం మందికి పైగా ఒంటరి మహిళలు ఆసక్తిచూపడంలేదని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని షాదీ డాట్‌కామ్ ఈ సర్వే నిర్వహించింది. వివాహం గురించి తమ అభిప్రాయాలు చెప్పాలని అడగ్గా... 40 శాతం మంది ఒంటరి మహిళలు ఇంటి పేరు మార్చుకోమని చెప్పారు. మరో 27 శాతం మంది పెళ్లయిన తర్వాత ఆర్థిక స్వతంత్రంతో ఉండడానికి ఇష్టం చూపగా, 18 శాతం మంది మగవారితో సమానంగా కుటుంబ బాధ్యతలను పంచుకుంటామన్నారు. 14 శాతం మంది భర్తలు తమ తల్లిదండ్రులను సొంతవారిగా చూసుకోవాలని చెప్పారు.