సాంకేతిక లీలలు | Technical college | Sakshi
Sakshi News home page

సాంకేతిక లీలలు

Published Sat, Jun 28 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

సాంకేతిక... ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న ఊపిరి .అదే టెక్నాలజీ సామాన్యుడికీ నిత్యకృత్యమై ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతోంది. వాటికి పరిష్కారమార్గాలూ వస్తున్నాయి..

సాంకేతిక... ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న ఊపిరి .అదే టెక్నాలజీ సామాన్యుడికీ నిత్యకృత్యమై ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతోంది. వాటికి పరిష్కారమార్గాలూ వస్తున్నాయి.. తిరిగి కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ వలయాన్ని ఛేదించడానికి జెట్ కింగ్ నెట్‌వర్కింగ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు ఎన్నో అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. టెక్నోఫెస్ట్-14 పేరిట పలు సమస్యలను సులువుగా పరిష్కరిస్తున్నారు.
 
 సనత్‌నగర్: ఇంట్లో మొబైల్ మరచిపోయి ఆఫీసుకు వచ్చేశారనుకోండి...ఎవరెవరు ఫోన్ చేసి ఉంటారోననే ఆతృత.. ఇక ఆ బెంగ అక్కర్లేదు...ఆఫీసులో నుంచే మొబైల్‌కు ఏయే మెసేజ్‌లు వచ్చాయి... ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు ఫోన్ చేశారో  తెలుసుకోవడమే కాదు...మనకు అవసరమైన కాంటాక్ట్ నెంబర్‌ను కూడా ఎంచక్కా తీసుకోవచ్చు.మొబైల్ పోయిందా...డోంట్ వర్రీ...లేకపోతే సెలైంట్ మోడ్‌లో ఉన్న ఫోన్ కనిపించడం లేదా...? రింగ్ టోన్ మోగేలా చేసుకోవాలా? అయితే ఓకే.
 
ఏమిటీ...ఇవన్నీ వింటుంటే మీకు నమ్మశక్యంగా లేవా? తలతిరుగుతుందా...కానీ ఇవి నిజాలు...ఇవే కాదు...మరెన్నో అద్భుతాలను చూడడమే కాదు...వాటి గురించి తెలుసుకోవాలంటే అమీర్‌పేట్ మైత్రీవిహార్‌లోని జెట్‌కింగ్ హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్కింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లాల్సిందే. ఆ సంస్థకు చెందిన విద్యార్థులు అంగడి సరకులా సాంకేతికతను ఆరబోశారు. టెక్‌ఫెస్ట్-2014 పేరిట రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో 25 అంశాలకు సంబంధించి ప్రదర్శనలు ఇచ్చారు.
 
స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్, కంప్యూటర్ ఉంటే చాలు...
 
వివిధ రకాల యాప్స్‌ను ఆధారంగా చేసుకుని స్మార్ట్‌ఫోన్‌ను ఇంటర్నెట్  కంప్యూటర్‌తో అనుసంధానం చేసుకుంటే ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించవచ్చని జెట్‌కింగ్ విద్యార్థులు చాటిచెబుతున్నారు. ఇంట్లో మరిచిపోయిన ఫోన్‌కు వచ్చిన కాల్, మెసేజ్ లిస్టును ఆఫీసులో కూర్చొని చూసుకోవాలంటే ముందుగా ‘ఎయిర్ డ్రాయిడ్’ అనే యాప్స్‌ను ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. యాప్‌ను కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్మార్ట్‌ఫోన్‌కు, పీసీ (పర్సనల్ కంప్యూటర్)కి ఐపీ అడ్రస్ ఇవ్వాలి. అయితే మనకు కావాల్సిన సమాచారాన్ని బట్టి యాప్స్, కాన్ఫిగరేషన్ మారుతుంటాయి. టెక్నోఫెస్ట్‌లో విద్యార్థులు ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తూ వివరిస్తున్నారు. ఈ అద్భుతాలను తిలకించి ఔరా...! అని నోరెళ్లబెట్టడం సందర్శకుల వంతవుతోంది.
 
టెక్నోఫెస్ట్ విశేషాలు కొన్ని....మొబైల్ కెమెరాను పీసీకి వెబ్‌కామ్‌గా...
 
పీసీకి వెబ్‌కామ్ లేదా...అయితే ఫోన్‌కు ఉన్న కెమెరానే పీసీకి కూడా వాడుకోవచ్చు. దీనికి డ్రాయిడ్ యాప్స్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. అలాగే ఫోన్ పోయినప్పుడు మొబైల్ ట్రాకింగ్ చేసుకోవడం, లాక్ చేసుకోవడం, ముఖ్యమైన సమాచారం ఉంటే తొలగించుకోవడం వంటి వాటిని ఎయిర్ డ్రాయిడ్ యాప్స్ ఆధారంగా చేసుకోవచ్చు.
 
భేషుగ్గా డాటా రికవరీ....
 
పీసీలో డాటా డిలేట్ అయిపోయిందనే బెంగ అవసరం లేదు. ‘ఈజెస్’ అనే యాప్స్‌ను ఇన్‌స్టాలేషన్ చేసుకుని కాన్ఫిగరేషన్ అయితే, గతంలో పోయిన డేటా దొరుకుతుంటున్నారు. అయితే డేటా ఓవర్‌రైట్ కానంతవరకు ఓకే.  చివరకు ఫార్మెట్ చేసిన సమాచారమూ రాబట్టుకోవచ్చు.

మై ఓన్ టెలిఫోన్ ఎక్ఛేంజ్‌తో బిల్లుకు టాటా....

ఐదంతస్తుల భవనంలో అన్ని ఫ్లోర్లలో ఓ సంస్థ సిబ్బంది పనిచేస్తున్నారు. మామూలుగానైతే టెలిఫోన్ ద్వారా కనెక్షన్ ఇవ్వడమో లేక సెల్‌ఫోన్ ద్వారానే మెసేజ్ ఇస్తుంటాం. దీని ద్వారా బిల్లు తప్పనిసరి. అయితే బిల్లు ఏమాత్రం లేకుండా ఫ్రీగా మాట్లాడుకునే వ్యవస్థే మై ఓన్ టెలిఫోన్ ఎక్ఛేంజ్. వైప్ అనే మినీ సిప్ సర్వర్ యాప్స్‌ను ఇన్‌స్టాలేషన్ చేయడం ద్వారా స్మార్ట్‌ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు కంప్యూటర్ సర్వర్ ఆధారంగా ఉచితంగా మాట్లాడుకోవచ్చు
 
నెట్ మీటింగ్‌తో డేటా షేరింగ్....

ఆఫీసులో బాస్ తన పీసీపై ఏం చేస్తున్నారు...? అలాగే ఉద్యోగుల పీసీ డెస్క్‌టాప్‌లపై ఏం నడుస్తోందో తెలుసుకోవచ్చు. ఒకవిధంగా ఇది వీడియో కాన్ఫరెన్స్ లాంటిదే. ఉద్యోగులందరినీ ఒకచోట చేర్చకుండానే డెరైక్ట్‌గా ఉద్యోగుల పీసీ డెస్క్‌టాప్ పైకి సమాచారం పంపించవచ్చు. అలాగే తన సీట్లో కూర్చొనే వారితో సంభాషించవచ్చు.
 
ఇలా ఎన్నో రకాలుగా చేతిలోని స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చని జెట్‌కింగ్ విద్యార్థులు తమ ప్రదర్శన ద్వారా తెలియజేస్తున్నారు. శనివారం కూడా ఈ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వీటి గురించి నేరుగా తెలుసుకోవాలంటే ఈ ప్రదర్శనను తిలకించవచ్చని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement