
గాంధీనగర్: ఆరు నుంచి 12వ తరగతి వరకు సిలబస్‌లో భగవద్గీతను చేరుస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2022–23 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థుల్లో విలువలు, నైతిక ప్రవర్తనను పెంపొందించడానికి స్కూల్ పాఠ్యప్రణాళికలో భగవద్గీతను చేరుస్తున్నట్లు గుజరాత్ విద్యాశాఖ మంత్రి జీతూ వఘానీ చెప్పారు. గుజరాత్ సర్కారు నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ స్వాగతించాయి.