school syllabus
-
స్కూలు సిలబస్‌లో ‘పోక్సో’ చట్టం
తిరునంతపురం: పోక్సో చట్టాన్ని పాఠ్యాంశంగా తీసుకువచ్చేందుకు తాజాగా కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర హైకోర్టు ప్రశంసించింది. పాఠశాల స్థాయి విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించడంలో ఇప్పటికే 12 ఏళ్లు ఆలస్యమైందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ చట్టంపై అవగాహన లేకపోవడంతోనే స్కూలు విద్యార్థులు, టీనేజర్లపై లైంగిక దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. ఇటీవల ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ బెచు కరియన్ థామస్ ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్నారులు, ముఖ్యంగా టీనేజర్లపై లైంగిక నేరాలు ఇటీవల పెరిగి పోయాయని ఆయన అన్నారు. పోక్సో చట్టంలోని తీవ్రమైన శిక్షల గురించి తెలియకనే చాలా మంది విద్యార్థులు పరస్పరం లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారన్నారు. పోక్సో చట్టంపై వారికి ఎలాంటి అవగాహన లేదన్నారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం.. లైంగిక నేరాలు, వాటి పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను పాఠశాల సిలబస్‌లో పోక్సో చట్టం చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ), కేరళ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కేరళ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ కలిసి బడికి వెళ్లే బాలల్లో లైంగిక నేరాలపై అవగాహన కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను హైకోర్టు ప్రశంసించింది. -
ఫామ్‌లోనే లేడు.. పాఠ్య పుస్తకాల్లోకి మాత్రం ఎక్కాడు
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ప్రస్తుత తరంలో టాప్ క్రికెటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అయితే కొంతకాలంగా బాబర్ ఆజం నిరాశజనక ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌లో కెప్టెన్ హోదాలో జట్టును ఫైనల్ చేర్చినప్పటికి.. బ్యాటింగ్‌లో ఘోర ప్రదర్శన చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయని బాబర్ ఆజం.. ఆరు మ్యాచ్‌లు కలిపి 68 పరుగులు మాత్రమే చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 10,9 14, 0,30, 5 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక గోల్డెన్ డక్ ఉండడం విశేషం. అయితే ఆట ఎలా ఉన్నా బాబర్ ఆజం షాట్స్ మంచి టెక్నిక్‌తో కూడుకొని ఉంటాయి. ముఖ్యంగా బాబర్ ఆజం కవర్ డ్రైవ్ షాట్ చూడముచ్చటగా ఉంటుంది. అందుకే అతని కవర్‌డ్రైవ్ షాట్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. తాజాగా తన దేశంలోని పాఠ్య పుస్తకాల్లో బాబర్ ఆజం పేరు దర్శనమిచ్చింది. అవునండీ.. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. బాబర్ ఆజం కవర్ డ్రైవ్ గురించి 9వ తరగతి ఫిజిక్స్ సిలబస్‌లో ఒక ప్రశ్న తయారు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''బాబర్ ఆజం తన బ్యాట్ ద్వారా బంతికి 150 జౌల్స్తో కైనటిక్ ఎనర్జీ అందించడం ద్వారా కవర్ డ్రైవ్‌ను కొట్టాడు. (ఎ) బంతి ద్రవ్యరాశి 120 గ్రా అయితే బంతి ఏ వేగంతో బౌండరీకి వెళుతుంది? (బి) 450గ్రా ద్రవ్యరాశి కలిగిన ఫుట్‌బాల్‌ను ఈ వేగంతో తరలించడానికి ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఎంత కైనటిక్ ఎనర్జీ అందించాలి?" అంటూ ఒక ప్రశ్న వచ్చింది. దీనిపై అభిమానులు మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు. ''ఫామ్‌లోనే లేడు.. అయినా పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కాడు.. దీనికి అతను అర్హుడేనా'' అంటూ కామెంట్ చేశారు. Babar Azam's cover drive related question in 9th grade physics syllabus (federal board) (via Reddit) pic.twitter.com/I2Tc9HldsG — Shiraz Hassan (@ShirazHassan) September 13, 2022 చదవండి: స్మృతి మందాన మెరుపులు.. ఇంగ్లండ్‌పై ఘన విజయం -
సిలబస్‌గా భగవద్గీత.. బీజేపీ నేతలపై మనీష్ సిసోడియా సంచలన కామెంట్స్..
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆప్ కొంత ప్రభావం చూపించింది. ఇదిలా ఉండగా బీజేపీ నేతలను సెటైరికల్‌గా రావణుడితో పోల్చి వార్తల్లో నిలిచారు ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా. వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి గుజరాత్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాల సిలబస్‌లో భాగంగా భగవద్గీతను ప్రవేశపెడతామని గుజరాత్ విద్యాశాఖ మంత్రి జితు వాఘాని గురువారం తెలిపారు. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఇది గొప్ప నిర్ణయం అంటూ మనీష్ సిసోడియా ప్రశంసించారు. ఇంతలోనే బీజేపీ నేతలపై సెటైరికల్‌గా ఓ పంచ్ విసిరారు. గుజరాత్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు భగవద్గీతను బోధించి విలువలు నేర్పించడం కీలక పరిణామం అన్నారు. ఈ క్రమంలోనే భగవద్గీతను పరిచయం చేసే వ్యక్తులు ముందుగా గీతలోని విలువలను ఆచరించాలని సూచించారు. కొందరు వ్యక్తులు గీత గురించి మాట్లాడాతారు.. కానీ వారు పనులు మాత్రం రావణుడిలా ఉంటాయని పరోక్షంగా బీజేపీ నేతలపై సెటైర్లు వేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఢిల్లీలో ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులతో హోలీ సందర్భంగా సంబురాలు జరుపుకున్నారు. దేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. -
గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం
గాంధీనగర్: ఆరు నుంచి 12వ తరగతి వరకు సిలబస్‌లో భగవద్గీతను చేరుస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2022–23 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థుల్లో విలువలు, నైతిక ప్రవర్తనను పెంపొందించడానికి స్కూల్ పాఠ్యప్రణాళికలో భగవద్గీతను చేరుస్తున్నట్లు గుజరాత్ విద్యాశాఖ మంత్రి జీతూ వఘానీ చెప్పారు. గుజరాత్ సర్కారు నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ స్వాగతించాయి. -
విద్యార్ధులకు నైతికత నేర్పిద్దాం : కేసీఆర్
మంచిని కాపాడటం కోసం కఠినంగా వ్యవహరించడం తప్పుకాదు. కర్తవ్య నిర్వహణలో అది అవసరం కూడా. ప్రజల మనోభావాలను గుర్తించి, గౌరవించి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అది తప్పు కాదు. – కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: సమాజంలో నేర ప్రవృత్తి పెరగకుండా నైతిక విలువలు పెంపొందించే విధంగా విద్యావిధానం ఉండా లని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిలషించారు. మంచి సమాజాన్ని నిర్మించే క్రమంలో జీయర్ స్వామి లాంటి ధార్మికవేత్తలు, మాజీ డీజీపీల సలహాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యాసంస్థల్లో నైతిక విలువలు పెంపొందించే బోధనలు ప్రారంభిస్తామని ప్రకటించారు. మాజీ డీజీపీ హెచ్.జె. దొర ఆటోబయోగ్రఫీ ‘జర్నీ థ్రూ టర్బులెంట్ టైమ్స్’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. దొర తన సర్వీసు కాలంలో ఎదుర్కొన్న క్లిష్టమైన సందర్భాలను వివరిస్తూ ఇతర పోలీసు అధికారులకు స్ఫూర్తినిచ్చేలా ఈ పుస్తకం రాశారు. పుస్తక రచయితను, ప్రచురణకర్తలను సీఎం సన్మానించారు. దొరను మనసారా అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభన్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, విజిలెన్స్ కమిషనర్ కె.ఆర్.నందన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, దొర గురువు ఆచార్య ఆర్వీఆర్ చంద్రశేఖర్‌రావు, ప్రముఖ పాత్రికేయులు ఐ.వెంకట్రావు, దొర స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే... రాష్ట్రాన్ని ఆదర్శ సమాజంగా తీర్చిదిద్దాలి... దురదృష్టవశాత్తూ సమాజంలో నేర ప్రవృత్తి పెరుగు తోంది. కొన్ని చోట్ల మనుషులు మృగాల్లా మారుతు న్నారు. నేర ప్రవృత్తి ప్రబలకుండా చూడాల్సిన అవసరం ఉంది. విద్యాసంస్థల్లో పిల్లలకు మంచి విద్యాబోధన చేయడం ద్వారానే నైతిక విలువలు పెంపొందించవచ్చు. దీనికోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యాసంస్థల్లో విలువలు పెంపొందించే పాఠ్యాంశాలను బోధించాలని భావిస్తున్నాం. ఇందుకు అవసరమైన పాఠ్యాంశాలను తయారు చేయాలి. మాజీ డీజీపీలతో కమిటీ వేస్తాం. జీయర్ స్వామి లాంటి ఆధ్యాత్మిక, ధార్మికవేత్తల సలహాలు తీసుకుంటాం. మంచి సమాజం నిర్మించేందుకు అవసరమైన బోధనలను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తాం. తెలంగాణను ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దడానికి పోలీసులు కూడా తమ విలువైన భాగస్వామ్యం అందించాలి. ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా ... మంచిని కాపాడటం కోసం కఠినంగా వ్యవహరించడం తప్పుకాదు. కర్తవ్య నిర్వహణలో అది అవసరం కూడా. ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుంది. ప్రజల మనోభావాలను గుర్తించి, గౌరవించి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అది తప్పు కాదు. సమాజానికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు కొన్ని పనులు కఠినంగా చేయక తప్పదు. సామాజిక రుగ్మతలపైనా పోలీసుల పోరు... డీజీపీ మహేందర్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పోలీసులు సామాజిక రుగ్మతలను తొలగించే విషయంలో ఎంతో కృషి చేస్తున్నారు. కేవలం శాంతిభద్రతల పర్యవేక్షణకే పరిమతం కాకుండా సామాజిక బాధ్యతతో అనేక కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నారు. గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల మూసివేత, బియ్యం అక్రమ రవాణా నిరోధం, హరితహారం ద్వారా మొక్కల పెంపకంలో ఎంతో కృషి చేశారు. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించే రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూడా పోలీసులు వారి వంతు పాత్ర పోషించాలి. ఈ సంవత్సరమే సంపూర్ణ అక్షరాస్యత సాధించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపడుతోంది. అందులో పోలీసులు భాగస్వాములై విజయవంతం చేయాలి. చదువుకోని వారందరినీ అక్షరాస్యులగా మార్చే ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఇది మంచి పుస్తకం... హెచ్‌జే దొర తన అనుభవాన్నంతా రంగరించి మంచి పుస్తకం రాశారు. టీమ్ వర్క్‌తో విజయాలు ఎలా సాధించవచ్చో, క్లిష్టమైన సమయాల్లో వ్యూహాత్మంగా ఎలా వ్యవహరించాలో, నేరాలను అదుపు చేయడంలో ఎలాంటి పద్ధతులు అవలంబించాలో, ఉన్న వనరులతో ఎంత సమర్థంగా పనిచేయవచ్చో దొర అనుభవం ద్వారా నేర్పారు. పుస్తకంలో కూడా అనేక విషయాలు చెప్పారు. వాటన్నింటినీ స్ఫూర్తిగా తీసుకొని పోలీసు అధికారులు ముందుకు సాగాలి. మానవ జీవితంలో మార్పులు అనివార్యం. ఎప్పటికప్పుడు వచ్చే మార్పులకు అనుగుణంగా మనం కూడా మారుతూ కార్యాలు నెరవేర్చాలి. సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చి నిష్ణాతులను చేయాలి. వారిలో ప్రొఫెషనలిజం పెరగాలి. దీనికి అవసరమైన చర్యలు డీజీపీ తీసుకోవాలి. మనమెవరమూ వెయ్యేళ్లు బతకడానికి రాలేదు. జీవించిన కాలంలో ఎంత గొప్పగా బతికాం, ఎంత ఆదర్శంగా నిలబడ్డాం అనేది ముఖ్యం. దొర అలాంటి వారిలో ఒకరు. గ్రేహౌండ్స్‌ను తీర్చిదిద్ది ఇప్పటికీ అందులో శిక్షణ ఇస్తున్న భాటి లాంటి వారు ఆదర్శప్రాయులు. ప్రవీణ్ కుమార్‌కు సంపూర్ణ మద్దతు.. దేశంలో మనం ఏ ఊరికి వెళ్లి వెతికినా దళితులే పేదలుగా కనిపిస్తున్నారు. ఈ పరిస్థితి పోవాలి. దళితులు ఎదగాలి. తెలంగాణలో దళితులను విద్యావంతులను చేయడానికి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఎంతో కష్టపడుతున్నారు. దళితులను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలనే ప్రవీణ్ సంకల్పానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. దళితుల్లో న్యూనతాభావాన్ని తీసేసి తాము గొప్ప పాఠశాలల్లో చదువుతున్నామనే భావన కల్పిస్తున్నారు. ఇలాంటి వాళ్లను ప్రోత్సహించాలి. పోలీసులు నిస్సహాయులు కాదు: దొర పోలీసులు నిస్సహాయులనే భావనకు లోనుకావద్దని, ఉన్న వనరులను సమర్థంగా వాడుకోవాలని హెచ్‌జే దొర సూచించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ప్రజోపయోగ పనులు జరుగుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, రెసిడెన్షియల్ స్కూళ్లు, ప్రజావైద్యం మెరుగుదల, చెరువుల పునరుద్ధరణ పనులు తెలంగాణ రాష్ట్రానికి గొప్ప సంపదగా మిగులుతాయన్నారు. భవిష్యత్తులో చాలా మంది మేటి విద్యార్ధులు తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎంచుకున్న శాంతియుత పంథా వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్రావు పేర్కొన్నారు. 1969 ఉద్యమం హింసాత్మకం కావడం వల్లే విజయవంతం కాలేదన్నారు. తెలంగాణలో పోలీసు శాఖకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని, దీనివల్ల శాంతిభద్రతల పర్యవేక్షణ సులభమైందని చెప్పారు. తెలంగాణ పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని, దేశంలో తెలంగాణ పోలీసలు అందుకున్న అవార్డులు ఎవరూ అందుకోలేదని మాజీ డీజీపీ రొడ్డం ప్రభాకర్‌రావు కితాబిచ్చారు. ప్రభుత్వం పోలీసు శాఖకు తగినన్ని నిధులు సమకూరుస్తూ పోలీసు శాఖను ఆధునీకరించిందని ప్రశంసించారు. సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు మాట్లాడుతూ కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ పోలీసులు అద్భుత విజయాలు సాధించారన్నారు. పూర్వ అధికారుల నుంచి ఎంతో నేర్చుకోవడం ద్వారా ఇప్పుడు పనిచేస్తున్న పోలీసు అధికారులు పెను మార్పులు తీసుకురావడం సాధ్యమవుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. -
లింగ సున్నితత్వ విద్య అవసరం
బాలికలపై, మహిళలపై మగవారు అత్యాచారాలు, దురాగతాలకు ఎందుకు పాల్పడతారు? వారికి ‘అలా ప్రవర్తించకూడదు’ అని బాల్యంలో బలంగా మనసులో నాటుకోవడంలేదు. దానికి భిన్నమైన భావనలు నాటుతున్నారు. దీనికి దీర్ఘకాలిక పరిష్కారం చూడాలి. అది బడి లోనే సాధ్యం. విద్యా కాలం దాటేలోపుగానే వారిలో లింగ సున్నితత్వం ఏర్పరచాలి. ఇందుకు ఒక చిన్న పుస్తకం కావాలి. ప్రాథమిక తరగతులకు ఇరవై పేజీలు ఉంటే సరిపోతుంది. ఆరో తరగతి నుంచీ అటూఇటుగా ముప్పై, నలభై పేజీలు చాలు. ఈ పుస్తకాన్ని మొదటి సబ్జెక్టుగా పెట్టాలి. అన్ని పరీక్షలకన్నా ముందు ఒక ఇరవై మార్కులకి ఈ పరీక్ష జరగాలి. ఈ పరీక్ష ఉత్తీర్ణత ప్రధానమైనదిగా కాక, భాగస్వామ్య ప్రధానంగా సాగాలి. పుస్తకంలో పేజీలు ఒకటి బాలుర కోసం, పక్కనే ఇంకొకటి బాలికల కోసం వుండాలి. అంటే, ఒక పేజీ సమాజంలో ఎదిగే బాలుడిని లక్ష్యంగా చేసుకుని తయారు చేయాలి, ఒక పేజీ బాలికల గురించి. ఉదాహరణకి, ఆరో తరగతిలో ఒక పేజీలో, ‘ఒసే, ఏమే, అది, ఇది అని నీ తరగతిలో బాలికలను పిలవకూడదు. వారి పేర్లతోనే వారిని పిల వాలి’ అని రెండు వాక్యాలు ఇవ్వాలి. దాని గురించి చిన్న చర్చ. ‘అది’ ‘ఇది’ అని తరగతిలో వేటిని పిలుస్తాము? బాలికలకీ ఆ వస్తువులకీ తేడాలు ఏమిటి? బాలిక వస్తువు కాదు, ఒక మనిషి అని చెప్పాలి. అక్కడే ఒక బొమ్మ, వస్తువులకీ; ప్రాణం, అనుభూతులు గల బాలికకూ తేడా చూపేవిధంగా పెట్టాలి. పేజీ చివర, చిన్న ఖాళీ పంక్తులలో, వారు పేరు పెట్టి పిలిచే వ్యక్తులు ఎవరు? పై సంబోధనలు చేసేది ఎవరిని? ఎందుకు? ఈ అలవాటు ఎందుకు మానెయ్యాలి? అని స్పందన పత్రం రాయాలి. ఇలాగే, ఎనిమిదో తరగతి పిల్లవాడికి, ‘మగ పిల్లలకి మీసాలు రావడం సహజం. వాటిని మెలి తిప్పడంలో ఏవిధమైన ప్రత్యేకతా లేదు. అలాగే, తొడ కొట్టడం వల్ల కొత్త బలం రాదు. బల ప్రదర్శనా పోటీలో కూడా, విజేత హుందాగా గెలవాలి. పురుషత్వం ఒక సహజమైన అంశం. అది గొప్పా కాదు, తక్కువా కాదు’ అని రాయాలి. ఇంకా, నీ చెల్లీ/అక్కా, నువ్వూ ఒక్కసారే భోజనం చేస్తు న్నారా? మీ అమ్మా నాన్నా ఒకే విధంగా ఆహారం తీసుకుంటున్నారా? ముందు ఎవరు తింటున్నారు? ఎందుకు? ఎలా వుంటే బావుంటుంది? అని ప్రశ్నించవచ్చు. అదే పుస్తకంలో బాలికలకు కూడా వాళ్లకి నేర్పవలసిన సంగతులు వుండాలి. ఉదాహరణకు ఒరే, పోరోయ్ అని కాకుండా బాలురని పేరుతో పిలవాలి. ఇంటి విషయాల్లో బాలికలు అన్ని రకాలుగా సమాన భాగస్వాములు. తల్లి, తండ్రి, రోజంతా పని చేసిన తరువాత; పిల్లలు బడి సమయం పూర్తి అయిన తరువాత, విశ్రాంతి కోసం చేరే స్థలాన్ని ‘ఇల్లు’ అంటాము. మీ ఇల్లు మీ కుటుంబం మొత్తానిది. దాని బాధ్యతలు కూడా అందరివీ. ఒక పేజీలో వంట ఇంట్లో పని చేస్తున్న మొత్తం కుటుంబ సభ్యుల చక్కని పెయింటింగ్/ఫొటో ప్రచురించాలి. ఇల్లు భవిష్యత్తులో నేను ‘పూర్తి’ సమయం ఉండవలసిన స్థలం అనే భావన నుంచి బాలికలు బైటికి రావాలి. బాలురు కూడా, ఇల్లు స్త్రీకి చెందినది అనే భావన నుంచి బైటికి రావాలి. ఇలా ఒక పుస్తకం చేసి, దాన్నొక వేడుకగా పిల్లలకి ఇద్దాం. పెద్ద ఖర్చు కూడా కాదు. వచ్చే విద్యా సంవత్సరంనుంచీ ప్రభుత్వం విద్యా రంగంలో మార్పులు తేబోతోంది కాబట్టి, లింగ సున్నితత్వం విద్యా ప్రణాళికలో చేర్చడానికి ఇదే సరైన సమయం. ఈ పుస్తకాన్ని పిల్లలకు వారి వారి సొంత భాషలోనే అందించాలి. ఇక్కడ నేను వ్యక్తీకరించినవి ప్రాథ మిక భావనలు. వీటిని మరింత మెరుగు చేసుకుని ఒక చక్కని సమాజాన్ని నిర్మించుకోవడానికి పిల్లలకోసం కొన్ని రంగు బొమ్మల పేజీలు ముద్రించగలం కదా. ఎమ్మెస్కే. కృష్ణ జ్యోతి వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్ మొబైల్: 91107 28070 -
వారిద్దరు ఉగ్రవాదులట!
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో పాఠశాల సిలబస్‌లో స్వాతంత్ర్య సమరయోధులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం వివాదాస్పదంగా మారింది. విప్లవ వీరులు కుదీరాం బోస్, ప్రఫుల్లా చాకీల చర్రితను బెంగాల్లో పాఠశాలలో పాఠ్యాంశంగా చేర్చారు. అయితే వారిని ఉగ్రవాదులంటూ తప్పుగా ముద్రించారు. దీనిపై రాష్ట్రంలో పెద్ద దుమారమే చెలరేగింది. సంబంధిత అంశంపై ప్రతిపక్ష వామపక్షాలు, కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్యం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం ఏంటనీ ప్రశ్నించారు. దీనిపై ఆ రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ తప్పును సరిదిద్దుకుంటామని తెలిపారు. అతివాదులుగా ముద్రించబోయి ఉగ్రవాదులుగా తప్పద్దం జరిగిందని వివరించారు. కాగా వారి చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంపై జేడీయూ ఇదివరకే తప్పుబట్టిన విషయం తెలిసిందే. అతివాదులైన వారిద్దరి పేర్లు సిలబస్ నుంచి తక్షణం తొలగించాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి జేడీయూ లేఖ రాసింది. -
పాఠ్యాంశంగా ‘అభినందన్’
జైపూర్: భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ధీరత్వం రాజస్తాన్ స్కూలు విద్యార్థులకు పాఠ్యాంశం కానుంది. ఆ రాష్ట్ర విద్యా మంత్రి గోవింద్ సింగ్ దోతస్రా అభినందన్ ధైర్యసాహసాలను పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించినట్టు ట్విట్టర్లో వెల్లడించారు. ‘పాకిస్తాన్ సైనికులకు చిక్కి, ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా అభినందన్ ప్రదర్శించిన పోరాటపటిమ ప్రశంసనీయం. అది భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలి. వింగ్ కమాండర్ అభినందన్‌ను గౌరవిస్తూ ఆయన సాహసాన్ని స్కూలు సిలబస్‌లో చేర్చబోతున్నాం’ అని వెల్లడించారు. ఇటీవల పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్–16 విమానాన్ని కూల్చివేసి, శత్రుదేశానికి పట్టుబడి కూడా సాహసోపేతంగా వ్యవహరించిన అభినందన్ స్వదేశానికి సురక్షితంగా తిరిగివచ్చిన విషయం తెలిసిందే. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల గాథలను కూడా పాఠ్యాంశాలుగా చేర్చాలని ఇటీవలే రాజస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. -
'పారిశ్రామిక రంగానికి ఉపయోగపడేలా సిలబస్'
హైదరాబాద్: పారిశ్రామిక రంగానికి ఉపయోగపడేలా సిలబస్ లో మార్పులు తీసుకొస్తున్నట్లు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం వృత్తి విద్యకు సంబంధించి సిలబస్ మార్పులపై సచివాలయంలో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్ ,జగదీష్ రెడ్డితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తరగతి పాఠ్యాంశాల్లో మార్పు చేర్పులపై చట్టం తెచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు. పారిశ్రామిక రంగానికి ఉపయోగపడేలా సిలబస్ లో మార్పులు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యారంగంలో మార్పులకు ఇది తొలి మెట్టు అని ఆయన తెలిపారు. -
నా జీవితం పాఠంగానా.. వద్దండీ..!
-
నా జీవిత కథ పాఠ్యాంశమా... వద్దు వద్దు
తన జీవిత కథను పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం స్పందించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. దేశంలో ఎందరో మహనీయులు ఉన్నారని, వారి జీవిత కథలను పాఠ్యాంశాలుగా చేరిస్తే పాఠశాల విద్యార్థులు మరింత స్పూర్తి పొందిన వారు అవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. భారత ప్రధాని పీఠాన్ని అధిరోహించిన నరేంద్ర మోడీ జీవిత కథను పాఠ్యాంశంగా చేర్చాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న నరేంద్ర మోడీ శుక్రవారం తన ట్విట్టర్లోపై విధంగా స్పందించారు. I firmly believe that the life story of living individuals should not be included as a part of the school curriculum. — Narendra Modi (@narendramodi) May 30, 2014 నరేంద్రమోడీ జీవితంలోని విశేషాలతో కూడిన వివిధ అంశాలను పాఠ్యాంశంగా చేయాలని నిర్ణయించినట్లు గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూపేంద్ర సిన్హా చుడాసమా గురువారం ప్రకటించారు. మోడీ జీవితానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలను ఎంపిక చేసి ఆ పాఠ్యాంశంలో పొందుపరిచేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 5,6, 7 తరగతులలో ఆ పాఠ్యాంశాన్ని పొందుపరుస్తామని ఆయన వివరించారు. వచ్చే విద్యాసంవత్సరం 2015-16 నుంచి అమలులోకి వస్తుందని విశదీకరించారు. అయితే నరేంద్రమోడీ జీవితం సూర్ఫిదాయకమని... ఆయన కథను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా చేరిస్తే మరింత మంది విద్యార్థులు మోడీలా తయారవుతారని మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల నుంచి అభిప్రాయాలను కోరుతున్నట్లు ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పరాస్ జైన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దేశంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మొగించింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. గుజరాత్ రాష్ట్రంలో సాధారణ కుటుంబానికి చెందిన నరేంద్ర మోడీ.... జీవితంలో ఎదుర్కొన్న ఆటు పోట్లతోపాటు అంచెలంచెలుగా ఎదిగిన క్రమాన్ని పాఠశాల విద్యార్థులకు వివరించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలంటూ మోడీ తన అభిప్రాయాన్ని వెల్లడించి ఆయా ప్రభుత్వాల ఆశలపై నీళ్లు చల్లారు.