కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో పాఠశాల సిలబస్‌లో స్వాతంత్ర్య సమరయోధులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం వివాదాస్పదంగా మారింది. విప్లవ వీరులు కుదీరాం బోస్, ప్రఫుల్లా చాకీల చర్రితను బెంగాల్‌లో పాఠశాలలో పాఠ్యాంశంగా చేర్చారు. అయితే వారిని ఉగ్రవాదులంటూ తప్పుగా ముద్రించారు. దీనిపై రాష్ట్రంలో పెద్ద దుమారమే చెలరేగింది. సంబంధిత అంశంపై ప్రతిపక్ష వామపక్షాలు, కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్యం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం ఏంటనీ ప్రశ్నించారు. దీనిపై ఆ రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠికి కూడా ఫిర్యాదు చేశారు.
అయితే దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ తప్పును సరిదిద్దుకుంటామని తెలిపారు. అతివాదులుగా ముద్రించబోయి ఉగ్రవాదులుగా తప్పద్దం జరిగిందని వివరించారు. కాగా వారి చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంపై జేడీయూ ఇదివరకే తప్పుబట్టిన విషయం తెలిసిందే. అతివాదులైన వారిద్దరి పేర్లు సిలబస్ నుంచి తక్షణం తొలగించాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి జేడీయూ లేఖ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment