పాట్నా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని స్కూల్ సిలబస్ లో విప్లవ నేతల పేర్లను ఉగ్రవాదులుగా చూపడంపై వివాదాలకు దారి తీస్తోంది. విప్లవ నేతలైన కుదిరం బోస్ మరియు ప్రఫుల్లా చాకీల పేర్లను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ స్కూల్ సిలబస్ లో చేర్చుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ లో ప్రవేశపెట్టడాన్నిజేడీయూ తప్పుబట్టింది. ఆ నేతల పేర్లను వెంటనే సరిచేయాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేసింది. విప్లవకారులైన ఆ ఇద్దరీ పేర్లను అతివాదులుగా చేర్చడాన్ని మమతా ప్రభుత్వం తిరిగి సరిచేసుకోవాలని సూచించింది.
ఈ మేరకు మమతా బెనర్జీకి జేడీయూ ఎమ్మెల్సీ మరియు అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ ఒక లేఖను రాశారు. పశ్చిమ బెంగాల్ సెకండరీ ఎడ్యుకేషన్ లో ఎనిమిదో తరగతిలో చేర్చిన ఆ విప్లవ నేతల పేర్లను సరిచేయాలని విన్నవించారు. ప్రఫుల్లా చాకీ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర ఉందని..ఆమె బోస్ తో కలిసి పనిచేసిందన్నారు. 1908, ఏప్రిల్ 30 వ తేదీన కుదిరం బోస్ ఒక బ్రిటీష్ వాహనంపై దాడి చేసిన సంగతి ఈ సందర్భంగా కుమార్ గుర్తు చేశారు.