'పారిశ్రామిక రంగానికి ఉపయోగపడేలా సిలబస్'
హైదరాబాద్: పారిశ్రామిక రంగానికి ఉపయోగపడేలా సిలబస్ లో మార్పులు తీసుకొస్తున్నట్లు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం వృత్తి విద్యకు సంబంధించి సిలబస్ మార్పులపై సచివాలయంలో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్ ,జగదీష్ రెడ్డితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తరగతి పాఠ్యాంశాల్లో మార్పు చేర్పులపై చట్టం తెచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు.
పారిశ్రామిక రంగానికి ఉపయోగపడేలా సిలబస్ లో మార్పులు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యారంగంలో మార్పులకు ఇది తొలి మెట్టు అని ఆయన తెలిపారు.