
భగవద్గీత అంతర్జాతీయ గ్రంథం
ప్రపంచంలోని అన్ని ప్రధాన భాషలలోకి అనువాదమైన మహత్తర గ్రంథం భగవద్గీత. మహాత్మాగాంధి, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, మాక్స్‌ముల్లర్, దారాషికో, ఆర్నాల్డ్ ఎడ్వర్డ్ వంటి దేశదేశాల ప్రముఖులందరి ప్రశంసలు పొందిన భగవద్గీత మత గ్రంథం కాదు. అది మన జాతీయ గ్రంథం మాత్రమే కాదు.. అంతర్జాతీయ గ్రంథం కూడా!
‘‘నా ప్రజా జీవిత ప్రస్థానంలో అడుగడుగునా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉం టాయి. అప్పుడు నాకు ఒక విధమైన ఆందోళన, కర్తవ్య విమూఢత్వం, నిస్పృహ చోటు చేసుకుంటాయి. ఇక ముందుకు వెళ్లలేమన్న నిరా సక్తత ఏర్పడుతుంది. అప్పు డు వెంటనే ‘భగవద్గీతలోని గీతాకారుని దివ్యబోధ - క్షుద్రం హృదయ దౌర్భల్యం..’ అన్న మహా త్ముక్తి, ఆ వెంటనే ‘కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన ..’ అన్న మరో శ్లోకం కనిపిస్తుంది.
‘కర్తవ్య విమూఢత్వాన్ని విడనాడు. నీ విధిని నువ్వు నిర్వర్తించు’ అన్న వాక్యం చదవగానే నాకు ఎక్కడలేని ఆత్మవిశ్వాసం కలుగుతుంది.’’ ‘భగవద్గీత’ను గురించి ఈ మాటలన్నది ఎవరో కాదు సాక్షాత్తు జాతిపిత మహాత్మాగాంధి. సరే! ఆయన భారతీయుడు కాబట్టి, భగవ ద్భక్తుడు కాబట్టి ‘భగవద్గీత’ పట్ల భక్తి ప్రపత్తులు ఉండడం సహజమని అనుకుందాం. మరి, ఎడ్వర్డ్ ఆర్నాల్డ్ భారతీయుడు కాదే! ఆయన బ్రిటీష్ కవి. భగవద్గీతను ఇంగ్లిషులోకి తర్జుమా చేసింది ఆయనే! ఆ ఇంగ్లిషు భగవద్గీత వెలువడక పూర్వం మహాత్మాగాంధి తన మాతృ భాష గుజరాతీలో ఉన్న ‘భగవద్గీత’ను చదవనే లేదు! ఆయన ‘భగవద్గీత’ సారాంశాన్ని, సందే శాన్ని తెలుసుకున్నది ఆర్నాల్డ్ అనువదించిన ఇం గ్లిషు గ్రంథం నుంచే! అంతవరకు ఎందుకు? ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఎవ రు? ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త. సాపేక్ష సిద్ధాంత కర్త. అణుశక్తికి మూలకారకమైన పదార్థాన్ని కను గొన్న మహామేధావి. ‘కొన్ని సందర్భాలలో నాకు దారీ తెన్ను కాన రానప్పుడు, కర్తవ్య విమూఢత్వం నన్ను ముప్పి రిగొన్నప్పుడు ‘భగవద్గీత’ పేజీలు తిరగవేయగానే నాకు గాఢాంధకారంలో వెలుగు కానవస్తుంది. నేను ‘భగవద్గీత’ పాఠకుణ్ణి’ అన్న ఐన్‌స్టీన్ అమె రికాలో స్థిరపడిన జర్మన్ యూదీయుడు.
దారాషికో ఎవరు? మొగల్ చక్రవర్తులలో అయిదవ వాడైన షాజహాన్ పెద్ద కొడుకు. దారా ‘భగవద్గీత’తో ప్రభావితుడై ఆ మహాగ్రంథాన్ని అప్పటి మొగల్ చక్రవర్తుల అధికార భాష ‘పర్షి యన్’లోకి తర్జుమా చేశాడు! దారా సోదరుడైన ఔరంగజేబు మతోన్మాది. అతడు ఆగ్రహోదగ్రుడై అన్నను జైలులో పెట్టించాడు!
ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్ ప్రసిద్ధ జర్మన్ పం డితుడు. ‘భగవద్గీత’తో ప్రభావితుడైన వారిలో మరో ప్రముఖుడు.
ఆ మహత్తర గ్రంథం ప్రపంచంలోని అన్ని ప్రధాన భాషలలోకి అనువదించబడింది. 19వ శతాబ్దిలోనే రష్యన్ భాషలోకి తర్జుమా చేశారు. అయితే ‘భగవద్గీత’ ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతు న్నదని ఆ మధ్య రష్యన్ న్యాయస్థానంలో ఒక ప్రబుద్ధుడు కేసు వేశాడు. సుదీర్ఘ విచారణ, చర్చల తరువాత రష్యన్ న్యాయస్థానం కేసు కొట్టివేసింది. అంతేకాక, భగవద్గీత కర్తవ్య విమూఢులకు కర్తవ్య పథం నిర్దేశిస్తున్నదని, విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చా లని ప్రబోధిస్తున్నదని కోర్టు పేర్కొన్నది! కాగా, ‘భగవద్గీత’ ఒక మతగ్రంథమనడం అనుచితం. గీతాకారుడు ‘భగవద్గీత’ను ప్రవచించి, ఇప్పటికి 5,151 సంవత్సరాలు.
అప్పటికి ఇప్పటి మతాలు ఏమీ లేవే! భగవద్గీతలో ఎక్కడా ‘హిందూ’ అన్న పదమే కానరాదు! అన్ని మతాలకు స్థాపకులున్నా రు కాని హిందూ మత స్థాపకులెవరు? అన్ని మతా ల స్థాపకులు, లేదా ప్రవక్తల పేర్లు చెప్పవచ్చు కాని, ‘హిందూ మత’ స్థాపకులెవరని చెప్పగలరా? ‘హిందూ’ అన్నది ఒక ధర్మానికే కాని ఒక మతానికి పేరు కాదు. మరి ‘భగవద్గీత’ ఒక మతగ్రంథమైతే, ఐన్‌స్టీన్, దారాషికో, ఆర్నాల్డ్ ఎడ్వర్డ్, ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్, రష్యన్ కోర్టు - వీరెవ్వరూ ఆ ‘మతానికి’ చెందిన వారు కారే! ఆ మహాద్గ్రం థాన్ని ఎందుకు అంతగా ప్రశంసించారు? కాగా, ‘భగవద్గీత’ మత గ్రంథం కాదు. జాతీ య గ్రంథం మాత్రమే కాదు- అంతర్జాతీయ గ్రం థం కూడా! అందువల్ల ‘భగవద్గీత’ను జాతీయ గ్రంథం చేయాలనడంలో తప్పేమున్నది?
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు)
మొబైల్: 98483 17533
- డా॥తుర్లపాటి కుటుంబరావు