సాక్షి, అమరావతి: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ‘మానవాళికి కర్తవ్యబోధ చేసిన భగవద్గీత.. సన్మార్గానికి కలకాలం అండగా ఉంటుంది. అటువంటి భగవద్గీతను ప్రసాదించిన భగవాన్ శ్రీకృష్ణుడి పుట్టినరోజు అందరికీ పర్వదినం. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమ తత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నాను’ అని సీఎం పేర్కొన్నారు.
కర్తవ్యదీక్షను జీవనసూత్రంగా తెలిపిన గీతాచార్యుడు శ్రీకృష్ణుడు. ప్రేమ, స్నేహం, ధర్మాచరణ ఆయన బోధించిన పాఠాలు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.#KrishnaJanmashtami
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 19, 2022
Comments
Please login to add a commentAdd a comment