'హిందూ సంప్రదాయంలోనే పెళ్లి' | Gabbard to marry in April in Vedic ceremony | Sakshi
Sakshi News home page

'హిందూ సంప్రదాయంలోనే పెళ్లి'

Published Thu, Feb 19 2015 2:12 PM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

'హిందూ సంప్రదాయంలోనే పెళ్లి'

'హిందూ సంప్రదాయంలోనే పెళ్లి'

వాషింగ్టన్: యూఎస్ కాంగ్రెస్లో మొట్టమొదటి హిందు సభ్యురాలు తులసీ గబార్డ్ (33) త్వరలో పెళ్లి కూతురు కాబోతున్నారు. సినిమాటోగ్రాఫర్ అబ్రహం విలియమ్స్ (26) ను ఆమె వివాహం చేసుకోనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరగనున్న వివాహం ద్వారా తాము ఒక్కటవుతున్నామని మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గురువారం ఆమె వెల్లడించింది.  తమ వివాహం హిందు సంప్రదాయ పద్దతుల్లోనే జరుగుతుందని తెలిపింది.

ఇద్దరికి వివాహ నిశ్చితార్థం జరిగి నెల రోజులు దాటిందని పేర్కొంది. నిశ్చితార్థ సమయంలో డైమండ్ రింగ్ చేతి వేలికి తొడిగారని చెప్పారు.
బోళాతనం, మంచితనం మూర్తిభవించిన వ్యక్తి అని అబ్రహం సుగుణాలను తులసీ ఈ సందర్భంగా కీర్తించారు. విలియమ్స్ ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్గా విధులు నిర్వహిస్తూ ... మరో వైపు షార్ట్ ఫిల్మ్స్తోపాటు రాజకీయ, వాణిజ్య ప్రకటనల కోసం అడ్వర్టజమెంట్లు రూపొందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement