మంచిర్యాల: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో కరెంటు షాక్ తో ఇద్దరు మృతి చెందారు. స్దానిక ఎంఎం సూపర్ మార్కెట్‌లో బుధవారం వేకువజామున ఏసీ బిగిస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ కొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతి చెందిన యువకులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాస్, బుజ్జిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.