అమలాపాల్
‘‘ఈ మధ్య కాలంలో నా దగ్గరకు వచ్చిన అన్ని స్క్రిప్ట్‌లు అబద్దాలతో నిండినవే. దాంతో విసిగిపోయి ఇక సినిమాలను వదిలేద్దాం అనుకుంటున్న సమయంలో ‘ఆడై’ సినిమా నా దగ్గరకు వచ్చింది’’ అన్నారు అమలాపాల్. రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ నటించిన చిత్రం ‘ఆడై’. అంటే బట్టలు అని అర్థం. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా నటించారు అమలాపాల్. ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం రిలీజ్ చేశారు.
చెన్నైలో జరిగిన ఈ వేడుకలో అమలాపాల్ మాట్లాడుతూ – ‘‘ఆడై’ స్క్రిప్ట్ ఫస్ట్ పేజీ చదవగానే షాక్ అయ్యాను. ఈ సినిమాకు నిర్మాత కూడా దొరికారా? అని ఆశ్చర్యపోయాను. ‘ఆడై’ అనేది చాలా క్రేజీ ఫిల్మ్. నటిగా మనం ఒక సైడ్‌ని మాత్రం చూపిస్తాం. ఎందుకంటే మనకు మనమే ఓ పరిధి గీసేసుకుంటాం. కానీ ఈ సినిమా ద్వారా కొత్త అమలాపాల్‌ని కనుగొన్నాను. నాలో అలాంటి ఒక అమ్మాయి ఉంటుంది అనే విషయానే ఇన్నేళ్లూ నేను గుర్తించలేదు’’ అన్నారు. ‘ఆడై’ చిత్రం ‘ఆమె’ పేరుతో తెలుగులో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment