
తండ్రి మరణాంతరం తన జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయంటూ హీరోయిన్ అమలా పాల్ భావోద్యేగానికి లోనయ్యారు. తన తండ్రి మరణం తనని, తన తల్లిని ఎంతగానో కుంగదీస్తోందంటూ తన తల్లి అన్నీ పాల్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో గురువారం షేర్ చేశారు. ‘తల్లిదండ్రులను కోల్పోవడం అనేది వర్ణించలేని బాధ. ఇది ఒక పెద్ద పతనం కూడా. ఎప్పుడూ చూడని చీకటిని చూస్తాం. విభిన్న భావోద్యేగాలకు గురవుతాం. క్యాన్సర్‌తో నా తండ్రిని కోల్పోయిన అనంతరం నా జీవితంలో ఎన్నో మార్పులు రావడం నేను గమనించాను’ అంటూ భావోద్యేగ లేఖ రాసుకొచ్చారు. (అమలాపాల్ ఇంట తీవ్ర విషాదం)
అదే విధంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న మనుషులు తమను తాము ఎలా కోల్పోతారో వివరిస్తూ.. ‘‘మనమంతా ఒక అందమైన ప్రపంచంలో జీవిస్తుస్తాము. అలాగే మన ప్రతి కదలికను, ఆలోచనను నిర్దేశించే సామాజిక నిబంధనలతో కూడిన ప్రపంచంలో కూడా జీవిస్తుస్తాము. ఎలా అంటే చిన్న వయస్సు నుంచే షరతులతో కూడి.. బాధాకరమైన అనుభవాలతో మనలోని చిలిపి తనాన్ని ఓ పెట్టెలో బంధించేంతగా. ఈ జీవిత పోరాట పందెంలో మనమంతా బాధలను భరించడం తప్పా.. మనల్ని మనం ప్రేమించడం కూడా మరచిపోయి మనలోని పిల్లల మనస్తత్వాన్ని అనుమతించలేనంతగా మారిపోతాం’’ అంటూ తాను ఎదుర్కొంటున్న చేదు అనుభవాన్ని వివరించారు. కాగా అమలా తండ్రి పాల్ వర్గీస్ క్యాన్సర్‌తో జనవరి 22న మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ భామ ‘అధో ఆంధ పరవై పోలా’, ‘ఆదు జీవితం’, ‘కాడవర్, లస్ట్ స్టోరీస్’ వంటి రీమేక్‌లో నటిస్తున్నారు. (అమలాపాల్ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి)