
అహో అమలాపాల్ ఏమీ ఈ వైరాగ్యం? ఆశలు ఆవిరయ్యాయా? లేక ఆడంబర జీవితంపై విరక్తి కలిగిందా? లేక ఇంకేమైనా కారణం ఉందా? ఇవి నెటిజన్లు ఆమె భావాలను చూసి ఆశ్చర్యపోతూ అడుగుతున్న ప్రశ్నలు. ఏమిటీ అమలాపాల్ ఏ మంటోంది అనేగా మీ ఉత్సుకత. దక్షిణాది సినిమాలో తనకంటూ ఒక స్థానాన్ని అందుకున్న నటి అమలాపాల్. ఈ మలయాళీ బ్యూటీ నటిగా పరిచయమై ఎంత వేగంగా ఎదిగిందో, అంతే అంత కంటే వేగంగా ప్రేమలో పడిపోయింది. దైవ తిరుమగళ్, తలైవా చిత్రాల్లో నటిస్తున్న సమయంలో ఆ చిత్రాల దర్శకుడు విజయ్‌తో పరిచయం ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వారి పెళ్లి జస్ట్ రెండేళ్లు మాత్రమే సాఫీగా సాగింది. మనస్పర్థలతో విడిపోయి, విడాకులు కూడా తీసుకున్నారు.
అనంతరం మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయింది. సక్సెస్‌లను అందుకోవడంతో పాటు, వివాదాస్పద కథా చిత్రాల్లోనూ నటిస్తూ సంచలన నటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల ఆడై చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. దీంతో దర్శకులిప్పడు క«థలను పట్టుకుని ఆమెచుట్టూ తిరుగుతున్నారు. అలాంటిది ఇప్పుడు చాలా నిరాడంబరగా జీవించడాన్ని కోరుకుంటోంది. ఆ మధ్య హిమాలయాలకు వెళ్లొచ్చింది. ఇటీవల తరచూ పాండిచ్చేరిలో గడపడానికి ఇష్టపడుతోంది. అంతే కాదు పాండిచ్చేరిలోని అరవిందర్ ఆశ్రమంలో తనకు ఎంతో మనశ్శాంతి లభిస్తోందని, ఇక్కడ తనకోసం కొత్త జీవితం ఎదురుచూస్తున్న భావన కలుగుతోందని పేర్కొంటోంది.
ఇప్పుడు తనకు ఆడంబర జీవితాన్ని అనుభవించడం నచ్చడంలేదని అంటోంది. సహజమైన ప్రకృతి మధ్య జీవించాలనిపిస్తోందని చెప్పింది. అన్నట్టు ఆ మధ్య విదేశాల నుంచి కొనుగోలు చేసి వివాదాల పాలైన ఖరీదైన కారును కూడా అమలాపాల్ ఇటీవల విక్రయించేసింది. ఈ మధ్యనే హిమాలయ ప్రాంతాలను చుట్టేసి వచ్చిన అమలాపాల్ ప్రకృతిలోని సహజమైన అందాలను ఆస్వాదిస్తూ జీవించడం ఇష్టంగా ఉందని అంది. చిన్న పాటి సంచిలో కొంచెం బట్టలు తీసుకుని ఒక బృందంగా కలిసి అడవుల్లో వంటావార్పులు చేసుకుంటూ తినడానికి ఇష్టపడుతోందట. దీంతో ఈ వయసులోనే ఈ భామకు ఇంత వైరాగ్యం ఏమీటి అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment