అమలాపాల్‌ ఇంట తీవ్ర విషాదం | Amala Paul Father Paul Varghese Passed Away | Sakshi
Sakshi News home page

కన్నీళ్లతో స్వస్థలానికి పయనమైన అమలాపాల్‌

Published Wed, Jan 22 2020 1:15 PM | Last Updated on Wed, Jan 22 2020 1:16 PM

Amala Paul Father Paul Varghese Passed Away - Sakshi

హీరోయిన్‌ అమలాపాల్‌ ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తండ్రి పౌల్‌ వర్గీస్‌ మంగళవారం రాత్రి కన్నుమూశారు. కాగా అమలాపాల్‌ తన తాజా చిత్రం ‘అదో అంద పరవై పోల’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు అమలాపాల్‌ చెన్నై విచ్చేసింది. ఈ సమయంలో తన తండ్రి మృతి చెందారన్న విషయం తెలియగానే హుటాహుటిన కేరళలోని తన స్వస్థలానికి పయనమైంది.

నేడు కేరళలోని కురుప్పంపాడిలోని సెయింట్‌ పౌల్‌ క్యాథలిక్‌ చర్చిలో మధ్యాహ్నం 3, 4 గంటల ప్రాంతంలో ఆమె తండ్రి అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక అమలాపాల్‌ సినిమాల్లోకి రావటం ఆమె తండ్రికి అస్సలు నచ్చేది కాదట. కానీ కుటుంబ సభ్యులు, బంధువులు అతన్ని ఒప్పించడంతో అమల సినిమాల్లో నటించేందుకు అడ్డు చెప్పలేదట. అలా అమల ‘నీలతామర’ అనే మలయాళ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement