మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన చిత్రం 'ఆడుజీవితం'. 'సలార్'లో వరద రాజమన్నార్ పాత్రలో నటించి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్ . ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 28న విడుదలైన విషయం తెలిసిందే. ఆడుజీవితం ది గోట్ లైఫ్ మూవీ తొలి వారంలోనే రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ ఏడాదే రిలీజై అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీగా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్ రికార్డును 'ఆడుజీవితం' బ్రేక్ చేసింది.
సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. కానీ మలయాళంలో మాత్రం ఫస్ట్ వీక్ పూర్తి అయిన తర్వాత కూడా 200లకుపైగా థియేటర్లలో రన్ అవుతుంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో కేవలం మలయాళ వెర్షన్ రూ. 90 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసినా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ మూవీని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో తెలుగులో కోటి రూపాయలు కూడా దాటలేదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
2008లో అత్యధికంగా అమ్ముడైన మలయాళ నవల 'గోట్ డేస్'. నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని ఆధారంగా చేసుకుని బెన్యామిన్ ఈ నవల రాశారు. ఈ నవలకు మంచి ఆదరణ దక్కిన వెంటనే, సినిమాగా తీయాలని ఎంతోమంది ఆ హక్కుల కోసం ప్రయత్నించారు. బ్లెస్సీ ఆ నవల హక్కుల్ని కొని ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ నటనకు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా రన్ టైమ్ విషయంలో కాస్త తగ్గించి ఉంటే బాగుండు అనే విమర్శ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment