
సంచలనటి అమలాపాల్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తన మాజీ ప్రియుడిని లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేయించింది. మైనా చిత్రంతో కోలీవుడ్‌లో మెరిసిన నటి అమలాపాల్. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు, మలయాళం, భాషల్లో నటించి దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2014లో వీరి పెళ్లి జరిగింది. అయితే వీరి సంసార జీవితం ఎక్కువ కాలం సాగలేదు.
మనస్పర్ధల కారణంగా 2017లో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ చిత్రాలు నటించడం మొదలెట్టిన అమలాపాల్ 2018లో జైపూర్‌కు చెందిన గాయకుడు భవీందర్‌తో ప్రేమాయణం సాగించింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. అమలాపాల్ పెళ్లి చేసుకున్న ఫొటోలను భవీందర్ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి కలకాలం సృష్టించాడు. అయితే అవి ఫొటో షూట్ దృశ్యాలని తమకు పెళ్లి జరగలేదని అమలాపాల్ ఖండించింది.
చదవండి: (Kamal haasan- Simbu: శింబు కోసం కమల్ హాసన్)
కారణాలు ఏమైనా అమలాపాల్ భవీందర్‌లు మనస్పర్ధల కారణంగా విడిపోయినట్లు సమాచారం. ఇప్పుడు తన మాజీ ప్రియుడిని లైంగిక వేధింపులు కేసులో అరెస్ట్ చేయించింది. ఆ వివరాలు చూస్తే ఇటీవల నిర్మాతగా కూడా మారిన అమలాపాల్ ప్రస్తుతం విల్లుపురం జిల్లా, ఆరోవిల్ గ్రామం సమీపంలో ఉన్న తన ఇంటిలో నివసిస్తోంది. గత 26వ తేదీన భవీందర్‌పై విల్లుపురం ఎస్పీ శ్రీనాథ్‌కు ఫిర్యాదు చేసింది.
అందులో రవీందర్ తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, గతంలో సన్నిహితంగా దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తానని బెదిరిస్తున్నాడని, డబ్బు మోసానికి పాల్పడినట్లు ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి లైంగిక వేధింపులు తదితర 16 సెక్షన్ల కింద కేసును నమోదు చేసి మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఇప్పుడు కోలీవుడ్‌లో సంచలనంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment