ఆసక్తికరంగా ‘ఆమె’ | Amala Paul Aame Trailer | Sakshi
Sakshi News home page

ఆసక్తికరంగా ‘ఆమె’

Jul 7 2019 3:43 PM | Updated on Jul 7 2019 6:07 PM

Amala Paul Aame Trailer - Sakshi

ఇటీవల టీజర్‌తోనే సెన్సేషన్‌ సృష్టించిన సినిమా ఆమె. టీజర్‌లో అమలాపాల్‌ నగ్నంగా నటించటంతో ఒక్కసారిగా ఈ సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తమిళంలో ఆడై పేరుతో తెరకెక్కిన సినిమాను తెలుగులో ఆమె పేరుతో డబ్‌ చేసిన రిలీజ్ చేస్తున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శకుడు ర‌త్నకుమార్. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది.

టీజర్‌లో బోల్డ్‌ లుక్‌లో కనిపించిన అమలా పాల్‌, ట్రైలర్‌లో బోల్డ్‌ డైలాగ్స్‌తో ఎట్రాక్ట్ చేశారు. జులై 19న ఆమె సినిమా విడుద‌ల కానుంది. ప్రదీప్ కుమార్ ‘ఆమె’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విజ‌య్ కార్తిక్ ఖ‌న్నన్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ ద‌ర్శక నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్ ఈ చిత్ర తెలుగు హ‌క్కులను సొంతం చేసుకున్నారు. చ‌రిత్ర చిత్ర ప్రొడ‌క్షన్స్ సంస్థలో ఆమె చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement