‘‘మన పూర్వీకులు ఆరోగ్యాన్ని ఆర్డర్ అని అనారోగ్యాన్ని డిజార్డర్ అని అన్నారు. డిజార్డర్ ఎందువల్లో కనుక్కోగలిగితే దాన్ని ఆర్డర్‌లో పెట్టడం సులువు అయిపోతుంది. ప్రస్తుతం ఇదే విషయాన్ని కనుగొంటున్నాను’’ అన్నారు అమలాపాల్. ప్రస్తుతం ఆమె పంచకర్మ చికిత్స తీసుకుంటున్నారు. ఆయుర్వేద చికిత్సలో ఇదో భాగం. 28 రోజుల ఈ చికిత్సా ప్రక్రియలో సుమారు 20 రోజులు పూర్తి చేశారట ఆమె. ఈ ప్రయాణం గురించి అమలా పాల్ మాట్లాడుతూ – ‘‘ఆయుర్వేదంతో నా ప్రయాణం నాలుగేళ్ల క్రితం ప్రారంభం అయింది. ఈ ప్రయాణంలో ఓ పుస్తకంలో దోషాలు, వాటి ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సృష్టి మొత్తం పంచభూతాల ఆధారంగా నిర్మింపబడింది. ఈ పంచభూతాలు కలసి మూడు శక్తులను సృష్టించాయి. వాటినే దోషాలంటారు. వాతా. పితా. కఫా. ఇందులో మొదటిది మన ఎనర్జీని కంట్రోల్ చేస్తుంది. రెండోది మన జీర్ణాన్ని, శారీరక చర్యలను చూసుకుంటుంది. చివరిది మన శరీరాకృతిని నిర్దేశిస్తుంది. ఆయుర్వేదిక ప్రక్రియలన్నీ ఈ మూడు దోషాలను సరైన క్రమంలో పెట్టి మన సమస్యలను నయం చేసుకోవడానికే. నెల రోజులుగా ఆయుర్వేదంలో పంచకర్మలో మునిగితేలుతున్నాను. నన్ను నేను తెలుసుకుంటున్నాను. మన శక్తిని మనమే తెలుసుకొని స్వయంగా నయం చేసుకోగలిగే ప్రక్రియ ఇది. ఇలాంటి ప్రక్రియలో పంచకర్మ ఒకటి’’ అన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment