విజయ్‌సేతుపతితో అమలాపాల్‌! | Vijay Sethupathi and Amala Paul Join Hands for a New Movie | Sakshi
Sakshi News home page

విజయ్‌సేతుపతితో అమలాపాల్‌!

Published Sat, Jun 15 2019 10:18 AM | Last Updated on Sat, Jun 15 2019 10:18 AM

Vijay Sethupathi and Amala Paul Join Hands for a New Movie - Sakshi

గతంలో టైటిల్‌ నిర్ణయించని చిత్రాలకు ప్రొడక్షన్‌ 1, 2 అని పేర్కొనేవారు. అలాంటిది స్టార్‌ హీరోల చిత్రాలకు విజయ్‌ 63, అజిత్‌ 58 అని చెప్పడం అలవాటుగా మారిపోయ్యింది. అదే బాటలో నటుడు శివకార్తికేయన్, విజయ్‌సేతుపతి వంటి వారు కూడా నడుస్తున్నారు. నటుడు విజయ్‌సేతుపతి తాజా చిత్రానికి వీఎస్‌పీ 33 అని పేర్కొన్నారు. ఇటీవల ఓ సినిమాను ప్రారంభించిన ఇది ఈయన 33వ చిత్రం.

చంద్ర ఆర్ట్స్‌ పతాకంపై ఇసక్కిదురై నిర్మిస్తున్నారు. దీని ద్వారా నవ దర్శకుడు వెంకట్‌కృష్ణ రోహంత్‌ పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు ఎస్‌పీ.జననాథన్‌ వద్ద పలు చిత్రాలకు అసిస్టెంట్‌గా పని చేశారు. ఈ మూవీలో సంచలన నటి అమాలాపాల్‌ కథానాయకిగా నటించనున్నారు. విజయ్‌సేతుపతితో ఈ అమ్మడు జత కడుతున్న తొలి చిత్రం ఇదే కావటం విశేషం. ఈ చిత్ర పూజాకార్యక్రమాలు శుక్రవారం చెన్నైలో జరిగాయి.

ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎస్‌పీ.జననాథన్‌ విచ్చేసి చిత్ర ముహూర్తానికి క్లాప్‌ కొట్టి తన శిష్యుడైన దర్శకుడికి యూనిట్‌ వర్గానికి శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా చిత్ర వర్గాలు వివరాలను తెలుపుతూ ఈ చిత్ర టైటిల్‌ను సస్పెన్స్‌గా ఉంచామన్నారు. అంత వరకూ వీఎస్‌పీ 33 అని ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఇది క్రిస్మస్, నూతన సంవత్సం, ఇతర వేడుకలు, ప్రేమ, సంగీతం అంటూ సాగే కథా చిత్రంగా ఉంటుందన్నారు. అంతకు మించి అంతర్జాతీయ అంశం గురించి చర్చించే చిత్రంగా ఉంటుందన్నారు.

ఈ మూవీలో విజయ్‌సేతుపతి సంగీత కళాకారుడిగా నటిస్తున్నారని తెలిపారు. ఇందులో నటి అమలాపాల్‌తో పాటు, మరో విదేశీ నటి నాయకిగా నటించనుందని చెప్పారు.  ఇందులో నటించే ఇతర ప్రముఖ తారాగణం గురించి వరుసగా వెల్లడిస్తామని చెప్పారు. నివాస్‌ కే.ప్రసన్న సంగీతాన్ని, మహేశ్‌ముత్తుస్వామి ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు తెలిపారు. కాగా  సినీ ఇన్నోవేషన్స్, ఆర్‌కే. జయకుమార్‌ ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement