
హీరోయిన్ అమలపాల్ తన ప్రియుడు సింగర్ భవ్నీందర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. గత కొన్నిరోజులుగా వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట వివాహ బంధంతో ఒకటైనట్టుగా సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను భవ్నీందర్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వెడ్డింగ్ పిక్స్ అని కూడా పేర్కొన్నారు. ఆ తర్వాత ఏమైందో కానీ కొద్దిసేపటికే భవ్నీందర్ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించారు. అయితే అప్పటికే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది.
అమలాపాల్ తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల ద్వారా పెద్ద సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు. గతంలో ఆమె దర్శకుడు ఏఎల్ విజయ్‌ను పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైయినా కొద్దికరోజులకే మనస్పర్థలు రావడంతో వాళ్లు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత విజయ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. కాగా, ఇప్పటివరకు అమలాపాల్ గానీ, భవ్నీందర్ గానీ తమ బంధం కూడా ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు.
చదవండి : అతడే అమలాపాల్ ప్రియుడు!
Comments
Please login to add a commentAdd a comment