
మలయాళ బ్యూటీ అమలాపాల్ తెలుగువారికి కూడా సుపరిచితమే. ఇద్దరమ్మాయిలతో మూవీలో అమాయకమైన అమ్మాయిగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఇటీవలే తల్లైన ఈ ముద్దుగుమ్మ మలయాళ చిత్రం లెవెల్ క్రాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది. అందులో భాగంగా కేరళలోని ఎర్నాకులంలో ఓ కాలేజీలో నిర్వహించిన ఈవెంట్‌కు హాజరైంది. అయితే ఈ కార్యక్రమంలో అమలాపాల్ ధరించిన డ్రెస్‌పై నెట్టింట చర్చ నడుస్తోంది.
అలాంటి డ్రెస్‌లో కాలేజీ ఈవెంట్‌కు రావడం అసభ్యకరంగా ఉందంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. పొట్టి దుస్తులతో కనిపించి విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థల్లో నిర్వహించే ఈవెంట్లకు వెళ్లేటప్పుడు మినిమం సెన్స్ ఉండాలంటూ అమలాపాల్‌ను విమర్శిస్తున్నారు.
అయితే తన డ్రెస్‌పై వస్తున్న విమర్శలపై అమలాపాల్ తాజాగా స్పందించింది. ఆ డ్రెస్‌లో తాను సౌకర్యంగానే ఉన్నానని తెలిపింది. అలాంటి డ్రెస్‌లో ఈవెంట్‌కు వెళ్లడం తప్పుగా అనిపించలేదని.. అయితే ఇక్కడ నా ఫోటోలు ఎలా తీశారనేదే అసలు సమస్య అని అన్నారు. ఆ దుస్తుల్లో నన్ను చూడటం వల్ల విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడలేదని అమలాపాల్ స్పష్టం చేసింది. అంతే కాదు.. నేను అన్నిరకాల దుస్తులు ధరిస్తానని తెలిపింది. డ్రెస్ ఎంపిక విషయంలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే అలా కనిపించానని చెప్పుకొచ్చింది.
కాగా.. గత నెలలోనే అమలాపాల్ మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను ఆమె పెళ్లాడింది. ఈ ఏడాది మార్చిలో గర్భం ధరించినట్లు ప్రకటించింది. ఆమె నటించిన లెవెల్ క్రాస్ చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment