college campus
-
బిగ్.. హంబగ్!
సాక్షి, హైదరాబాద్: కాలేజీలో క్యాంపస్ నియామకాలున్నాయా? ఏయే కంపెనీలు వస్తాయి? వార్షిక ప్యాకేజీలు ఎలా ఉంటాయి? ఇంజనీరింగ్‌లో చేరే ప్రతీ విద్యార్థి ముందుగా వాకబు చేసే అంశాలివి. పెద్ద కంపెనీలు క్యాంపస్ నియామకాలు చేపడతాయంటే ఆ కాలేజీకి ఎగబడతారు. కానీ ఐటీ కంపెనీల వల్ల ఇప్పుడు ట్రెండ్ మారిందంటున్నారు నిపుణులు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీల కన్నా... చిన్న మధ్య తరహా ఐటీ కంపెనీలే ఎక్కువ వేతనాలు ఇస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే నైపుణ్యం ఉన్న వారికి పెద్ద సంస్థల కన్నా భారీగా జీతాలు చెల్లిస్తున్నాయి. కోవిడ్ తర్వాత ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తోందని స్పెషలిస్ట్ స్టాఫింగ్ కంపెనీ ‘ఎక్స్‌ఫెనో’ అధ్యయనంలో వెల్లడైంది.దూసుకెళ్లే అవకాశాలుదేశంలో ఐటీ సేవలు అందించే ఆరు కంపెనీల్లో దాదాపు 20 వేల మంది వేతనాలను పరిశీలించింది. వీళ్లంతా ఇంజనీరింగ్ పూర్తి చేసి, కొత్తగా ఐటీ ఉద్యోగాల్లో చేరినవాళ్ళే. వీళ్ళల్లో 74 శాతం మందికి ఏడాదికి రూ. 2.5 నుంచి రూ. 5 లక్షల వేతనం ఇస్తున్నారు. 12 శాతం మందికి రూ. 5.75 నుంచి రూ. 7 లక్షల వార్షిక వేతనం ఇస్తున్నారు. కేవలం 7 శాతం మంది మాత్రమే రూ. 7.5 లక్షల కన్నా ఎక్కువ వేతనం పొందుతున్నారు⇒ మధ్యస్థంగా ఉండే 10 ఐటీ సర్వీస్ కంపెనీల్లో 5 వేల మంది వేతనాలపై అధ్యయనం చేశారు. 57 శాతం మందికి రూ. 2.5–5 లక్షల వార్షిక ప్యాకేజీ ఇస్తున్నారు. 30 శాతం మందికి రూ.5.75 లక్షల ప్రారంభ వేతనం ఇస్తున్నాయి. 7 శాతం మందికి పెద్ద సంస్థలకన్నా ఎక్కువ వేతనం చెల్లిస్తున్నాయి.⇒ ఆరు పెద్ద కంపెనీల్లో రెండేళ్ల తర్వాతే పదోన్నతులు లభిస్తున్నాయి. వేతనంలో హైక్ నిమిత్తం మధ్యస్థ కంపెనీలు ప్రతీ ఆరు నెలలకూ వృత్తి నైపుణ్య అంచనా వేస్తున్నాయి. 58 శాతం ఫ్రెషర్స్‌కు స్కిల్‌ను బట్టి ప్రమోషన్లు ఇచ్చారు.కోతకు చాన్స్ తక్కువేగడచిన ఐదేళ్లుగా టైర్–1 ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తగ్గించుకున్నాయి. ఆరు కంపెనీల్లో 15 శాతం మేర కోత పెట్టాయి. హై స్కిల్ ఉండి, మధ్యస్థ వేతనం ఉన్న వాళ్ళనే కొనసాగించేందుకు ఇష్టపడుతున్నాయి. ఫ్రెషర్స్ విషయంలో పరిస్థితి దయనీయంగా ఉంటోంది. మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయంగా వచ్చే పరిస్థితులను పెద్ద కంపెనీలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. చిన్న, మధ్యస్థ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల, స్కిల్స్ ఉంటే అంత తొందరగా తీసేసే అవకాశం ఉండదు. కాబట్టి వేగంగా ప్రమాదం ముంచుకొస్తుందన్న భయం ఉండదని ఉద్యోగులు భావిస్తున్నారు. పెద్ద కంపెనీల ఉద్యోగుల్లో అనుక్షణం భయం వెంటాడుతోంది.ట్రెండ్‌ను కాలేజీలూ పట్టుకోవాలిప్రతీ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా క్యాంపస్ నియామకాలకు సంబంధించిన విభాగం ఉంటుంది. మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులకు స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నాయి. అయితే, పెద్ద కంపెనీల మనోభావాలనే ఈ శిక్షణలో భాగస్వామ్యం చేస్తున్నాయి. దీంతో పాటు చిన్న, మధ్యస్థ ఐటీ సంస్థల అవసరాలు, అవి ఆఫర్ చేస్తున్న జాబ్ మార్కెట్‌పైనా అవగాహన కల్పించాలని హైదరాబాద్ లోని ఓ మల్టీ నేషనల్ కంపెనీ సీనియర్ కన్సల్టెంట్ విశేష్ తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్‌లో ఫ్రెషర్స్‌కు పెద్ద కంపెనీలకన్నా, చిన్న కంపెనీలే అత్యధిక వేతనాలు ఇస్తున్నాయి. ఈ దిశగా శిక్షణ ఇస్తే విద్యార్థుల ఉపాధి అవకాశాల్లో మార్పులుండే వీలుంది.వేతనాల్లో పెద్ద వాటితో పోటీ..ఉద్యోగి నిర్వహించే పాత్ర, అతని అనుభవాన్ని బట్టి కంపెనీల్లో వేతనాలుంటున్నాయి. ఈ విషయంలో పెద్ద కంపెనీలతో చిన్న కంపెనీలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇది ఈ మధ్య కన్పిస్తున్న కొత్త ట్రెండ్. - రోహన్ సిల్వెస్టర్ (టాలెంట్ స్ట్రాటజీ అడ్వైజర్,ఇన్‌డీడ్ ఇండియా)నిలబడేందుకు పోరాటం చిన్న, మధ్యస్థ కంపెనీలు తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు ఓ రకంగా పోరాటం చేస్తున్నాయి. మార్కెట్లో నిలబడాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ కారణంగా నైపుణ్యం ఉన్న ఫ్రెషర్స్‌కు పెద్ద కంపెనీల కన్నా 30 నుంచి 50 శాతం వేతనాలు ఎక్కువ ఇచ్చి చేర్చుకుంటున్నాయి. పదేళ్ళ నికర వృద్ధిలో ఇవి కూడా అత్యుత్తమ ప్రమాణాలకు చేరుకోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. - నీలమ్‌కౌర్ (ఐటీ ప్రొఫెషనల్, ముంబై) చిక్కులు తెస్తున్న ఆర్థికాంశాలు ఆర్థిక మాంద్యం పెద్ద కంపెనీ ఉద్యోగుల స్థితి గతులను మారుస్తోంది. ఈ ప్రభావం చిన్న, మధ్యస్థ కంపెనీల్లో తక్కువగా ఉంటోంది. కొన్ని అంతర్జాతీయ కంపెనీలు కూడా ఐటీ సేవల్లో ఈ సంస్థలకే ప్రాధాన్యమిచ్చే ధోరణి కన్పిస్తోంది. కాబట్టి స్కిల్స్ ఉన్న వాళ్ళకు చిన్న కంపెనీల్లోనూ ఢోకా ఉండదు. ఎంఎస్ ప్రసాద్ (టైర్–1 కంపెనీలో వర్క్‌ఫోర్స్ హెడ్) -
ఎలాంటి సందేశం ఇస్తున్నారు?.. అమలాపాల్‌పై విమర్శలు!
మలయాళ బ్యూటీ అమలాపాల్ తెలుగువారికి కూడా సుపరిచితమే. ఇద్దరమ్మాయిలతో మూవీలో అమాయకమైన అమ్మాయిగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఇటీవలే తల్లైన ఈ ముద్దుగుమ్మ మలయాళ చిత్రం లెవెల్ క్రాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది. అందులో భాగంగా కేరళలోని ఎర్నాకులంలో ఓ కాలేజీలో నిర్వహించిన ఈవెంట్‌కు హాజరైంది. అయితే ఈ కార్యక్రమంలో అమలాపాల్ ధరించిన డ్రెస్‌పై నెట్టింట చర్చ నడుస్తోంది.అలాంటి డ్రెస్‌లో కాలేజీ ఈవెంట్‌కు రావడం అసభ్యకరంగా ఉందంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. పొట్టి దుస్తులతో కనిపించి విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంస్థల్లో నిర్వహించే ఈవెంట్లకు వెళ్లేటప్పుడు మినిమం సెన్స్ ఉండాలంటూ అమలాపాల్‌ను విమర్శిస్తున్నారు. అయితే తన డ్రెస్‌పై వస్తున్న విమర్శలపై అమలాపాల్ తాజాగా స్పందించింది. ఆ డ్రెస్‌లో తాను సౌకర్యంగానే ఉన్నానని తెలిపింది. అలాంటి డ్రెస్‌లో ఈవెంట్‌కు వెళ్లడం తప్పుగా అనిపించలేదని.. అయితే ఇక్కడ నా ఫోటోలు ఎలా తీశారనేదే అసలు సమస్య అని అన్నారు. ఆ దుస్తుల్లో నన్ను చూడటం వల్ల విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడలేదని అమలాపాల్ స్పష్టం చేసింది. అంతే కాదు.. నేను అన్నిరకాల దుస్తులు ధరిస్తానని తెలిపింది. డ్రెస్ ఎంపిక విషయంలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే అలా కనిపించానని చెప్పుకొచ్చింది. కాగా.. గత నెలలోనే అమలాపాల్ మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను ఆమె పెళ్లాడింది. ఈ ఏడాది మార్చిలో గర్భం ధరించినట్లు ప్రకటించింది. ఆమె నటించిన లెవెల్ క్రాస్ చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
టీషర్ట్స్, చిరిగిన జీన్స్‌తో రావొద్దు.. విద్యార్థులకు కళాశాల ఆదేశాలు
ముంబై: ఇటీవల కళాశాల క్యాంపస్ ఆవరణలో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ నిలిచిన ముంబైలోని ఓకళాశాల తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు కళాశాలకు టీషర్ట్స్, చిరిగిన జీన్స్‌తో రావడాన్ని నిషేధించింది. కొత్త డ్రెస్ కోడ్‌ను విధించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.టీవలే కళాశాలలో విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కళాశాలకు వచ్చే విద్యార్థులు సాంస్కృతిక అసమానతల్ని సూచించే దుస్తులతో రావొద్దని ఆదేశించింది. ముంబైలో ఈ సొసైటీ నిర్వహిస్తోన్న ఎన్జీ ఆచార్య , డీకే మరాఠే కళాశాలల్లో చిరిగిన జీన్స్, టీషర్టులు, జెర్సీలతో వస్తే విద్యార్థులను అనుమతించబోమని స్పష్టం చేసింది. విద్యార్థులు తప్పనిసరిగా ఫార్మల్, డీసెంట్ దుస్తుల్లో మాత్రమే కళాశాలకు రావాలని ఆదేశించింది.‘విద్యార్థులు క్యాంపస్‌లో ఉన్నప్పుడు ఫార్మల్, డీసెంట్ దుస్తులు ధరించాలి. వారు హాఫ్ షర్ట్ లేదా ఫుల్ షర్ట్ , ప్యాంటు ధరించవచ్చు. అమ్మాయిలు భారతీయ లేదా పాశ్చాత్య దుస్తులను ధరించవచ్చు. విద్యార్థులు మతాన్ని లేదా సాంస్కృతిక అసమానతలను చూపించే ఎలాంటి దుస్తులూ ధరించకూడదు. జీన్స్, టీషర్టులు, రివీలింగ్ డ్రెస్సులు, జెర్సీలు ధరించి వస్తే అనుమతించబోము’ అని నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసును కళాశాల గేటుకు అంటించింది.అయితే ఈ నిబంధనలపై పలువురు విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త డ్రెస్ కోడ్ గురించి తమకు తెలియదని, జీన్స్, టీ షర్టులు ధరించి ఉండడంతో కాలేజీలోకి రానివ్వడం లేదని కొందరు విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు..కాగా ఇదే కళాశాల గతంలో తమ ప్రాంగణంలో హిజాబ్, నఖాబ్, బుర్కా, స్టోల్స్, క్యాప్‌లు, బ్యాడ్జీలపై నిషేధం విధించింది, దీనిపై విద్యార్థులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే కాలేజీ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని న్యాయమూర్తులు ఎఎస్ చందూర్కర్, రాజేష్ పాటిల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
-
కొత్త కాలేజీలు, కోర్సులపై మారటోరియం ఎత్తివేత
సాక్షి, అమరావతి: దేశంలో ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి కొత్త కాలేజీలు, కోర్సులపై ఉన్న మారటోరియాన్ని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఎత్తివేసింది. ఇంజనీరింగ్ సహా ప్రొఫెషనల్ కోర్సులను బోధించే కాలేజీలకు అనుమతులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు 2023 – 24 మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో కొత్తగా మరిన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు అందు బాటులోకి రానున్నాయి. నూతన విద్యావిధానం 2020ని దృష్టిలో పెట్టుకొని అనుమతులకు సంబంధించి కొన్ని సడలింపులతో పాటు కొత్త మార్పులను ప్రకటించారు. మూడేళ్ల తరువాత.. కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలు, కోర్సులకు అనుమతులపై ఏఐసీటీఈ 2020–21లో మారటోరియాన్ని విధించింది. కాలేజీలు, సీట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం, నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ప్రొఫెసర్ మోహన్‌రెడ్డి (ఐఐటీ– హైదరాబాద్) కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏఐసీటీఈ ప్రాంతీయ కార్యాలయాల ద్వారా అనుమతుల మంజూరు ప్రక్రియ కొనసాగగా ఇప్పుడు దాన్ని రద్దుచేసి నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ పోర్టల్ ద్వారా నిర్వహించనున్నారు. ఏఐసీటీఈ అనుమతి ప్రక్రియలో ముఖ్యమైన నిపుణుల కమిటీ సందర్శనను రద్దు చేసింది. కాలేజీలపై ఒత్తిడి తగ్గించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. అవసరమైనప్పుడు, ఫిర్యాదులు అందినప్పుడు మాత్రమే తనిఖీలు చేపడతారు. అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లలో (బీఈ, బీటెక్) గరిష్ట సీట్ల సంఖ్యను 300 నుంచి 360కి పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం కంప్యూటర్ అప్లికేషన్ ప్రోగ్రామ్‌లలో ఇన్‌టేక్‌ను 180 నుంచి 300కి పెంచుకునే అవకాశం కల్పించారు. కొత్తగా ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీలకు ఆమోదం, అనుమతుల పొడిగింపు ఈ విద్యా సంవత్సరంలో చేపట్టే అవకాశం లేదు. ఇందుకు సంబంధించిన వ్యాజ్యం సుప్రీంకోర్టులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన మార్గదర్శకాల ప్రకారం అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు మూడు విభాగాలకు మించకుండా డిగ్రీ, డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో మొదటి బ్యాచ్ పూర్తయ్యాకే కొత్త ప్రోగ్రాముకు దరఖాస్తుకు అవకాశం ఉంది. ఇప్పుడు బహుళ ప్రోగ్రాములకు ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు మూడు కోర్ బ్రాంచ్ కోర్సులను నిర్వహించి ఉండాలి. ఈ జాబితాలో ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్స్‌తో సహా మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉన్నాయి. విద్యార్ధుల నమోదు శాతంతో సంబంధం లేకుండా అభివృద్ధి చెందుతున్న విభాగాలలో నూతన కోర్సు లను ప్రారంభించేందుకు అనుమతించనున్నారు. ూగ్లోబల్ ర్యాంకింగ్స్‌లో అగ్రశ్రేణి 1,000 సంస్థలను దేశీయ సంస్థలతో కలసి పని చేయడానికి అనుమతించనున్నారు. కనీసం 650 నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) స్కోర్‌తో ఏఐసీటీఈ ఆమోదించిన లేదా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో టాప్ 100లో ఉన్న దేశీయ విద్యా సంస్థలను విదేశీ సంస్థలతో కలిసి పనిచేయడానికి అనుమతించనున్నారు. నేషనల్ అక్రిడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ (న్యాక్)లో 3.1 స్కోర్‌తో ఉన్న దేశీయ విశ్వవిద్యాల యాలు కూడా డ్యూయల్, జాయింట్ లేదా ట్వినింగ్ ప్రోగ్రామ్‌లను అందించడానికి వీలుంటుంది. అలాంటి సంస్థలకు కొత్త నిబంధనల ప్రకారం 60 సీట్లతో అదనపు బ్యాచ్‌ల ఏర్పాటుకు అనుమతిస్తారు. ూవిద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వీలుగా ఏఐసీటీఈ వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త మైనర్ డిగ్రీలను ప్రవేశపెడుతోంది. వీఎల్ఎస్ఐ డిజైన్, 5జీ, అడ్వాన్సుడ్ టెక్నాలజీ సహా ఇంజనీరింగ్‌లో మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందించేలా కాలేజీలను అనుమతిస్తారు. విద్యార్థులు, అధ్యాపకుల్లో మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ఫోరమ్ లేదా కౌన్సెలర్‌ను నియమించుకోవాలి. మహిళల కోసం 24 గంటల పాటు పనిచేసేలా హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలి. విద్యార్థులతోపాటు బోధన, బోధనేతర మహిళా సిబ్బందికి భద్రతా వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. ూ2023లో కొత్త ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించడానికి తరగతి గదుల కనీస అవసరాన్ని కూడా ఏఐసీటీఈ సడలించింది. మొత్తం తరగతి గదుల సంఖ్య కళాశాలలోని డివిజన్ల సంఖ్య కంటే 0.5 రెట్లుంటే చాలు. గతంలో 15 తరగతి గదులు కలిగి ఉండాల్సిన కళాశాల ఈసారి పది గదులతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించవచ్చు. పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లలో పీఎం కేర్ సూపర్ న్యూమరీ సీట్లను ఇకపై కొనసాగించరాదని నిర్ణయించారు. (చదవండి: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు తేజాలు ) -
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కాలేజీ ప్రారంభించిన కేటీఆర్
-
భవిత కళాశాలలో ప్రమాదం
-
సీఎం వైఎస్ జగన్ కు ఫాతిమా మెడికల్ స్టూడెంట్స్ కృతజ్ఞతలు
-
సికింద్రాబాద్ కస్తూర్బా మహిళా కాలేజీలో గ్యాస్ లీక్..
-
మాట్లాడుతూనే చెంప పగలకొట్టింది.. అమ్మాయిల కొట్లాట వైరల్
వైరల్: కాలేజ్ క్యాంటీన్లో ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కుడివైపు వున్న అమ్మాయి ఎడమ వైపు వున్న అమ్మాయిపై ఒక్కసారిగా విరుచుకుపడింది. చేతితో తన చెంప పగలకొట్టింది. దీంతో.. ఎదురుగు వున్న అమ్మాయి కూడా చేతితో బుద్దిచెప్పింది. అంతే.. అక్కడ రణరంగమే మొదలైంది. అక్కడున్న వారు వారిద్దరిని ఆపాల్సింది పోయి ‘హూ.. అంటూ చప్పట్లు కొడుతూ ఆస్వాదిందించారు. ఆ అమ్మాయిల గొడవకు కారణం ఏంటో తెలియదు. ఈ ఘటన బెంగళూరులోని దయానంద సాగర్ ఇంజినీరింగ్ కాలేజీ క్యాంటీన్లో చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ వైరల్ వీడియోపై మేనేజ్మెంట్ స్పందన కూడా తెలియాల్సి ఉంది. Kalesh B/w Two Girls In College Canteen (DSCE, Bangalore) pic.twitter.com/E5b165yH2w — r/Ghar Ke Kalesh (@gharkekalesh) October 9, 2022 -
వరంగల్‌లో విషాదం: గొడవపడి.. కిటికీ నుంచి కిందపడి..
సాక్షి, వరంగల్/ నర్సంపేట: స్లైడ్ విండో పగులగొట్టిన ఘటనలో కాలేజీ యజమాన్యానికి జరిమానా కట్టాలన్న విషయంలో నలుగురు విద్యార్థుల మధ్య తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణాలు తీసింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పోలీ స్‌స్టేషన్ పరిధిలోని బిట్స్ కాలేజీ క్యాంపస్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. తీవ్రగాయాలైన విద్యార్థి సంజయ్ (18) ఆస్పత్రిలో అదేరోజు రాత్రి కన్నుమూశాడు. ఈ కేసులో విద్యార్థులు రాయపురపు హరి రాజు, గుండబాటు శివసాయి, ఎల్.మనోహర్, పెద్దబోయిన కృష్ణంరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూ డు రోజులక్రితం కిటికీ అద్దం పగిలినా మరమ్మతులు చేయని బిట్స్ చైర్మన్ రాజేంద్రప్రసాద్‌రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. జరిమానా గలాటాకు దారితీసి.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన భాస్కర్, కవితలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సంజయ్ నర్సంపేటలోని బిట్స్ కాలేజీలో పాలి టెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల కా లేజీ తెరవడంతో ఈనెల 20న హాస్టల్‌కు వచ్చాడు. హరిరా జు, శివసాయి, మనోహర్, కృష్ణంరాజుతో కలిసి హాస్టల్ బ్లాక్‌లోని రెండో అంతస్తులోని 218 గదిలో ఉంటున్నాడు. మంగళవారం ఓ విద్యార్థి కారణంగా ఆ గదిలో స్లైడ్ విండో పగిలింది. దీంతో కాలేజీ యాజమాన్యానికి దాదాపు రూ. 15వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుందని సంబంధిత సిబ్బంది ఈ విద్యార్థులను హెచ్చరించారు. శుక్రవారం రాత్రి 7.50 గంటలకు భోజనం చేస్తున్న సమయంలో ఎవరు జరిమానా కట్టాలన్న చర్చ రావడంతో విద్యార్థుల మధ్య వాగ్వా దం జరిగింది. ఈ సమయంలోనే వారిని వారించబోయిన సంజయ్‌ని గట్టిగా తోసేశారు. దీంతో సంజయ్ 25 ఫీట్ల ఎత్తులో ఉన్న తమ గది నుంచి కింద పడ్డాడు. కింద సిమెంట్ గద్దె ఉండటం వల్ల తలతో పాటు వెన్నెముకకు బలంగా గాయాలయ్యాయి. రాత్రి 8.15కు షాక్ నుంచి తేరుకున్న విద్యార్థులు వార్డెన్‌కు సమాచారం అందించారు. వార్డెన్ వెంటనే సంజయ్‌ను నర్సంపేట సమీప ఆస్పత్రిలో ప్రాథ మిక చికిత్స అనంతరం, ములుగురోడ్డులోని అజర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో సంజయ్ మృతిచెందాడు. అప్పటికే సమాచారం అందుకున్న తండ్రి భాస్కర్ ఆస్పత్రిలో విగతజీవిగా మారిన కొడుకును చూసి కన్నీరు మున్నీరయ్యారు. తన కుమారుడు మృతికి కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతోపాటు ఆ నలుగురు విద్యార్థులు కారణమని నర్సంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంజయ్ మృతదేహానికి ఎంజీఎంలో పోస్టుమార్టం నిర్వహించారు. కొట్టి చంపేశారు.. పదిరోజులు ఇంటినుంచే కాలేజీకి పోయి వచ్చిండు. అందులో ఉన్న నలుగురే అద్దం పగులగొట్టిండ్రు. వార్డెన్ కూడా నలుగురే జరిమానా కట్టాలన్నాడు. అయితే మా కుమారుడు కూడా జరిమానా కట్టాలని మిగిలిన విద్యార్థులు ఒత్తిడి తెచ్చిండ్రు. నేనెందుకు కడతనని సంజయ్ అనడంతోనే పిడిగుద్దులు గుద్దారు. కొట్టి చంపినంకనే కిటికీ నుంచి కిందపడేసిండ్రు. – కవిత, మృతుడు సంజయ్ తల్లి -
కొత్తగా రెక్కలొచ్చెనా..!
నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన వేళ.. కొత్తగా చేరిన విద్యార్థులతో నగరంలోని కళాశాలల్లో పండుగ కళ కనిపిస్తోంది! ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, మరెన్నో లక్ష్యాలతో కాలేజీ క్యాంపస్‌లో అడుగుపెట్టిన యువతకు.. సరికొత్త ప్రపంచం సాక్షాత్కారమవుతుంది. స్వేచ్ఛాయుత వాతావరణం.. కొత్త స్నేహాలు, భిన్న మనస్తత్వాలు, విభిన్న నేపథ్యాలు, సంస్కృతులు.. వీటి మధ్య ఏదో తెలియని బెరుకుతనంతో కూడిన తడబాటు.. ఎవరిని పలకరిస్తే ఏమనుకుంటారో అనే భావన.. ఇలాంటి పరిస్థితుల్లో క్యాంపస్ లైఫ్ ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.. తల్లిదండ్రుల పర్యవేక్షణకు దూరంగా.. కొత్తగా కాలేజీ క్యాంపస్‌లో అడుగుపెట్టిన విద్యార్థికి రంగుల లోకంలో విహరిస్తున్నట్లుగా ఉంటుంది. కొత్త వాతావరణం.. సరికొత్త స్నేహాలు.. అపరిమిత స్వేచ్ఛ.. మరోవైపు చదువుల ఒత్తిడి.. ఇటువంటి సమయంలోనే విద్యార్థులు తమను తాము నియంత్రించుకునే సామర్థ్యాన్ని సొంతం చేసుకోవాలి. అటు అకడమిక్ వ్యవహరాలను, ఇటు కో కరిక్యులర్ యాక్టివిటీస్‌తో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త వాళ్లతో, భిన్న వాతావరణంలో సర్దుకుపోయే అనుకూలతను, సానుకూల దృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడే విద్యార్థి వేసే ప్రతి అడుగు ఉన్నత కెరీర్‌కు బాటలు వేస్తుంది. పరిచయం చేసుకోండి కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టే సరికి వివిధ ప్రాంతాలకు చెందిన, వివిధ రకాల మనస్తత్వాలున్న విద్యార్థులు తారసపడతారు. ఇలాంటప్పుడు ఎవరితో ఎలా వ్యవహరించాలి.. అనే విషయంలో ఒత్తిడికి లోనుకావద్దు. వ్యక్తిగత నైపుణ్యాలను అలవరచుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ అవసరం లేదు. ప్రవర్తనా తీరును కొంత మార్చుకుంటే సరిపోతుంది. కొత్తగా క్యాంపస్‌లో చేరిన ఫ్రెషర్స్ తనతోపాటు కోర్సులో చేరిన వారితో, సీనియర్లతో, అధ్యాపకులతో సాధ్యమైనంత వరకు పరిచయాలు పెంచుకోవాలి. అందరితో స్నేహంగా మసలుకొనే ప్రయత్నం చేయాలి. ఇందుకు గ్రూప్ మూవింగ్ ఓ చక్కటి ప్రత్యామ్నాయం. వ్యక్తుల మధ్య స్నేహం పెంచేందుకు చిరునవ్వు ఉపయోగపడుతుంది. ముఖంపై చిరునవ్వును చెదరనివ్వని వారు ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకుంటారు. మాటల కూర్పు.. వినే ఓర్పు.. పలికే నేర్పుల.. సమాహారమే సంభాషణ. కాబట్టి సంభాషణ నైపుణ్యాలను పెంచుకోవాలి. ఎదుటి వారు చెప్పే విషయాలను జాగ్రత్తగా వినాలి. మన మాటలు ఎదుటివారిని ఆకట్టుకునేలా ఉండాలి. బిడియం లేకుండా లెక్చరర్లు, సీనియర్లను సంప్రదించి తెలియని విషయాలను తెలుసుకోవాలి. మీ సబ్జెక్టులతోపాటు ఆయా అంశాలపై మీ ఆలోచనలను, అభిప్రాయాలను తోటి విద్యార్థులతో, లెక్చరర్లతో పంచుకోండి. చదువు ఒక్కటే కాదు కాలేజీ అంటే.. కేవలం చదువు ఒక్కటే కాదు. విద్యార్థిని అన్ని అంశాల్లో సుశిక్షితుడిని చేసే చక్కటి వేదిక. కాబట్టి అకడమిక్ కార్యకలాపాలకే పరిమితం కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో కూడా పాల్గొనాలి. ఇంటర్-కాలేజీ స్పోర్ట్స్, సెమినార్ల నిర్వహణ, కళాశాలలోని క్లబ్‌ల్లో సభ్యత్వం వంటి కార్యకలాపాల్లో పాలుపంచుకోవాలి. తద్వారా నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, టీమ్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ మెరుగవుతాయి. కాలేజీలో కోర్సును దిగ్విజయంగా పూర్తిచేసేందుకు, మంచి కెరీర్లో స్థిరపడేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. క్రమశిక్షణ ముఖ్యం కాలేజీ జీవితాన్ని పూర్తిగా అస్వాదించాలంటే క్రమశిక్షణ కూడా చాలా అవసరం. క్యాంపస్‌లో కాలు పెట్టిన దగ్గరి నుంచి నిజాయతీగా కష్టపడటం అలవాటు చేసుకోవాలి. క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలి. అకడమిక్ వ్యవహారాలు సకాలంలో పూర్తయ్యేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. క్లాస్ అసైన్‌మెంట్స్‌ను నిర్దేశించిన సమయంలోగా సమర్పించడానికి ప్రయత్నించాలి. అదేసమయంలో అకడమిక్ వ్యవహరాలకు, సోషల్ లైఫ్ మధ్య సమన్వయం ఉండేలా జాగ్రత్తపడాలి. కెరీర్ దృష్టికోణంలో ఈ రెండూ అంశాలు చాలా కీలకమైనవి. సమయం ఆదా మరో కీలకమైన అంశం..ట్రాన్స్‌పోర్టేషన్. కాలేజీకి వెళ్లాల్సిన మార్గంపై అవగాహన పెంచుకోవాలి. కాలేజీ కి దగ్గర్లో ఉన్న బస్టాప్? ఏ నెంబర్ బస్ అక్కడికి వెళ్తుంది? ఏయే సమయాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయి? కాలేజీకి దగ్గర్లో ఎంఎంటీస్ స్టేషన్ ఉందా? సమీప ప్రదేశాలు? వంటి వివరాలను సేకరించాలి. తద్వారా కాలేజీ షెడ్యూల్‌కు అనుగుణంగా ప్రయాణ ఏర్పాట్లను చేసుకోవడానికి వీలవుతుంది. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. ఎలాంటి హడావుడి లేకుండా కాలేజీకి చేరుకోవచ్చు. అంతేకాకుండా కోర్సుకు సంబంధించిన పుస్తకాలు, రికార్డులు, ఇతర సామాగ్రి లభించే ప్రదేశాలు, స్టోర్స్‌పై అవగాహన పెంచుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చే డబ్బును సక్రమంగా ఉపయోగించుకోవడంలోనూ, టైం మేనేజ్‌మెంట్‌లోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఏదో ఒక హాబీ చదువుతోపాటు విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగంలో ప్రావీణ్యం సాధించడానికి ప్రయత్నించడం మంచిది. ఎందుకంటే నిరంతరం క్లాసులు, ల్యాబ్‌లు, లైబ్రరీ.. అంటే బోర్ కొట్టడం సహజం. కాబట్టి పెయింటింగ్, ఫొటోగ్రఫీ, థియేటర్ ఆర్ట్స్, డ్యాన్స్ వంటి కళలను నేర్చుకోవడాన్ని ఒక హాబీగా మార్చుకోవాలి. కాలేజీ రోజుల్లో అలవరచుకున్న హాబీనే తదనంతర కాలంలో ప్రధాన వ్యాపకంగా మార్చుకొని ఉన్నతస్థాయికి చేరుకున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఉజ్వల భవితకు హాబీ కూడా అవసరమే. ఉన్నతంగా ఎదగాలి! శ్రీవివిధ ప్రాంతాలు, భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులకు సిటీ వాతావరణం మొదట కొత్తగానే ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఎదుైరె నా త్వరలోనే ఇక్కడి వాతావరణానికి అలవాటుపడిపోతారు. అయితే విద్యార్థులు ముఖ్యంగా స్కిల్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్‌పై దృష్టి పెట్టాలి. చదువుతోపాటు ఇతర ప్రయోజనకర కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ నైపుణ్యాలను పెంచుకోవాలి. డిగ్రీతోపాటు సొంతంగా జీవించడానికి కావాల్సిన నైపుణ్యాలు వృద్ధి చేసుకోవాలి. జాబ్ చేయడమే లక్ష్యంగా కాకుండా జాబ్ప్రొవైడర్లుగా రాణించడానికి కృషిచేయాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకోవాలి. తగిన నైపుణ్యాలు సొంతం చేసుకుంటే ఉద్యోగం కోసం వెతికే పనిలేకుండా పది మందికి ఉద్యోగం కల్పించేలా చిన్న కంపెనీని ఏర్పాటు చేయొచ్చు. పర్సనాలిటీ డెవలప్మెంట్, సాఫ్ట్‌స్కిల్స్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి. ధైర్యంతో ఉండాలి. ఒంటరిగా ఎవరూ వంద శాతం విజయాలను సాధించలేరు. కలిసి చదువుకోవడం, కలిసి పనిచేయడం ద్వారానే కోర్సుతోపాటు కెరీర్లోనూ సక్సెస్ సాధిస్తారు. అందుకే మంచి స్నేహితులను ఎంచుకోవాలి. విద్యాభ్యాసంతోపాటే ఈవెంట్ మేనేజ్మెంట్, క్రైసిస్ మేనేజ్మెంట్ వంటి విషయాలపై అవగాహన ఏర్పడినప్పుడే పూర్తి స్థాయి విద్యావంతులుగా తయారవుతారు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రజ్ఞ ఉంటుంది. దాన్ని స్వత హాగా తెలుసుకోవాలి. స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ఏ అంశంపై ఆసక్తి ఉందో గమనించాలి. దానిలో మీ బలాలు, బలహీనతలేంటో బేరీజు వేసుకోవాలి. పూర్తి స్థాయి నైపుణ్యం సాధించేందుకు ప్రయత్నించాల్ణి. - ప్రొ. బి. టి. సీత, ప్రిన్సిపల్, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్, కోఠి ఆసక్తికర దశ కాలేజీ జీవితం అంటేనే.. చదువుతో పాటు అనేక విషయాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించే ఆసక్తికరమైన దశ. చదువు ఎంత ముఖ్యమో స్నేహాలు, కొత్త విషయాలను నేర్చుకోవడం కూడా అంతే కీలకం. చదువుతోపాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్నేహితులతో సరదాలు వంటి మిగతా అంశాలనూ సమన్వయం చేసుకోవాలి. ఏ సమయంలో ఏది అవసరమో అదే చేయాలి. ప్రతి విషయంలో తమ పరిమితులను గుర్తిస్తూ స్వీయ నియంత్రణతో మెలగాలి. అప్పుడు అటు చదువుతోపాటు ఇటు ఉన్నత వ్యక్తిత్వం అలవడి ఉజ్వల భవిష్యత్‌కు సరైన పునాది పడుతుంది!! ఇంటర్నెట్లో సమస్త సమాచారం ప్రస్తుతం అంతా టెక్నాలజీ యుగం. సాంకేతిక ైనె పుణ్యంతో ప్రపంచం ముందుకు దూసుకుపోతున్న తరుణం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆయా అంశాలపై అవగాహనతో (టెక్ సవే) ఉండాలి. ఇందుకు ఇంటర్నెట్ను సమర్థంగా వినియోగించుకోవాలి. సిటీలో జరిగే వివిధ కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ ఫెయిర్స్, కెరీర్ ఈవెంట్స్ సమాచారాన్ని నెట్ ద్వారా తెలుసుకొని వాటికి హాజరయ్యే ప్రయత్నం చేయాలి. ఇంటర్నెట్ వినియోగం ద్వారా ఒకే క్లిక్‌తో సమస్త సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నెట్ బ్రౌజింగ్‌ను అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా ఫేస్బుక్, ట్విటర్, లింక్డ్ ఇన్ వంటి సోషల్ మీడియా వెబ్సైట్లలో నిర్మాణాత్మకంగా పాల్గొనండి. స్నేహితులు, బంధువులతోపాటు మీ కోర్సుకు, సబ్జెక్టుకు సంబంధించిన నిపుణులతో నిత్యం సంబంధాలను కొనసాగించడానికి ఇవి చక్కని వేదికలుగా ఉపయోగపడతాయి. విద్య, కెరీర్‌కు సంబంధించి యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్స్ ఎన్నో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. మొబైల్, ట్యాబ్లెట్‌లోకి వీటిని ఇన్స్టాల్ చేసుకోవడం చాలా ప్రయోజనకరం. -
కలివిడిగానా? విడివిడిగానా?!
జీవితంలో మీకు బాగా ఇష్టమైన రోజులు ఏవి? అని ఎవరైనా అడిగితే టక్కున వచ్చే సమాధానం‘కాలేజీ డేస్’ ఎందుకంటే ఆ అనుభూతులే ప్రత్యేకం. 20 యేళ్ల వయసులోని ఆ అనుభవాలు 60 యేళ్ల వయసులో నెమరువేసుకోవడానికి కూడా అనుభూతులను అందిస్తాయి. అలాంటి కాలేజీ వాతావరణాన్ని... ‘‘ఎక్కడెక్కడీ చిట్టిగువ్వలూ, ఏడనుంచినో గోరువంకలూ కాలేజీ క్యాంపస్‌లోనే నాట్యంచేసేనే...కాలేజీ క్యాంపస్ అంటే కోడెకైనాలే...’’ అంటూ వర్ణించాడు సినీకవి. నిజంగా టీనేజ్‌లో ఫస్ట్‌టైమ్ కాలేజీలోకి అడుగుపెట్టే వారి మనసులోని భావనకు ఆ పదాలు చాలవు. అయితే ఎవరికైనా ఊహల్లోని ఆ రంగుల హరివిల్లు ఒక్కమాటతో చెదిరిపోతుంది. మీరు చదవబోయేది కో ఎడ్యుకేషన్ కాలేజీ కాదు అని అంటే! చేయి చాచి స్నేహం కోరిన స్నేహితులు, క్యాంటీన్ కబుర్లు, సినిమా కోసం కాలేజీ బంకులు, క్లాస్‌లో అలర్లు, లెక్చరర్‌తో తిట్లు, చిన్ని చిన్ని గొడవలు, ఫ్రెషర్ పార్టీలు, యాన్యువల్ పార్టీలు, సెమిస్టర్ పరీక్షల హడావిళ్లు, వారాంతాల చిన్ని చిన్ని విహారయాత్రలు..! ఏ కాలేజీలోనైనా, ఎవరి కాలేజీ జీవితంలోనైనా ఇవన్నీ ఉంటాయి. అయితే కో ఎడ్యుకేషన్‌ను మిక్స్ చేస్తే అమ్మాయిల ఓర చూపులు, ఆమెను మెప్పించడానికి అబ్బాయిలు పడే పాట్లు, క్లాస్‌రూమ్‌లో సైన్స్ పాఠాల మధ్య కలుసుకొన్న చూపులు...కూడా ఉంటాయి. ఒకవేళ కో ఎడ్యుకేషన్కాకపోతే కాలేజీ పుస్తకంలో ఈ పేజీలన్నీ మిస్సింగ్. కోఎడ్యుకేషన్ అంటే ఒక మ్యాజిక్ కార్పెట్. అయితే నేటి కార్పొరేట్ వరల్డ్‌లో కో ఎడ్యుకేషన్ కరవవుతోంది. జూనియర్ కాలేజీల్లో కో ఎడ్యుకేషన్ ప్రసక్తే లేకుండా పోగా... డిగ్రీ కాలేజీల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రం కొంత వరకూ మినహాయింపు. విద్యార్థులపై ఇది ఏవిధమైన ప్రభావం చూపుతుంది? క్లాస్ రూమ్‌లో అమ్మాయిలు లేకపోతే... అబ్బాయిలు మాత్రమే ఉంటే! ఈ పరిస్థితిని ఊహించుకోవడానికే చాలామంది అబ్బాయిలు ఇష్టపడరు. అయితే అబ్బాయిలు అలాగైతేనే బుద్ధిగా ఉంటారని, క్లాస్‌లో అమ్మాయిలు లేకపోతేనే వారు చదువు మీద దృష్టిపెడతారనేది చాలా మంది పెద్దల అభిప్రాయం. కానీ టీనేజ్‌లో కో ఎడ్యుకేషన్ లేకుండా ఇండివిడ్యువల్ కాలేజీల్లో చదవడం వల్ల ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనాలేమీ ఉండవని చెబుతోంది అమెరికన్ అధ్యయనకర్తలు చేసిన ఒక సర్వే. 1968 నుంచి 2013 వరకూ ఎల్కేజీ నుంచి 12వ తరగతి వరకూ చదువుకొన్న 16 లక్షల మందికి పైగా విద్యార్థినీ విద్యార్థుల ఫలితాలను విశ్లేషించి తాము ఈ విషయాన్ని చెబుతున్నామని వారు తెలిపారు. కేవలం చదువు మాత్రమే కాదు, విద్యార్థి రేపటి పౌరుడిగా తీర్చిదిద్దబడే విద్యాలయాల్లో వివిధ వయసుల వాళ్లు, అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉండటమే మంచిదని వారు పేర్కొన్నారు. విద్యార్థి మనస్తత్వం, సబ్జెక్టుపై పట్టు, అవ గాహన, బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన, దూకుడుతనం వంటి అంశాలపై కో ఎడ్యుకేషన్ ప్రభావం చూపే అవకాశం ఉందని వారు విశ్లేషించారు. కో ఎడ్యుకేషన్‌లో చదవని విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేకంగా నష్టం లేకపోయినప్పటికీ, కో ఎడ్లో చదువుతున్న విద్యార్థులు మాత్రం ఒక విధంగా స్నేహపూర్వకమైన జీవనశైలికి అలవాటు పడే అవకాశాలున్నాయని అధ్యయనకర్తలు అభిప్రాయపడ్డారు. అబ్బాయిలు మంచి ఫలితాలను సాధించారట! అయితే యూరప్‌లోని మనస్తత్వ శాస్త్రవేత్తలు, అధ్యయనకర్తలు మాత్రం ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వినిపించారు. కో-ఎడ్యుకేషన్ కాలేజీల కంటే అబ్బాయిలకు మాత్రమే పరిమితం అయిన కాలేజీల్లోనే అబ్బాయిలు మంచి ఫలితాలు సాధించారని వారు తేల్చారు. కోఎడ్ కాకపోతే చాలా విషయాల గురించి అబ్బాయిలకు ఆలోచనలు రావని వారు అన్నారు. పూర్తిగా సాధ్యం కాని అంశం మీద మన ఆలోచన పోదు. కాబట్టి అబ్బాయిలు పక్క చూపులు చూడటానికి అవకాశం ఇవ్వవని వారు చెప్పుకొచ్చారు. ఇండియాలో బాలుర కోసమే ప్రత్యేకంగా గురుకులాలు ఉండేవని యుక్తవయసులో ఉన్న వారికి వేరే ఆలోచనలు రానీయకుండా విద్యాబోధన జరిగేదని యూరప్ అధ్యయనకర్తలు విశ్లేషించారు. కలివిడిగా చదవడం మంచిదే! ఏదైనా దొరకనంత వరకూ దాహం ఎక్కువగా ఉంటుంది. కో ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు తాము ఏదో కోల్పోతున్నామనే భావనలో పడిపోతున్నారు. ఇక కో ఎడ్యుకేషన్‌లో చదివి క్లాస్మేట్లతో ప్రేమలో పడే వారూ లేకపోలేదు. అయితే అలాంటి వారి సంఖ్య నూటికి రెండు మూడు శాతం మాత్రమే. కాబట్టి పిల్లలను కో ఎడ్యుకేషన్‌కు దూరం పెట్టి, పరిమితులు విధించడం అంతమంచిది కాదు. నేటి యువతలో కూడా కో ఎడ్యుకేషనే కావాలనే కోరిక ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో అనేక విద్యాసంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా కో ఎడ్యుకేషన్‌ను ఏర్పాటుచేయవలసి వస్తోందని నాతో చెప్పుకున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఒకే క్లాస్‌రూమ్‌లో ఉండటం వల్ల కొన్ని మంచి పనులు కూడా ఉంటాయి. నీ క్లాస్‌లో అమ్మాయిల ముందు అల్లరి పాలు కాకూడదు.. అనే భావనతో చాలా మంది అబ్బాయి డీసెంట్‌గా నడుచుకోవడానికి, తన మీద అందరికీ మంచి ఇంప్రెషన్ కలగాలని బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. - యండమూరి వీరేంద్రనాథ్, ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస బోధకుడు -
అసలేమైంది..?
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: ‘కాపాడండి.. రక్షించండి.. నన్ను విడిచిపెట్టండి.. అమ్మా...’ అని బిగ్గరగా ఏడుస్తూ యువతి చేస్తున్న ఆర్తనాదాలు వినిపించడంతో విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. మొదట ఏదోలే అనుకున్నా సుమారు రెండు గంటల పాటు వినిపించిన అరుపులు వారిని కదిలించాయి. తొలుత భయపడ్డా తర్వాత సాహసించి వెళ్లారు. అక్కడ ఎవ్వరూ లేరు.. విద్యార్థులు భ్రమపడ్డారని పోలీసులు కొట్టిపారేస్తున్నా.. ఏదో జరిగిందని విద్యార్థులు కచ్చితంగా చెబుతున్నారు. ఆలస్యంగా వెల్లడైన ఈ సంఘటన గురించి విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం పట్టణంలోని మహిళా కళాశాల సమీపంలో ఎస్టీ హాస్టల్ ఉంది. రోజూ సాయంత్రం వేళ సమీపంలోని ఆలయం నుంచి వచ్చే పాటలు హాస్టల్ విద్యార్థులు వింటూంటారు. గత నెల 28న సాయంత్రం 6.30 గంటల సమయంలో పాటలకు బదులుగా రక్షించమని రోదిస్తూ యువతి చేసిన అరుపులు వినిపించాయి. ఏడుస్తున్న అమ్మాయి గొంతు నొక్కినట్లుగా కూడా వినిపించింది. ఊపిరి కూడా పీల్చుకోలేనట్లు అనిపించడంతో ఎవరో యువతి ప్రమాదంలో ఉందని విద్యార్థినులకు అనుమానం కలిగింది. వెంటనే 100 నంబరుకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న గంట తర్వాత పోలీసులు తాపీగా వచ్చారు. ఈలోగా విద్యార్థినుల ద్వారా సమాచారం తెలుసుకున్న హాస్టల్ వార్డెన్ ఎర్రన్నాయుడు కూడా కళాశాల వద్దకు చేరుకున్నారు. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు, హాస్టల్ వార్డెన్, కొందరు విద్యార్థినులు కళాశాల పరిసరాలు గాలించారు. అరుపులు ఎక్కడి నుంచి వచ్చాయని భావించారో అక్కడికి కూడా వెళ్లి చూశారు. ఎవరూ కనిపించలేదు. కళాశాల గదుల్లోనూ గాలించారు. ఎవరూ కనిపించకపోగా అరుపులు కూడా ఆగిపోయాయి. దీనికి కారణం గుర్తించలేకపోయినా ఏదో జరిగిందని చెబుతున్న ఎస్టీ హాస్టల్ విద్యార్థినులు తీవ్ర భయాందోళనతో ఉన్నారు. ఈ మిస్టరీ తేలే వరకూ విద్యార్థినుల భయాందోళనలు తొలగవు. అప్పుడప్పుడూ శబ్దాలు వస్తాయి దీనిపై హాస్టల్ వార్డెన్ ఎర్రన్నాయుడును ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా, అమ్మాయి అరుపులు వినిపించాయని విద్యార్థినులు చెప్పారని, కళాశాల వద్దకు వెళ్లి వెతికామన్నారు. ఎవరైనా వచ్చారా అని వాచ్‌మాన్‌ను అడిగితే ఎవరూ రాలేదన్నాడన్నారు. రోజూ ఏవో అరుపులు వినిపిస్తుంటాయని, గాజుల శబ్దం, ఎవ రో నడిచి వెళ్తున్నట్లు, చిన్న శబ్దాలు రాత్రి వేళ వినిపిస్తుంటాయని వాచ్‌మన్ చెప్పాడన్నారు. విద్యార్థినుల భ్రమ దీనిపై శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్సై భాస్కరరావును ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా, సమాచారం తెలిసిన వెంటనే తమ సిబ్బంది వెళ్లి వెతికినా ఏ జాడ కనిపించలేదన్నారు. తాను హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడానని, ఏదో భ్రమతో అలా ఊహించుకుని ఉంటారే త ప్ప ఏం జరగలేదన్నారు. అధ్వానంగా పరిసరాలు కళాశాల పరిసర ప్రాంతాలు అధ్వానంగా ఉన్నాయి. మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.అపారిశుద్ధ్య వాతావరణంలోనే విద్యార్థులు భోజనం చేయాల్సిన పరిస్థితి ఉంది. కళాశాల ప్రాంగణంలో తుప్పలు భయాన్ని కలిగిస్తున్నాయి. పగలు కూడా వంటరిగా తిరగలేని విధంగా ఉందని విద్యార్థినులు చెబుతున్నారు. కళాశాల ఆవరణలో విద్యుత్ దీపాలు పూర్తి స్థాయిలో లేవు. సాయంత్రమైతే కళాశాల ఆవరణలో ప్రవేశించాలంటే విద్యార్థులు భయపడే విధంగా వాతావరణం ఉంది.