Amala Paul Says She Acted With Much Older Heroes During Her Initial Days Of Beginning Career - Sakshi
Sakshi News home page

Amala Paul : 'చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా'.. షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన హీరోయిన్‌

Published Tue, Aug 23 2022 10:55 AM | Last Updated on Tue, Aug 23 2022 11:38 AM

Amala Paul Says She Acted With Much Older Heros During Her Intial Days - Sakshi

విభిన్నమైన పాత్రలతో తనకంటూ దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్‌ అమలాపాల్‌. మైనా చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పలు హిట్‌ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. సినీ ఇండస్ట్రీకి అమలాపాల్‌ పరిచయమై 12 ఏళ్లు అవుతుంది. ఈ సందర్బంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

'కెరీర్‌ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా. నా కన్నా పెద్ద వయసులో ఉన్న హీరోలతో నటించాను. ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ నటిగా వాళ్లనుంచి ఎంతో నేర్చుకున్నా. జీవితంలో ఒకానొక సందర్భంలో చాలా క్లిష్ట పరిస్థితులు ఫేస్‌ చేశాను. సక్సెస్‌ కోసం పాకులాడినట్లు అనిపించింది. నిజానికి దూరంగా బతుకుతున్నట్లు ఫీలయ్యా.

ఆ సమయంలో ఎంతో మదనపడ్డాను. సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్నా. మా నాన్ని చనిపోయిన సందర్భంలో ఎన్నో భయాలు వెంటాడాయి. కోలుకోవడానికి సమయం పట్టింది. కానీ పోరాడి నిలబడగలిగాను' అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: షాకింగ్‌:  స్టార్‌ డైరెక్టర్‌కు 6నెలల జైలు శిక్ష.. ఎందుకంటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement