జైలర్‌ నటుడు అరెస్ట్‌.. కానిస్టేబుల్‌ను కొట్టడం వల్లే! | Actor Vinayakan Arrested By CISF Personnel At Hyderabad Airport | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న నటుడు!

Published Sat, Sep 7 2024 8:03 PM | Last Updated on Mon, Sep 9 2024 10:05 AM

Actor Vinayakan Arrested By CISF Personnel At Hyderabad Airport

సాక్షి, హైదరాబాద్‌: జైలర్‌ నటుడు వినాయకన్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మద్యం మత్తులో సీఐఎస్‌ఎఫ్‌ (కేంద్ర పారిశ్రామికా భద్రత దళం) కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో హైదరాబాద్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్‌.. కొచ్చి నుంచి హైదరాబాద్‌ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనపై స్పందించిన వినాయకన్‌ తానే తప్పూ చేయలేదంటున్నాడు. ఎయిర్‌పోర్టు అధికారులే తనను గదిలోకి తీసుకెళ్లి వేధించారంటున్నాడు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చెక్‌ చేసుకోమని చెప్తున్నాడు. అసలు తనను ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని మీడియాతో వాపోయాడు. కాగా మలయాళ నటుడు వినాయకన్‌.. రజనీకాంత్‌ జైలర్‌ సినిమాలో వర్మ పాత్రతో మరింత పాపులర్‌ అయ్యాడు. గతేడాది అక్టోబర్‌ 23న కూడా దురుసు ప్రవర్తన వల్ల జైలుపాలయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement