Vinayakan
-
తప్పతాగిన నటుడు.. అర్ధనగ్నంగా కేకలు వేస్తూ.. వీడియో వైరల్!
రజినీకాంత్ జైలర్ మూవీ పేరు వినగానే ఆయనే గుర్తుకు వస్తారు. వర్త్ వర్మ వర్త్ అనే డైలాగ్‌తో అభిమానులను అలరించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం రజినీకాంత్ ఖాతాలో సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీలో తనదైన విలనిజంతో ఎంత ఫేమస్ అయ్యాడో అదే స్థాయిలో వివాదాల్లోనూ నిలిచారు. గతంలో వినాయకన్‌ని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. జీపులో స్టేషన్ కి కూడా తీసుకెళ్లారు. మద్యం ఫుల్‌గా తాగేసి పబ్లిక్ ప్లేసులో అసభ్యంగా ప్రవర్తించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఆ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.వీడియో వైరల్..తాజాగా వినాయకన్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఫుల్‌గా తాగి గట్టిగా అరుస్తూ ఆ వీడియోలో కనిపించారు. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఇందులో వినాయకన్ అర్ధనగ్నంగా కనిపించారు. అయితే ఈ వీడియో ఆయన ఇంట్లో బాల్కనీలో ఉండగా తీసినట్లు తెలుస్తోంది. విజువల్స్ చూస్తే ఎవరితోనో గొడవ పడుతున్నట్లు అర్థమవుతోంది. ఏదేమైనా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వినాయకన్ ప్రవర్తనపై నెటిజన్స్ మండిపడుతున్నారు. సినిమాల నుంచి అతన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.హైదరాబాద్‌లోనూ న్యూసెన్స్..గతంలో జైలర్ నటుడు వినాయకన్ మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తనను ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని వాపోయాడు. వినాయకన్.. కొచ్చి నుంచి హైదరాబాద్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.కాగా మలయాళ నటుడైన వినాయకన్.. రజనీకాంత్ జైలర్ సినిమాలో వర్మ పాత్రతో మరింత పాపులర్ అయ్యాడు. పలు మలయాళ సినిమాల్లో నటించాడు. మలయాళ, తమిళ సినిమాల్లో చేస్తున్న వినాయకన్.. తెలుగులో కల్యాణ్ రామ్ 'అసాధ్యుడు'లో సెకండ్ విలన్‌గా నటించాడు. చివరిసారిగా ఇటీవల రిలీజైన ఉన్ని ముకుందన్ చిత్రం మార్కోలో కనిపించారు. #Vinayakan 🥃🔞🙉Actor or Drunker 😡He should be banned from acting.pic.twitter.com/JK3UWJTzop— Tharani ᖇᵗк (@iam_Tharani) January 20, 2025 -
జైలర్ నటుడు అరెస్ట్.. కానిస్టేబుల్‌ను కొట్టడం వల్లే!
సాక్షి, హైదరాబాద్: జైలర్ నటుడు వినాయకన్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మద్యం మత్తులో సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామికా భద్రత దళం) కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్.. కొచ్చి నుంచి హైదరాబాద్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనపై స్పందించిన వినాయకన్ తానే తప్పూ చేయలేదంటున్నాడు. ఎయిర్‌పోర్టు అధికారులే తనను గదిలోకి తీసుకెళ్లి వేధించారంటున్నాడు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చెక్ చేసుకోమని చెప్తున్నాడు. అసలు తనను ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని మీడియాతో వాపోయాడు. కాగా మలయాళ నటుడు వినాయకన్.. రజనీకాంత్ జైలర్ సినిమాలో వర్మ పాత్రతో మరింత పాపులర్ అయ్యాడు. గతేడాది అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తన వల్ల జైలుపాలయ్యాడు. -
'ఆయనతో పని చేయడం చాలా కష్టం'.. జైలర్ విలన్‌పై డైరెక్టర్ కామెంట్స్!
చియాన్ విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కించిన తాజా చిత్రం 'ధృవ నచ్చిత్తిరం'. తెలుగులో ధృవ నక్షత్రం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది. విక్రమ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీలో జైలర్ ఫేమ్ వినాయకన్ విలన్‌గా నటిస్తున్నారు. తాజాగా మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వాసుదేవ్ మీనన్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా వినాయకన్‌తో పనిచేయడం చాలా కష్టమని తెలిపారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ.. 'వినాయకన్‌ను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే క్యారెక్టర్ స్టైల్, కాస్ట్యూమ్, క్యారెక్టర్‌కి ఎలాంటి మూడ్ ఇవ్వాలనుకుంటున్నానో అతనికి స్పష్టంగా వివరించాలి. ఈ సినిమాలోని చాలా సన్నివేశాల్లో వినాయకన్‌కి విక్రమ్ మేకప్ వేయాల్సి వచ్చింది. వినాయకన్ సర్ ఓ ఫైట్ సీన్లో గాయపడ్డారు. ఆ తర్వాత విక్రమ్, వినాయకన్ ఇద్దరూ కలిసి ఆ సీన్ ఎలా చేయాలో చర్చించుకున్నారు. అయితే వినాయకన్ ఇంత స్టైలిష్‌గా మరే సినిమాలోనూ కనిపించలేదు. అతని డైలాగ్స్, స్వాగ్, మ్యానరిజమ్ అద్భుతంగా ఉన్నాయని' అన్నారు. మొదట ఈ సినిమాలో విలన్ కోసం వెతుకుతున్నప్పుడు అతని పేరును నటి దివ్యదర్శిని సూచించింది. అతని సినిమాలు చూశాక.. విలన్‌గా ది బెస్ట్ అనిపించించిదని గౌతమ్ మీనన్ తెలిపారు. ఈ సినిమాలో అతనే బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చాడు. ఇటీవలే డబ్బింగ్ చెప్పి వెళ్లిపోయాడు. కానీ నేను అతని నుంచి మరో రోజు ఆశించా. కానీ దొరకలేదు. వినాయకన్‌కి ఫోన్లో మెసేజ్ పెట్టా. సార్ మీరు ఈ సినిమాలో ఎంత బాగా చేశారో మీకు తెలియదు. ఈ విషయం సినిమా విడుదలయ్యాక మీకే అర్థమవుతుంది. ఇందులో విక్రమ్ సార్ హీరోగా నటించడం నా అదృష్టం.' అని గౌతం వాసుదేవ్ మీనన్ అన్నారు. కాగా.. జైలర్ తర్వాత వినాయకన్ మరోసారి విలన్‌గా అలరించనున్నారు. తమిళ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ధృవ నచిత్తిరం'. విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్‌లో వినాయకన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు విశేష ఆదరణ లభించింది. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా కనిపించనున్నారు. పార్తీపన్, మున్నా, సిమ్రాన్, రాధిక శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?
వర్త్ వర్మ వర్త్.. ఈ డైలాగ్ వినగానే మీ 'జైలర్' సినిమాలో విలన్ గుర్తొస్తాడు. మూవీలో విలనిజంతో అదరగొట్టిన నటుడు వినాయకన్‌ని కేరళ పోలీసులు నిజంగానే అరెస్ట్ చేశారు. జీపులో స్టేషన్ కి కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: చిరంజీవి కొత్త సినిమాలో విలన్‌గా రామ్‌చరణ్ ఫ్రెండ్!) ఏం జరిగింది? కేరళకు చెందిన నటుడు వినాయకన్.. పలు మలయాళ సినిమాల్లో నటించాడు. ఇప్పుడిప్పుడే తమిళ చిత్రాలు కూడా చేస్తున్నాడు. తాజాగా మద్యం ఫుల్‌గా తాగేసి పబ్లిక్ ప్లేసులో అసభ్యంగా ప్రవర్తించాడట. కొందరు అతడిని కంట్రోల్ చేయాలని ప్రయత్నించినప్పటికీ.. అతడు వినకపోగా వారిని ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ ఇబ్బంది పెట్టాడట. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. ఇక వినాయకన్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం ఎర్నాకుళంలోని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అయితే వినాయకన్ ప్రవర్తన ఎప్పుడూ ఇలానే ఉంటుందని కొందరు ఆరోపిస్తున్నారు. మలయాళ, తమిళ సినిమాల్లో చేస్తున్న వినాయకన్.. తెలుగులో కల్యాణ్ రామ్ 'అసాధ్యుడు'లో సెకండ్ విలన్‌గా నటించాడు. (ఇదీ చదవండి: పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!) -
'జైలర్' విలన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్' సినిమాతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చారు. దాదాపు రూ.600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించారు. ఈ మూవీలో రజనీతోపాటు శివరాజ్ కుమార్, మోహన్‌లాల్ లాంటి స్టార్స్ నటించినప్పటికీ.. విలన్‌గా చేసిన వినాయకన్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం బయటపడింది. కేరళకు చెందిన వినాయకన్..1995 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. కెరీర్ మొదట్లో చిన్నాచితకా పాత్రలు చేసిన ఇతడు.. మెల్లమెల్లగా విలన్ తరహా పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళంలోనే ఎక్కువగా మూవీస్ చేస్తూ వచ్చాడు. అయితే 'జైలర్'లో ప్రతినాయకుడిగా చేయడం ఇతడికి దక్షిణాదిలో చాలా పేరు తీసుకొచ్చింది. ఇలాంటి టైంలో ఇతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం షాకింగ్‌గా అనిపించింది. (ఇదీ చదవండి: హీరోయిన్‌తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు) ఏం జరిగింది? ఈ సంఘటన 2019లో జరిగినట్లు తెలుస్తోంది. మోడల్ మృదులా దేవితో ఇతడు ఫోన్లో అసభ్యంగా మాట్లాడాడు. ఆమెతో పాటు తల్లిని కూడా తన రూమ్‌కి తీసుకురావాలని కామెంట్ చేశాడు. ఈ విషయమై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా వాళ్లు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే వినాయకన్ కామెంట్స్ నిజమేనని తేలింది. తొలుత అరెస్ట్ చేశారు కానీ తర్వాత బెయిల్‌పై రిలీజ్ అయ్యాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ వివాదం.. ఇప్పుడు 'జైలర్' హిట్ కావడంతో మరోసారి తెరపైకి వచ్చింది. తెలుగులో కూడా అయితే ఎక్కువగా మలయాళ సినిమాలు చేసిన వినాయకన్.. తెలుగులోనూ జగపతిబాబు 'అసాధ్యుడు'లో విలన్ గ్యాంగ్‌లో ఒకడిగా చేశాడు. ప్రస్తుతం విక్రమ్-గౌతమ్ మేనన్ కాంబినేషన్ లో తీస్తున్న 'ధ్రువనక్షత్రం' మూవీలో నటిస్తున్నాడు. ఇది త్వరలో రిలీజ్ కానుంది. ఏదేమైనా ఓ నటుడికి కాస్త పేరు వస్తే చాలు అతడు గతంలో చేసినవన్నీ తెరపైకి వస్తుంటాయి. (ఇదీ చదవండి: పెళ్లిపై విజయ్ దేవరకొండ కామెంట్స్.. అమ్మాయిలో ఆ క్వాలిటీస్!)