సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్' సినిమాతో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చారు. దాదాపు రూ.600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించారు. ఈ మూవీలో రజనీతోపాటు శివరాజ్ కుమార్, మోహన్‌లాల్ లాంటి స్టార్స్ నటించినప్పటికీ.. విలన్‌గా చేసిన వినాయకన్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం బయటపడింది.
కేరళకు చెందిన వినాయకన్..1995 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. కెరీర్ మొదట్లో చిన్నాచితకా పాత్రలు చేసిన ఇతడు.. మెల్లమెల్లగా విలన్ తరహా పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళంలోనే ఎక్కువగా మూవీస్ చేస్తూ వచ్చాడు. అయితే 'జైలర్'లో ప్రతినాయకుడిగా చేయడం ఇతడికి దక్షిణాదిలో చాలా పేరు తీసుకొచ్చింది. ఇలాంటి టైంలో ఇతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం షాకింగ్‌గా అనిపించింది.
(ఇదీ చదవండి: హీరోయిన్‌తో ఐఆర్ఎస్ అధికారి రిలేషన్.. గిఫ్ట్‌గా బంగారం, భవనాలు)
ఏం జరిగింది?
ఈ సంఘటన 2019లో జరిగినట్లు తెలుస్తోంది. మోడల్ మృదులా దేవితో ఇతడు ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడాడు. ఆమెతో పాటు తల్లిని కూడా తన రూమ్‌కి తీసుకురావాలని కామెంట్ చేశాడు. ఈ విషయమై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా వాళ్లు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే వినాయకన్ కామెంట్స్ నిజమేనని తేలింది. తొలుత అరెస్ట్ చేశారు కానీ తర్వాత బెయిల్‌పై రిలీజ్ అయ్యాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ వివాదం.. ఇప్పుడు 'జైలర్' హిట్ కావడంతో మరోసారి తెరపైకి వచ్చింది.
తెలుగులో కూడా
అయితే ఎక్కువగా మలయాళ సినిమాలు చేసిన వినాయకన్.. తెలుగులోనూ జగపతిబాబు 'అసాధ్యుడు'లో విలన్ గ్యాంగ్‌లో ఒకడిగా చేశాడు. ప్రస్తుతం విక్రమ్-గౌతమ్ మేనన్ కాంబినేషన్ లో తీస్తున్న 'ధ్రువనక్షత్రం' మూవీలో నటిస్తున్నాడు. ఇది త్వరలో రిలీజ్ కానుంది. ఏదేమైనా ఓ నటుడికి కాస్త పేరు వస్తే చాలు అతడు గతంలో చేసినవన్నీ తెరపైకి వస్తుంటాయి.
(ఇదీ చదవండి: పెళ్లిపై విజయ్ దేవరకొండ కామెంట్స్.. అమ్మాయిలో ఆ క్వాలిటీస్!)
Comments
Please login to add a commentAdd a comment