రజినీకాంత్ జైలర్ మూవీ పేరు వినగానే ఆయనే గుర్తుకు వస్తారు. వర్త్ వర్మ వర్త్ అనే డైలాగ్‌తో అభిమానులను అలరించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం రజినీకాంత్ ఖాతాలో సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీలో తనదైన విలనిజంతో ఎంత ఫేమస్ అయ్యాడో అదే స్థాయిలో వివాదాల్లోనూ నిలిచారు. గతంలో వినాయకన్‌ని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. జీపులో స్టేషన్ కి కూడా తీసుకెళ్లారు. మద్యం ఫుల్‌గా తాగేసి పబ్లిక్ ప్లేసులో అసభ్యంగా ప్రవర్తించడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఆ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
వీడియో వైరల్..
తాజాగా వినాయకన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఫుల్‌గా తాగి గట్టిగా అరుస్తూ ఆ వీడియోలో కనిపించారు. ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఇందులో వినాయకన్ అర్ధనగ్నంగా కనిపించారు. అయితే ఈ వీడియో ఆయన ఇంట్లో బాల్కనీలో ఉండగా తీసినట్లు తెలుస్తోంది. విజువల్స్ చూస్తే ఎవరితోనో గొడవ పడుతున్నట్లు అర్థమవుతోంది. ఏదేమైనా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వినాయకన్ ప్రవర్తనపై నెటిజన్స్ మండిపడుతున్నారు. సినిమాల నుంచి అతన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్‌లోనూ న్యూసెన్స్..
గతంలో జైలర్ నటుడు వినాయకన్ మద్యం మత్తులో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తనను ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని వాపోయాడు. వినాయకన్.. కొచ్చి నుంచి హైదరాబాద్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
కాగా మలయాళ నటుడైన వినాయకన్.. రజనీకాంత్ జైలర్ సినిమాలో వర్మ పాత్రతో మరింత పాపులర్ అయ్యాడు. పలు మలయాళ సినిమాల్లో నటించాడు. మలయాళ, తమిళ సినిమాల్లో చేస్తున్న వినాయకన్.. తెలుగులో కల్యాణ్ రామ్ 'అసాధ్యుడు'లో సెకండ్ విలన్‌గా నటించాడు. చివరిసారిగా ఇటీవల రిలీజైన ఉన్ని ముకుందన్ చిత్రం మార్కోలో కనిపించారు.
#Vinayakan 🥃🔞🙉
Actor or Drunker 😡
He should be banned from acting.
pic.twitter.com/JK3UWJTzop— Tharani ᖇᵗк (@iam_Tharani) January 20, 2025
Comments
Please login to add a commentAdd a comment