carrer
-
‘అదే నన్ను సాధారణ ఉద్యోగి నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోని చేసింది’
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు నాయకత్వం వహిస్తానని ఊహించలేదని అన్నారు. 1992లో మైక్రోసాఫ్ట్‌లో యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా అడుగుపెట్టిన తాను కంపెనీ సీఈవో అవుతానన్న ఆలోచన కూడా లేదంటూ లింక్డిన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘1992లో 22 ఏళ్ల వయసులో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగంలో చేరాక, ఈ ప్రపంచంలోనే గొప్ప ఉద్యోగం చేస్తున్నానని అనుకునేవాణ్ని. నేను చేస్తున్న పని గొప్పదనే భావనతో ఉండేవాణ్ని. మరో చోటికి వెళ్లి ఉద్యోగం చేయాలనే ఆలోచన నాకు ఉండేది కాదు’ అని అన్నారు. చేస్తున్న ఉద్యోగంలో ఎదుగుదల లేదని, వేరే ఆఫీస్‌లో చేరదాం అనే ఆలోచనతో కాకుండా.. ప్రస్తుతం ఆఫీస్‌లో మీరు చేస్తున్న పాత్రని విజయవంతంగా పోషించండి. మైక్రోసాఫ్ట్‌లో నేను నేర్చుకున్న పాఠం ఇదే. మీరు బాగా పనిచేసేందుకు మరో ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దు. మొత్తం 30 ఏళ్ల మైక్రోసాఫ్ట్ కెరియర్లో నేను చేస్తున్న ఉద్యోగం గురించి ఎప్పుడూ ఆలోచించిన సందర్భం లేదు. నేను అక్కడ చేస్తున్న ఉద్యోగం చాలా ముఖ్యమైన విషయంగా భావించినట్లు వివరించారు. మీ ప్రస్తుత ఉద్యోగాన్ని మీ కెరీర్ లక్ష్యాలను చేరుకోవడానికి అడ్డంకిగా భావించడానికి బదులుగా ఆసక్తిని, అంకితభావాన్ని, నేర్చుకోవడాన్ని ఓ అవకాశంగా భావించాలి. ఈ మనస్తత్వాన్ని అవలంబించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాల్ని అంటే ప్రమోషన్లు లేదా శాలరీల పెంపును వేగంగా పొందగలుగుతారని అన్నారు. చేస్తున్న పని వల్ల ఎదుగుదల ఉండడం లేదని అనిపిస్తే మీరు ఎప్పటికీ ఎదగలేరని సూచించారు. ఇప్పటికీ చాలా మంది కెరీర్‌కు సంబంధించి మంచి సలహా ఇవ్వమని అడుగుతుంటారు. వారికి నేను చెప్పేదొక్కటే.. మీరు బాగా పనిచేసేందుకు మరో ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దని చెబుతాను. నేను సీఈవో అయ్యే ముందు రోజు వరకు నాకు అలాంటి ఆలోచనేలేదు అని లింక్డిన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ నిర్వహించిన ఇంటర్వ్యూలో సత్యనాదెళ్ల తన మనసులో మాటని బయటపెట్టారు. చదవండి👉 కోడింగ్ రానక్కర్లేదు.. మైక్రోసాఫ్ట్ మరో సంచలనం! -
ఆ హీరోలతో నటించినప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యా : అమలాపాల్
విభిన్నమైన పాత్రలతో తనకంటూ దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ అమలాపాల్. మైనా చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పలు హిట్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. సినీ ఇండస్ట్రీకి అమలాపాల్ పరిచయమై 12 ఏళ్లు అవుతుంది. ఈ సందర్బంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా. నా కన్నా పెద్ద వయసులో ఉన్న హీరోలతో నటించాను. ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ నటిగా వాళ్లనుంచి ఎంతో నేర్చుకున్నా. జీవితంలో ఒకానొక సందర్భంలో చాలా క్లిష్ట పరిస్థితులు ఫేస్ చేశాను. సక్సెస్ కోసం పాకులాడినట్లు అనిపించింది. నిజానికి దూరంగా బతుకుతున్నట్లు ఫీలయ్యా. ఆ సమయంలో ఎంతో మదనపడ్డాను. సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకున్నా. మా నాన్ని చనిపోయిన సందర్భంలో ఎన్నో భయాలు వెంటాడాయి. కోలుకోవడానికి సమయం పట్టింది. కానీ పోరాడి నిలబడగలిగాను' అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: షాకింగ్: స్టార్ డైరెక్టర్‌కు 6నెలల జైలు శిక్ష.. ఎందుకంటే -
మీరు చాలా అదృష్టవంతులు!
మా రోజులతో పోలిస్తే ఈరోజుల్లో యువతకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. విస్తృతమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. యువత తమ లక్ష్యాన్ని చేరువకావడానికి ఒక సులువైన దారి ఏర్పడి ఉంది. అందుకే అంటున్నాను...మీరు అదృష్టవంతులని. మా నాన్నగారు నాకో మంచి సలహా ఇచ్చారు: ‘‘నువ్వు ఏదైనా కోరుకుంటే- ఆ కోరుకున్నది లభిస్తే... మంచిది. నువ్వు కోరుకున్నది లభించకపోతే- ఇంకా మంచిది! ఎందుకంటే ఒకటి జరగడం, జరగకపోవడం అనేది నీ కృషితో పాటు భగవంతుడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మనకు చెడు చేయాలని ఆయన అనుకోడు కదా!’’కోరుకున్నది దొరకనంత మాత్రాన నిత్య అసంతృప్తితో జీవితాన్ని వృథా చేసుకోవద్దని, చేస్తున్న పనికి చిత్తశుద్ధితో న్యాయం చేయాలనీ అనేవారు ఆయన. ఇక జయాపజయాల గురించి వస్తే, విజయం ఒక్కసారిగా వచ్చి మన ముందు నిల్చోదు. పరాజయాలు మన ఓపికను పరీక్షిస్తాయి. నా విషయానికి వస్తే, కెరీర్ మొదట్లో రకరకాల అవమానాలు ఎదుర్కొన్నాను. ‘ఒకరితో మాట పడడం ఎందుకు?’ అని అని నేను అనుకొని ఉంటే, హీరోను అయ్యేవాడిని కాదు. నలుగురికీ తెలిసేవాడిని కాదు. లక్ష్యాన్ని చేరుకుంటామా? లేదా? అనేది వేరే విషయం...ముందు ఒక లక్ష్యం అంటూ ఏర్పరుచుకోవడం అనేది చాలా ముఖ్యం. మరి మీరు? -
కెరీర్.. ప్రేమ.. పెళ్లి..
రెండు మనసులను ఒక గూటికి చేర్చే మహత్తర మంత్రం ప్రేమ. కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, దేశాలు... అన్ని హద్దులు చెరిపేసి కలుసుకునేలా చేసే ఓ అద్భుతశక్తి. ప్రేమకు ఓ రోజుంటే అదే ప్రేమికుల దినోత్సవం. ఆ రోజున పార్కుల్లో సందడి, సినిమాలు, షికార్లు, నవ్వుల పువ్వులు, గ్రీటింగ్ కార్డులతో ప్రేమపక్షుల హుషారే వేరు. కానీ, పరిస్థితులు మారాయి. యువత మదిలో ఇపుడు మోగుతోంది ప్రేమ మంత్రం కాదు. వారి చూపంతా లక్ష్యసాధనవైపే. కెరీర్ తర్వాతే ప్రేమ అంటోంది. - న్యూస్‌లైన్, కరీంనగర్ బిజినెస్ కరీంనగర్ బిజినెస్, న్యూస్‌లైన్ : గతంతో పోలిస్తే ప్రేమ వివాహాలు చాలా తగ్గాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విడాకులు తీసుకుంటున్న జంటలను పరిశీలిస్తే నూటికి 63 శాతం జంటలు ప్రేమ వివాహం చేసుకున్నవారే. మన జిల్లాలో నూటికి 86 శాతం పెద్దలు కుదిర్చిన పెళ్లిలే జరుగుతున్నాయి. యువత ధ్యాసంతా జీవితంలో స్థిరపడాలనే లక్ష్యసాధనపైనే. కెరీర్ తర్వాతే ప్రేమంటున్న యువత 90 శాతంపైనే. మిగతావారు కెరీర్‌తోపాటు ప్రేమ కూడా ముఖ్యమే అంటున్నారు. కొందరు ప్రేమనే నమ్ముకుంటున్నా రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నవారే ఎక్కువ. ఇళ్లలో తెలియకుండా పెళ్లి చేసుకునే సవాలే లేదంటున్నారు. ఇంతకుముందు ప్రేమికులు హంగు ఆర్భాటాలు లేకుండా దేవాలయాల్లో, ఆర్యసమాజ్ వంటి సంస్థల్లో పెళ్లి చేసుకున్న యువత ఇప్పుడు సంప్రదాయ వివాహాలకు పెద్దపీట వేస్తోంది. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరి సమక్షంలో సంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి జరగాలని కోరుకుంటోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమ, ప్రేమ వివాహాలపై పలువురు ఇలా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆత్మీయులను దూరం చేస్తుంది చాలా మంది కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడుతుంటారు. ప్రస్తుతం నేను ఎంటెక్ చేస్తున్నాను. నాకు ఇంతవరకు అటువంటి ఆలోచన కూడా కలగలేదు. నేను పెద్దలు కుదిర్చిన సంబంధాన్నే చేసుకుంటాను. ప్రేమ వివాహాలతో కుటుంబసభ్యులు, బంధువులు, ఆత్మీయులు దూరమవుతారని నా గట్టి అభిప్రాయం. నేను ఇంతవరకు గమనించిన ప్రేమ జంటలన్నీ కూడా ఇబ్బందుల పాలవుతున్నాయి. - ప్రియా, ఎంటెక్ తల్లిదండ్రులే ముఖ్యం మన జీవితంలో సంతోషం వచ్చినా, బాధ వచ్చినా తలచుకునేది మన తల్లిదండ్రులనే. పెంచి పెద్దచేసిన తల్లిదండ్రుల మాటనే శిరసావహించి వాళ్లు చూసిన సంబంధాన్ని మేము చేసుకున్నాం. ప్రేమ వివాహం అంటే మాకు ఇష్టం లేదు. చాలా మంది యువతీయువకులు సెల్ఫోన్లతో, ఫేస్బుక్, చాటింగ్‌ల కారణంగా అనుకోకుండా దగ్గరైపోతున్నారు. ఆకర్షణనే ప్రేమనుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. - స్వప్న-రాందర్శేందర్రెడ్డి దంపతులు పెద్దల సమక్షంలో జరగాలి పెళ్లంటే నూరేళ్ల పంట. మానవ జీవితంలో మరువలేని మధురానుభూతి. ఈ శుభకార్యం తప్పకుండా తల్లిదండ్రులు, పెద్దల సమక్షంలోనే జరగాలని నా అభిప్రాయం. ప్రేమించినా రెండు వైపులా పెద్దలకు తెలియజేసి, వారిని ఒప్పించుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా పెళ్లి చేసుకుంటే ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఒక వేళ వచ్చినా పెద్దలు వాటిని ముందుండి పరిష్కరిస్తారు. - ఎస్.రమణ, ఎంటెక్ జీవితం ఆనందమయం ప్రేమ వివాహాలతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. పెళ్లికి ముందుగా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని ఎదుటి వారి అభిరుచులు, ఆలోచనలు అన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుంది కావున వారికి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ప్రేమించినా... ఇంట్లో పెద్దలను ఒప్పించి, వారి సమక్షంలో పెళ్లి చేసుకున్నవాళ్లు ఎంతో ఆనందంగా ఉంటారు. - ఎం.సుజిత్, బీటెక్ మన సంస్కృతి కాదు ప్రేమికుల రోజు నిర్వహించడ ం మన సంస్కృతి కాదు. నేడు ప్రేమ పెళ్లిలు 10 బాగుంటే.. 90 చెడిపోతున్నాయి. పెద్దలు చేసిన పెళ్లిలు బాగుంటున్నాయి. మన ఇతిహాసాలలో, పురాణాలలో ప్రేమ అనేది ఉంది. కృష్ణుడు ప్రేమకు ప్రథముడు. కానీ, వాటిపై ప్రచారాలు లేవు. కేవలం వ్యాపారాలు అధికం చేయడానికి విదేశీ సంస్కృతి యువతకు అంటించడం వినాశనానికి నాందిగా చెప్పవచ్చు. - డాక్టర్ రమణాచారి, ఆర్ఎస్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ మెప్పించి ఒప్పించాం మా ప్రేమకు కేంద్రం వేములవాడ. అక్కడ టీచర్‌గా పని చేస్తున్నప్పుడు 1992లో ప్రేమలో పడ్డాం. మా కులాలు వేరు. ఇద్దరం కలిసి జీవించాలనుకున్నాం... ఇంట్లో వారందరనీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరు పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారు. కుటుంబావసరాల రీత్యా ఒకరం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా.. మరొకరం ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తూ హ్యాపీగా లైఫ్‌ను లీడ్ చేస్తున్నాం. నేడు చాలా మంది స్థిరత్వం లేకుండా... ఆకర్షణనే ప్రేమ అనుకుని ముందుకు సాగుతున్నారు. ఈ విధానం మారాలి. - బహుద్దూర్ రఘుకిశోర్- శ్రీదేవి (గెజిటెడ్ హెచ్ఎం, వడ్కాపూర్) -
పునరాగగనమే!
ఒక క్రికెటర్ గొప్పగా పునరాగమనం ఎలా చేయొచ్చో చెప్పడానికి ఉదాహరణగా యువరాజ్ గురించి చెప్పుకున్నాం. క్యాన్సర్‌ను జయించి తిరిగి భారత జట్టులోకి వచ్చి నాణ్యమైన ఇన్నింగ్స్‌తో వహ్వా అనిపించాడు. కానీ ఇది మూణ్నాళ్ల ముచ్చటే అయింది. వరుస వైఫల్యాలతో మళ్లీ జట్టులో స్థానం కోల్పోయాడు. మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. తానేంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాక్షి క్రీడావిభాగం డాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కెరీర్ మళ్లీ డోలాయమానంలో పడింది. త్వరలో జరిగే న్యూజిలాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో యువరాజ్‌కు స్థానం లభించకపోవడంతో అతని కెరీర్ ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో అనే చర్చ మొదలైంది. వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్‌లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్ల తరహాలోనే యువరాజ్ కూడా కష్టకాలం ఎదుర్కొంటున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచిన 32 ఏళ్ల ఈ పంజాబ్ క్రికెటర్ విన్యాసాలు వచ్చే ఏడాది ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లలో జరిగే వన్డే ప్రపంచ కప్‌లో కనిపించే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. టెస్టుల్లో అవకాశం లేనట్లే దిగ్గజ క్రికెటర్ల నీడలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న యువరాజ్ కెరీర్‌కు తాజా పరిణామం పెద్ద దెబ్బలాంటిదే. రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్లతో టెస్టు జట్టులోని మిడిల్ ఆర్డర్లో ఏర్పడిన ఖాళీలోనూ ఈ స్టార్ బ్యాట్స్‌మన్ భర్తీకాలేకపోయాడు. ఇటీవల కాలంలో చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అజింక్యా రహానేలాంటి యువ క్రికెటర్లు రాణిస్తున్నతీరు చూస్తోంటే యువరాజ్‌కు టెస్టు ద్వారాలు మూసుకుపోయినట్టే. కలిసొచ్చిన ఫార్మాట్లలో వైఫల్యం కళ్ల చెదిరే బ్యాటింగ్, సమయోచిత స్పిన్ బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్‌తో వన్డే, టి20 క్రికెట్లో యువరాజ్ ఒక శక్తిగా ఎదిగాడు. క్యాన్సర్ బారిన పడటంతో యువరాజ్ కెరీర్ ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. పట్టుదలతో పోరాడి క్యాన్సర్‌ను జయించిన అతను జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. అయితే అతని ఆటతీరులో ఒకప్పటి పదును లోపించింది. 2012 డిసెంబరు నుంచి 2013 డిసెంబరు మధ్యకాలంలో యువరాజ్ తాను ఆడిన 19 వన్డేల్లో కేవలం రెండు అర్ధసెంచరీలు మాత్రమే చేశాడు. స్వదేశంలో పాకిస్థాన్‌తో, ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లలో వైఫల్యం అతనికి చాంపియన్స్ ట్రోఫీలో స్థానం లేకుండా చేసింది. యువరాజ్ గైర్హాజరీలో భారత్ చాంపియన్స్ ట్రోఫీని గెల్చుకోవడంతో అతను జట్టులో స్థానం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చోటు పోయిందనే బాధను పక్కనపెట్టి శారీరక, మానసిక ధృడత్వం కోసం యువరాజ్ ఫ్రాన్స్‌కు వెళ్లాడు. అక్కడ ఆరువారాలపాటు కఠోర సాధన చేసి రీచార్జ్ అయి వచ్చాడు. సెప్టెంబరులో వెస్టిండీస్ ‘ఎ’తో జరిగిన సిరీస్‌లో రాణించి ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానంలో వచ్చిన అతను వరుసగా 7, 0, 0, 12 స్కోర్లతో నిరాశపరిచాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో నాలుగో స్థానంలోకి వచ్చిన యువరాజ్ 16 నాటౌట్, 28, 55 స్కోర్లతో ఫర్వాలేదనిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఆడిన తొలి బంతికే అవుటైన యువరాజ్ రెండో వన్డేలో బరిలోకి దిగలేదు. మూడో వన్డే రద్దు కావడంతో అతనికి బ్యాటింగ్ అవకాశం రాలేదు. మొత్తానికి ఆస్ట్రేలియా సిరీస్‌తో పునరాగమనం చేసిన యువరాజ్ ఎనిమిది ఇన్నింగ్స్‌లో 16.85 సగటుతో కేవలం 118 పరుగులే చేశాడు. ఇందులో మూడుసార్లు ‘డకౌట్’ అయ్యాడు. ఈ వైఫల్యాల నేపథ్యంలో సందీప్ పాటిల్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ న్యూజిలాండ్ పర్యటనకు యువరాజ్‌ను తప్పించింది. కిం కర్తవ్యం... వచ్చే ప్రపంచకప్‌కు మరో ఏడాది సమయముంది. ఈ మధ్యలో ఆసియా, టి20 ప్రపంచకప్, ఐపీఎల్, ఇంగ్లండ్ పర్యటన, దేశవాళీ వన్డే క్రికెట్ల రూపంలో యువరాజ్ ముంగిట పునరాగమనం కోసం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వచ్చే రెండు నెలల్లో అవకాశాలు రాకపోయినా... ఐపీఎల్ రూపంలో ఓ అవకాశం మాత్రం సిద్ధంగా ఉంటుంది. దానిని బాగా వినియోగించుకుంటే తప్ప ప్రస్తుత పోటీలో మళ్లీ యువీ రాలేడు. అయితే ఈ స్టార్ ఆల్రౌండర్లో ఆ మునుపటి కసి ఉందా లేదా అన్నదే సందేహం. -
ఒత్తిడి పెంచకూడదు
పుల్లెల గోపీచంద్ ఆటలంటే ఇష్టంలేని పిల్లలు ఎవరూ ఉండరు. ఎవరైనా తొలుత సరదా కోసమే ఆడతారు. అంతే గానీ ప్రపంచ చాంపియన్ కావాలనే కోరికతో అడుగుపెట్టరు. ఇలాంటి వారి నుంచి చాంపియన్లు వస్తారు. అయితే పిల్లాడి ఇష్టాయిష్టాలతో పాటు తల్లిదండ్రులు, కోచ్ కీలకం. పిల్లలందరి మనస్తత్వం ఒకేలా ఉండదు. సాధారణంగా చాలామంది గెలవాలని పిల్లలపై ఒత్తిడి తెస్తారు. అతడు పడుతున్న కష్టాన్ని విస్మరిస్తారు. ఇది చాలా తప్పు. కష్టపడమని వెంటపడొచ్చుగానీ... నైరాశ్యంలో వెళ్లే స్థాయిలో ఒత్తిడి పెంచకూడదు. ఓడిపోయినా కష్టపడ్డప్పుడు అభినందించాలి. సమతుల్యత పాటిస్తేనే ఈతరం పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారు. కోచ్‌గా చాలాకాలంగా అనేక విషయాలు పరిశీలించాను. సాధారణంగా కుర్రాళ్లలో కొంత మంది ఒక్క మాటలో చెబితే వినేస్తారు. మరొకరికి గట్టిగా మందలించాల్సి ఉంటుంది. ఇంకొందరికి సుదీర్ఘ ప్రసంగం ఇస్తే గానీ అర్థం కాదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుంటూ మందు వేయాల్సి ఉంటుంది. లేదంటే చక్కటి ప్రతిభ వృథా అయ్యే ప్రమాదం ఉంది. అండర్-14 లేదా అండర్-16 కేటగిరీలలో మంచి విజయాలు సాధిస్తున్న ఆటగాళ్లు ఆ తర్వాత వెనుకబడిపోతున్నారు. సీనియర్ స్థాయిలో గెలవడం తన వల్ల కాదేమోననే భయం వారిలో పెరుగుతోంది. పెద్ద ఆటగాళ్లతో పోటీ పడాలన్న పట్టుదల, చిన్న ఆటగాళ్లను గౌరవించే వారికే విజయాలు దక్కుతాయి. గెలిస్తే నా అంతటోడు లేడని తలెగరేసే వాళ్లు, ఓడితే కుంగిపోయే వాళ్లు కెరీర్లో ఎప్పటికీ ముందుకు వెళ్లలేరు. క్రీడాకారుడిగా ఎదగడంలో ఎంతో శ్రమ, కష్టం ఉంటుంది. కానీ ఒక్కసారి దేశానికి ఆడిన తర్వాత కలిగే గర్వానికి ఏదీ సాటిరాదు. ఎప్పుడూ సాధారణ చదువులకన్నా, కొంత మందైనా తమ పిల్లలను ఆటగాళ్లుగా మార్చాలని భావిస్తే భారత్‌లో క్రీడలకు ఉండే విలువ ఎప్పటికీ తగ్గదు. -
నేడు జాతీయ క్రీడా దినోత్సవం
దేశంలో నేడు ఆటలకు పండుగ రోజు. ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశంలో క్రమంగా క్రీడా సంస్కృతి పెరుగుతోంది. కెరీర్‌గా ఎంచుకుంటేనే క్రీడల వైపు చూసే పరిస్థితి నుంచి... ‘ఆట ఆరోగ్యం కోసం’ అనే భావన క్రమంగా పెరుగుతోంది. ఒక్క క్రికెట్లోనే కాకుండా అంతర్జాతీయ యవనికపై భారత్‌కు అన్ని క్రీడల్లోనూ విజయాలు పెరుగుతున్నాయి. క్రీడా దినోత్సవం, ఆటల ప్రాధాన్యత, మార్గదర్శనం, భవిష్యత్... ఇలా అనేక అంశాలపై ముగ్గురు ఆంధ్రప్రదేశ్ క్రీడా దిగ్గజాలు ‘సాక్షి’కి ప్రత్యేకంగా రాసిన వ్యాసాలు... -
పాపం బర్తోలీ
సిన్సినాటి: టెన్నిస్ చరిత్రలో వింబుల్డన్ టైటిల్‌కున్న ప్రతిష్ట అంతా ఇంతా కాదు. జీవితంలో ఒక్కసారైనా ఆ టోర్నీని సాధించాలని ఆటగాళ్లు కలలు కంటారు. ఫ్రాన్స్‌కు చెందిన టెన్నిస్ స్టార్ మరియన్ బర్తోలి కూడా దీనికి అతీతురాలేం కాదు. కేవలం కలల దగ్గరే ఆగిపోకుండా ఈ ఏడాది జరిగిన వింబుల్డన్‌లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బర్తోలీ ఏకంగా టైటిల్ నెగ్గింది. ఇంకేముంది కెరీర్ తారాజువ్వలాగా దూసుకెళుతుందని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో 28 ఏళ్ల బర్తోలి ఆటకు గుడ్‌బై చెప్పింది. వింబుల్డన్ గెలిచిన కేవలం ఆరు వారాల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులతో పాటు క్రీడాలోకం కూడా షాక్‌కు గురైంది. ప్రపంచ ఏడో ర్యాంకర్ బర్తోలి సిన్సినాటి మాస్టర్స్ టోర్నీ రెండో రౌండ్లో సిమోన హెలెప్ చేతిలో 6-3, 4-6, 1-6 తేడాతో ఓడింది. దీంతో టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఈనిర్ణయానికి నిరంతరం వేధిస్తున్న గాయాలే కారణమని తెలిపింది. మరో రెండు వారాల్లో తను యూఎస్ ఓపెన్ ఆడాల్సి ఉంది. ‘రిటైర్ కావడానికి ఇదే సరైన సమయం. చాలాకాలంగా టెన్నిస్ ఆడుతున్నాను. గ్రాండ్‌స్లామ్ గెలవాలనే కల వింబుల్డన్ ద్వారా తీరింది. నా కెరీర్లో అత్యంత గొప్ప విజయం అది. ఈ ఏడాది ఆరంభం నుంచి గాయాలు వేధిస్తున్నాయి. నా శరీరంలో మిగిలి ఉన్న శక్తినంతా ధారపోశాను. వింబుల్డన్ ఎప్పటికీ నాతోనే ఉండిపోతుంది. ఇక నేను పోటీపడలేను’ అని బర్తోలీ వెల్లడించింది. 2000లో ప్రొఫెషనల్‌గా మారిన బర్తోలీ కెరీర్లో ఏడు డబ్ల్యూటీఏ టైటిళ్లను సాధించింది.