Amala Paul Shocking Comments On Tollywood, Telugu Heroines, - Sakshi
Sakshi News home page

Amala Paul: ‘తెలుగులో హీరోయిన్లు అలాంటి సీన్స్‌కే పరిమితం’

Published Mon, Sep 12 2022 8:58 PM | Last Updated on Mon, Sep 12 2022 9:27 PM

Amala Paul Shocking Comments On Tollywood, Telugu Heroines - Sakshi

‘బెజవాడ’తో చిత్రంతో తెలుగు తెరకు పరచమైన మలయాళ బ్యూటీ అమలా పాల్‌. ఆ తర్వాత లవ్‌ ఫెయిల్యూర్‌, నాయక్‌, ఇద్దరు అమ్మాయిలతో వంటి చిత్రాలతో ఇక్కడ హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందింది. చేసింది తక్కువ సినిమాలే అయిన టాలీవుడ్‌ అగ్ర హీరోల సరసన నటించింది. అనంతరం ఈ భామకు ఇక్కడ అవకాశాలు కరువయ్యాయి. దీంతో తమిళ్‌ ఇండస్ట్రీకి మాకాం మార్చిన ఆమె తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది.

చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్లు ఏం చేస్తుంటారో తెలుసా?

అంతేకాదు బోల్డ్‌ కంటెంట్‌ ఉన్న చిత్రాల్లో సైతం నటించేందుకు ఆమె వెనుకాడటం లేదు. ఆ మధ్య నటించిన ఆమె సినిమా వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సౌత్‌లో పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉన్న ఆమె తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా అమలా పాల్‌ టాలీవుడ్‌ కల్చర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగు హీరోయిన్లను కేవలం లవ్‌ సీన్స్‌, సాంగ్స్‌ కోసమే ఎంచుకుంటారంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. టాలీవుడ్‌లో తన జర్నీ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాల్లో ఎక్కువగా ఫ్యామిలీ కాన్సెప్ట్‌ ఉంటుందనే విషయం నాకు మొదటి రోజే అర్ధమైంది.

చదవండి: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే..

అలాంటి సినిమాలనే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇలాంటి భిన్నమైన సంప్రదాయం కారణంగానే తెలుగు పరిశ్రమకు నేను పెద్దగా కనెక్ట్ కాలేకపోయాను. అందుకే తెలుగులో తక్కువ సినిమాలు చేశాను. ఇక తమిళంలో నేను నటించిన మొదటి చిత్రం ‘మైనా’ నాకు మంచి గుర్తింపు ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే పెళ్లి , విడాకుల తరువాత అమలా పూర్తిగా బోల్డ్‌ కంటెంట్‌, లేడీ ఓరియంటేడ్‌ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement