సెన్సేషనల్ హీరోయిన్ అమలా పాల్ నటించిన తొలి థ్రిల్లర్ సినిమా ఆమె. తమిళంలో ఆడై పేరుతో తెరకెక్కిన సినిమాను తెలుగులో ఆమె పేరుతో డబ్ చేసిన రిలీజ్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రత్నకుమార్. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అమలా పాల్ బోల్డ్ లుక్ కూడా సంచలనం సృష్టించింది. జులై 19న ఆమె సినిమా విడుదల కానుంది. ప్రదీప్ కుమార్ ‘ఆమె’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విజయ్ కార్తిక్ ఖన్నన్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. చరిత్ర చిత్ర ప్రొడక్షన్స్ సంస్థలో ఆమె చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment