కురుమలైలోనారప్ప | Venkatesh New Movie Narappa Shooting in Tamilnadu | Sakshi
Sakshi News home page

కురుమలైలోనారప్ప

Published Mon, Feb 3 2020 12:35 AM | Last Updated on Mon, Feb 3 2020 5:21 AM

Venkatesh New Movie Narappa Shooting in Tamilnadu - Sakshi

వెంకటేష్‌

తమిళనాడులో ఫైట్‌ చేస్తున్నారు ‘నారప్ప’. వెంకటేష్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నారప్ప’. ఈ చిత్రంలో ప్రియమణి, అమలాపాల్‌ కథానా యికలుగా నటిస్తున్నారని తెలిసింది. తమిళంలో హిట్‌ సాధించిన ‘అసురన్‌’ చిత్రానికి ‘నారప్ప’ తెలుగు రీమేక్‌. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతంలోని పాల్తూరు గ్రామంలో ఇటీవల ‘నారప్ప’ చిత్రీకరణ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తమిళనాడులోని కురుమలైలో జరుగుతోంది. స్టంట్‌ కొరియో గ్రాఫర్‌ పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వంలో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. తమిళనాడు షెడ్యూల్‌ పూర్తి కాగానే తిరిగి అనంతపురంలో ‘నారప్ప’ చిత్రీకరణ మొదలవుతుంది. ‘నారప్ప’ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement