
తమిళ చిత్రం ‘అసురన్’ను తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేస్తున్నారు. నారప్పగా టైటిల్ రోల్‌లో వెంకటేశ్ నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్‌బాబు, కలైపులి యస్. థాను నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయికగా నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో జరిగే చిత్రమిది. ఇందులో వెంకటేశ్ రైతుగా కనిపిస్తారు.
లాక్‌డౌన్ ముందు చాలా శాతం వరకూ చిత్రీకరణను పూర్తి చేసింది చిత్రబృందం. లాక్‌డౌన్ వల్ల సుమారు ఆర్నెల్లు చిత్రీకరణకు గ్యాప్ వచ్చింది. అక్టోబర్‌లో మళ్లీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలనే ప్లాన్‌లో ‘నారప్ప’ చిత్రబృందం ఉందని టాక్. అక్టోబర్‌లో ప్రారంభించి సినిమా మొత్తాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలన్నది ఆలోచనట. ఈ చిత్రంలో వెంకటేశ్ పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment