కొత్తదనం లేకపోతే సినిమా చేయను | Amalapaul Concentrate On Tollywood Industry | Sakshi
Sakshi News home page

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

Published Wed, Jul 17 2019 12:06 AM | Last Updated on Wed, Jul 17 2019 7:55 AM

Amalapaul Concentrate On Tollywood Industry - Sakshi

‘‘తెలుగు ఇండస్ట్రీ నా రెండో ఇల్లు లాంటిది. ఇక్కడ 5 సినిమాలు చేశా. ‘జెండాపై కపిరాజు’ తర్వాత స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేయలేదు. గ్యాప్‌ వచ్చింది. టాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ, కథ ఎగై్జట్‌మెంట్‌గా అనిపించకపోవడం, పాత్ర కొత్తగా లేకపోవడంతో అంగీకరించలేదు’’ అన్నారు అమలాపాల్‌. రత్నకుమార్‌ దర్శకత్వంలో అమలాపాల్‌ లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన తమిళ చిత్రం‘ఆడై’. ఈ చిత్రాన్ని ‘ఆమె’ పేరుతో దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ నెల 19న తెలుగులో విడుదల చేస్తున్నారు. అమలాపాల్‌ మాట్లాడుతూ– ‘‘రత్నకుమార్‌ ఈ చిత్రకథ చెప్పినప్పుడు ఎగై్జటింగ్‌గా అనిపించింది.

మన దర్శక–నిర్మాతలు కూడా వాస్తవానికి దగ్గరగా ఉండే సినిమాలు తీసేందుకు ముందుకొస్తున్నారని సంతోషపడ్డా. ఈ చిత్రంలో నగ్న సన్నివేశాలు కథానుగుణంగానే ఉంటాయి. సినిమా చూస్తున్నప్పుడు మహిళా ప్రేక్షకులు అసౌకర్యంగా భావించరు. ప్రేక్షకులు మూస కథలు కాకుండా కొత్తదనం ఉన్నవి కోరుకుంటున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా పాత్రల్ని ఎంపిక చేసుకోవాలి. తెలుగులో ‘మహానటి, జెర్సీ, ఓ బేబీ’ వంటి మంచి సినిమాలొచ్చాయి. నాకిష్టమైన డైరెక్టర్‌ రాజమౌళిగారు.  నాగ్‌ అశ్విన్‌ కూడా బ్రిలియంట్‌ డైరెక్టర్‌. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను.. వాటిలో ఒకటి తెలుగు–తమిళ భాషల్లో రూపొందుతోంది. దానికి నేనే నిర్మాత. ఓ మలయాళ సినిమా చేస్తున్నా’’ అన్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement