
ఇక్కడ కనిపిస్తున్న బ్యూటీ న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. స్పోర్ట్స్ ప్రజెంటర్‌గానూ అలరించింది.

తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. మాతృభాష పంజాబీలో మూడు సినిమాలు చేసిన ఈ తార 'పటాస్'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీ పెద్ద హిట్టయినా సరే తెలుగులో మరీ పెద్ద అవకాశాలేం రాలేదు. దీంతో సుప్రీమ్ మూవీలో టాక్సీవాలా అనే ఐటం సాంగ్ చేసింది.

అనంతరం మీలో ఎవరు కోటీశ్వరుడు చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.

సాంప్రదాయబద్ధమైన పాత్రలకే పరిమితం కావాలనుకోవడం లేదని, సన్నివేశం డిమాండ్ చేస్తే బికినీ ధరించడానికి కూడా రెడీ అంటూ కెరీర్ తొలినాళ్లలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

అయినా ఎందుకోగానీ టాలీవుడ్‌లో మళ్లీ కనిపించనేలేదు. ఈమె చివరగా గతేడాది వచ్చిన అబ్ ఢిల్లీ దూర్ నహీ అనే హిందీ సినిమాలో నటించింది.













