
ఇండస్ట్రీలో ఒకప్పుడు బాల నటీనటులుగా రాణించిన వారు ఇప్పుడు హీరో, హీరోయిన్లుగా మెప్పిస్తున్నారు

ఈ క్రమంలో తేజ సజ్జా, కావ్య కల్యాణ్ రామ్ వంటి వారు విజయం అందుకున్నారు.

రామ చరణ్- తమన్నా జంటగా నటించిన రచ్చ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన 'విషికా లక్ష్మణ్' కూడా హీరోయిన్‌గా ప్రయత్నాలు చేస్తుంది.

2012లో సంపత్ నంది డైరెక్ట్ చేసిన రచ్చ సినిమాలో తమన్నా చిన్నప్పటి పాత్రలో విషికా కనిపించింది.

చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆమె నటించినప్పటికీ రచ్చ మూవీతోనే ఆమె పాపులర్ అయింది.

ఈ చిత్రం షూటింగ్ సమయంలో చరణ్, తమన్నాను కలవలేదని ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది.

ఇప్పుడు తనను వారిద్దరూ చూసినా అస్సలు గుర్తుపట్టలేరని కూడా తెలిపింది. రామ్ చరణ్ తనకు బావ అవుతాడని స్నేహితులతో ఈ బ్యూటీ చెప్పుకునేదట..

రచ్చ సినిమాలో ఆమె పాత్ర చిన్నప్పటి చరణ్‌కు మరదలుగా ఉంటుంది.

విషికా లక్ష్మణ్.. ఏందిరా ఈ పంచాయితీ, సగిలేటి కథ లాంటి మూవీల్లో కథానాయికగా నటించింది.






