బ్యాక్‌గ్రౌండ్ ఉంటే సినిమా ఎంట్రీ పెద్ద కష్టమే కాదు. ప్రతిభ ఉంటే వారిని ఆపడం ఎవరితరమూ కాదు. అందుకు శ్రీదేవి విజయ్‌కుమార్ ప్రత్యక్ష ఉదాహరణ. తన పేరెంట్స్ మంజుల-విజయ్ కుమార్‌ల నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వెండితెరపై అడుగుపెట్టింది. బాలనటిగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసింది. 2002లో ఈశ్వర్ మూవీతో పదిహేనేళ్ల వయసుకే హీరోయిన్‌గా మారింది.
సినిమాలకు దూరం
నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, పెళ్లికాని ప్రసాద్.. ఇలా పలు చిత్రాల్లో నటించింది. ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసే ఈ బ్యూటీ 2009లో రాహుల్‌ను పెళ్లాడాక సినిమాలు తగ్గించేసింది. 2011లో వీర అనే సినిమా చేసిన ఐదేళ్లకు ఓ కన్నడ చిత్రంలో కనిపించింది. అదే ఆమె చివరి చిత్రం. తాజాగా సినిమాలకు దూరంగా ఉండటంపై శ్రీదేవి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. 'పెళ్లయ్యాక సినిమాలు చేయొద్దని ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. నా భర్త అయితే మూవీస్ చేయమని ప్రోత్సహించాడు.
టైం పట్టింది
టాలెంట్ ఉంది, ఇష్టం ఉంది.. మరెందుకు చేయట్లేదని అడిగేవారు. కానీ పెళ్లి తర్వాత కొత్త లైఫ్ స్టార్ట్ చేయడంతో దానికి అలవాటు పడటానికి కాస్త సమయం పట్టింది. ఐదేళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చిన నేను దానికి దూరంగా ఉండాలని ఎన్నడూ అనుకోలేదు. పెళ్లయిన తర్వాత అనుకోకుండానే గ్యాప్ వచ్చింది. కానీ తర్వాత ఏదో ఒక షో ద్వారా ఇండస్ట్రీలోనే ఉంటున్నాను' అని శ్రీదేవి చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment