Sridevi Vijay
-
హీరోయిన్ శ్రీదేవి భర్త - కూతురిని చూశారా? క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
పెళ్లి తర్వాత సినిమాలకు దూరం.. ఎందుకంటే?
బ్యాక్‌గ్రౌండ్ ఉంటే సినిమా ఎంట్రీ పెద్ద కష్టమే కాదు. ప్రతిభ ఉంటే వారిని ఆపడం ఎవరితరమూ కాదు. అందుకు శ్రీదేవి విజయ్‌కుమార్ ప్రత్యక్ష ఉదాహరణ. తన పేరెంట్స్ మంజుల-విజయ్ కుమార్ల నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వెండితెరపై అడుగుపెట్టింది. బాలనటిగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసింది. 2002లో ఈశ్వర్ మూవీతో పదిహేనేళ్ల వయసుకే హీరోయిన్గా మారింది. సినిమాలకు దూరం నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, పెళ్లికాని ప్రసాద్.. ఇలా పలు చిత్రాల్లో నటించింది. ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసే ఈ బ్యూటీ 2009లో రాహుల్‌ను పెళ్లాడాక సినిమాలు తగ్గించేసింది. 2011లో వీర అనే సినిమా చేసిన ఐదేళ్లకు ఓ కన్నడ చిత్రంలో కనిపించింది. అదే ఆమె చివరి చిత్రం. తాజాగా సినిమాలకు దూరంగా ఉండటంపై శ్రీదేవి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. 'పెళ్లయ్యాక సినిమాలు చేయొద్దని ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. నా భర్త అయితే మూవీస్ చేయమని ప్రోత్సహించాడు. టైం పట్టింది టాలెంట్ ఉంది, ఇష్టం ఉంది.. మరెందుకు చేయట్లేదని అడిగేవారు. కానీ పెళ్లి తర్వాత కొత్త లైఫ్ స్టార్ట్ చేయడంతో దానికి అలవాటు పడటానికి కాస్త సమయం పట్టింది. ఐదేళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చిన నేను దానికి దూరంగా ఉండాలని ఎన్నడూ అనుకోలేదు. పెళ్లయిన తర్వాత అనుకోకుండానే గ్యాప్ వచ్చింది. కానీ తర్వాత ఏదో ఒక షో ద్వారా ఇండస్ట్రీలోనే ఉంటున్నాను' అని శ్రీదేవి చెప్పుకొచ్చింది. చదవండి: OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ మూవీ -
బిగ్‌బాస్ 7 షోలోకి ఈశ్వర్ హీరోయిన్!
ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచే బిగ్‌బాస్ షోకు సౌత్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే ప్రతి ఏడాది వరుసగా సీజన్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో ఏడో సీజన్ విజయవంతంగా రన్ అవుతుండగా తమిళంలో ఏడో సీజన్ ప్రారంభానికి రెడీ అయింది. నేడే(అక్టోబర్ 1న) గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈసారి దాదాపు 20 మంది వరకు కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం ఉందంటున్నారు. అందులో హీరోయిన్ శ్రీదేవి కూడా ఉందంటున్నారు. తల్లి మంజుల- తండ్రి విజయ్ కుమార్ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఈ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఈశ్వర్ సినిమాతో హీరోయిన్గా మారింది. తెలుగులో ఇదే తన తొలి చిత్రం కావడం విశేషం. నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, ఆది లక్ష్మి సహా తదితర చిత్రాలు చేసిందీ బ్యూటీ. తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఆమె చేసిన చివరి చిత్రం.. 2011లో వచ్చిన సెల్ ఫోన్ మూవీ. ఆ తర్వాత కన్నడలో లక్ష్మి(2016) సినిమా చేసిన ఆమె చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పేసింది. బుల్లితెరపై మాత్రం పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆమె తమిళ బిగ్‌బాస్ 7 షోలో పాల్గొననుందంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి! ఇకపోతే బిగ్‌బాస్ తమిళ్ మూడో సీజన్లో ఆమె సోదరి వనితా విజయ్‌కుమార్ పాల్గొంది. కానీ రెండో వారమే షో నుంచి ఎలిమినేట్ అయింది. అప్పటినుంచి టీఆర్పీ తగ్గిపోతూ వచ్చింది. తను లేని లోటు బిగ్‌బాస్‌కు తెలిసొచ్చిందో ఏమో కానీ ఆమెను వైల్డ్ కార్డ్ ద్వారా తిరిగి లోపలకు పంపించారు. అయినప్పటికీ టాప్ 5లో చోటు దక్కించుకోలేకపోయింది. చదవండి: ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు.. నయనతార ఆస్తుల విలువెంతో తెలుసా? -
ముంబయ్ అత్తవారిల్లు... తమిళనాడు పుట్టినిల్లు - శ్రీదేవి
‘‘చాలా ఏళ్ల తర్వాత తమిళంలో చే స్తున్న సినిమా ఇది. ముంబయ్ నా అత్తవారిల్లు అయితే.. తమిళనాడు నా పుట్టినిల్లు. విజయ్ చాలా అంకితభావం ఉన్న నటుడు. ఓ మంచి టీమ్‌తో వర్క్ చేసిన ఫీలింగ్ కలిగింది’’ అని సీనియర్ నటి శ్రీదేవి అన్నారు. విజయ్, శ్రుతీహాసన్, హన్సిక నాయకా నాయికలుగా శ్రీదేవి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘పులి’. శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి స్టూడియోస్ పతాకంపై శిబు తమీన్స్, పి.టి. సెల్వకుమార్ తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని ఎస్వీఆర్ మీడియా పతాకంపై సి.జె. శోభ తెలుగులో విడుదల చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక ఆదివారం చెన్నైలో జరిగింది. హీరో విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, ఆయన సతీమణి సంగీతా విజయ్ పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ -‘‘నాకు చాలా కాలంగా చారిత్రక నేపథ్యంలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా ఓ సినిమా చేయాలని కోరిక ఉండేది. ‘పులి’ చిత్రంతో అది కాస్తా తీరిపోయింది. శ్రుతీహాసన్, హన్సిక ఇద్దరూ పోటీపడి నటించారు. సీనియర్ నటి శ్రీదేవి గారు నా సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ కథ వినగానే వెంటనే చేయడానికి అంగీకరించడం విశేషం. పరీక్ష రాశాం. రిజల్ట్ ప్రేక్షకుల చేతిలో ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కథానాయికలు శ్రుతీహాసన్, హన్సిక, తమిళ గీత రచయిత వైరముత్తు, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.