ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ పంచే బిగ్‌బాస్ షోకు సౌత్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే ప్రతి ఏడాది వరుసగా సీజన్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో ఏడో సీజన్ విజయవంతంగా రన్ అవుతుండగా తమిళంలో ఏడో సీజన్ ప్రారంభానికి రెడీ అయింది. నేడే(అక్టోబర్ 1న) గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈసారి దాదాపు 20 మంది వరకు కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం ఉందంటున్నారు. అందులో హీరోయిన్ శ్రీదేవి కూడా ఉందంటున్నారు.
తల్లి మంజుల- తండ్రి విజయ్ కుమార్ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఈ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఈశ్వర్ సినిమాతో హీరోయిన్‌గా మారింది. తెలుగులో ఇదే తన తొలి చిత్రం కావడం విశేషం. నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, ఆది లక్ష్మి సహా తదితర చిత్రాలు చేసిందీ బ్యూటీ. తమిళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో ఆమె చేసిన చివరి చిత్రం.. 2011లో వచ్చిన సెల్ ఫోన్ మూవీ. ఆ తర్వాత కన్నడలో లక్ష్మి(2016) సినిమా చేసిన ఆమె చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పేసింది. బుల్లితెరపై మాత్రం పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆమె తమిళ బిగ్‌బాస్ 7 షోలో పాల్గొననుందంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి!
ఇకపోతే బిగ్‌బాస్ తమిళ్ మూడో సీజన్‌లో ఆమె సోదరి వనితా విజయ్‌కుమార్ పాల్గొంది. కానీ రెండో వారమే షో నుంచి ఎలిమినేట్ అయింది. అప్పటినుంచి టీఆర్పీ తగ్గిపోతూ వచ్చింది. తను లేని లోటు బిగ్‌బాస్‌కు తెలిసొచ్చిందో ఏమో కానీ ఆమెను వైల్డ్ కార్డ్ ద్వారా తిరిగి లోపలకు పంపించారు. అయినప్పటికీ టాప్ 5లో చోటు దక్కించుకోలేకపోయింది.
చదవండి: ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు.. నయనతార ఆస్తుల విలువెంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment