
మలయాళ హీరోయిన్ పుణ్య ఎలిజబెత్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు టోబి కోయిపల్లిని పెళ్లాడింది. ఈ మేరకు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది.

'నాకు 30 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకున్న నా ప్రియుడు గతవారమే పెళ్లి ముహూర్తం పెట్టేశాడు.

అలా మేమిద్దరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యాం. నేను అనుకున్నట్లుగా పెళ్లయిపోయింది. ఈ రోజు (జూలై 18న) నా బర్త్‌డే.

ఇప్పుడు నేను 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను అని చెప్పుకొచ్చింది.

తోబమ, గౌతమంటే రాధం అనే మలయాళ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఈ బ్యూటీ మార, గెట్ సెట్ బేబీ, లియో వంటి తమిళ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది.
















