Neha Saxena
-
నాకన్నీ నువ్వే అమ్మా.. హ్యాపీ ఫాదర్స్ డే
నేడు (జూన్ 16న) ఫాదర్స్ డే. అందరూ తమ తండ్రితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సెలబ్రిటీలైతే నాన్నను తలుచుకుని ఎమోషనలవుతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ నేహా సక్సేనా.. తనకు తల్లయినా, తండ్రయినా అన్నీ అమ్మేనంటూ ఓ వీడియో షేర్ చేసింది.హ్యాపీ ఫాదర్స్ డే అమ్మా.. నాన్న లేడన్న లోటు తెలియకుండా పెంచావు. పుట్టినప్పటినుంచీ నువ్వే నా ప్రపంచం. అమ్మ, నాన్న, ఫ్రెండ్.. అన్నీ నువ్వే అయ్యావు. నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చినందుకు థాంక్యూ అమ్మా. నా చివరి శ్వాస వరకు నువ్వు గర్వపడేలా కృషి చేస్తాను. ఆ దేవుడు నీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ నువ్వే ఇష్టం. లవ్ యూ మా.. అని రాసుకొచ్చింది.కాగా నేహా సక్సేనా.. రిక్షా డ్రైవర్ అనే తుళు సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ప్రేమకు చావుకు అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. తమిళ, కన్నడ, మలయాళ, సంస్కృత, హిందీ భాషల్లో నటించింది. ప్రస్తుతం వృషభ అనే సినిమా చేస్తోంది. View this post on Instagram A post shared by Neha Saxena (@nehasaxenaofficial) చదవండి: గుండు గీయించుకున్న హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా? -
దండు కడితే కొండ కూడా పిండే!
దండు కడితే పెద్ద కొండనైనా ఢీ కొట్టొచ్చనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘దండు’. నీరజ్శ్యామ్, నేహా సక్సేనా, సాయికుమార్ ముఖ్య పాత్రల్లో స్వీయదర్శకత్వంలో సంజీవ్ మేగోటి నిర్మించిన చిత్రం ఇది. దర్శక-నిర్మాత మాట్లాడు తూ- ‘‘దాదాపు పదివేల మంది పాల్గొనగా చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్, భారీ వర్షంలో రూపొందించిన చేజ్ ఈ చిత్రానికి హైలైట్. మంచి యాక్షన్ ఎంటర్టైనర్. త్వరలో పాటలను విడదల చేస్తాం. ’’ అన్నారు. ఈ చిత్రానికి రచనా సహకారం: అంజన్ మేగోటి, ఉమా మేగోటి, హేమంత్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: మేగోటి ఉమామహేశ్వరి, సత్యవతి లవరాజు, రాము , లండన్ గణేశ్. -
‘క్యూ’ప్రేమకు.. చావుకు మూవీ స్టిల్స్