దండు కడితే కొండ కూడా పిండే!
దండు కడితే పెద్ద కొండనైనా ఢీ కొట్టొచ్చనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘దండు’. నీరజ్‌శ్యామ్, నేహా సక్సేనా, సాయికుమార్ ముఖ్య పాత్రల్లో స్వీయదర్శకత్వంలో సంజీవ్ మేగోటి నిర్మించిన చిత్రం ఇది. దర్శక-నిర్మాత మాట్లాడు తూ- ‘‘దాదాపు పదివేల మంది పాల్గొనగా చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్, భారీ వర్షంలో రూపొందించిన చేజ్ ఈ చిత్రానికి హైలైట్. మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్. త్వరలో పాటలను విడదల చేస్తాం. ’’ అన్నారు. ఈ చిత్రానికి రచనా సహకారం: అంజన్ మేగోటి, ఉమా మేగోటి, హేమంత్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: మేగోటి ఉమామహేశ్వరి, సత్యవతి లవరాజు, రాము , లండన్ గణేశ్.