ఆ సంఘటన దురదృష్టకరం : ఉత్తమ్
హైదరాబాద్:
గణతంత్ర దినోత్సవం రోజు జగిత్యాలలో జరిగిన సంఘటన దురదృష్టకరమని.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సెక్యులర్ దేశంలో మతశక్తులను ప్రోత్సహించడం సరికాదన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవం రోజు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు జెండాలతో సహా పాల్గొనడం దీనికి జిల్లా కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించడం విస్మయానికి గురిచేసిందన్నారు.
ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కావడం లేదన్నారు. దీనికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి లేఖ రాశామన్నారు. గణతంత్ర దినోత్సవం రోజు ఓ కలెక్టర్ ప్రభుత్వాన్ని పొగుడుతూ మాట్లాడడం.. మరో కలెక్టర్ ఎంపీ కవిత కాళ్ల దగ్గర కూర్చోవడం సిగ్గుచేట్టన్నారు.