
ప్రశాంతంగా నవోదయ పరీక్ష
కోరుట్ల / కోరుట్ల టౌన్/ మల్యాల/మెట్‌పల్లి: నవోదయ పరీక్షలు ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. జగిత్యాలలోని మూడు పరీక్ష కేంద్రాల్లో 1080 మందికి గాను 1024 మంది, కోరుట్లలో రెండు పరీక్ష కేంద్రాల్లో 377 మందికి గాను 366 మంది, మెట్‌పల్లిలో రెండు పరీక్ష కేంద్రాల్లో 595 మంది విద్యార్థులకు గాను 545 మంది పరీక్షలు రాశారు.
ఉదయం 11.30 నుంచి మ«ధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరిగాయి. పరీక్ష కేంద్రాలను నవోదయ అబ్జర్వర్ మంగతాయారు, డీఈవో వెంకటేశ్వర్లు సందర్శించారు.