శంకరపట్నం, న్యూస్‌లైన్ : జిల్లావ్యాప్తంగా పశువుల సంఖ్య ఎక్కువగా ఉన్న గ్రామాల్లో నూతనంగా పశువైద్యశాలలను ఏర్పాటు చేసి, భవనాల నిర్మాణానికి పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్‌లో రూ.5కోట్లతో వెటర్నరీ పాలీక్లినిక్, రూ.1.76 కోట్లతో ప్రాంతీయ పశువైద్యశాల భవనం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. పెద్దపల్లి, జగిత్యాల, మెట్‌పల్లిలో రైతుశిక్షణా కేంద్రలను ఏర్పాటు చేసి, ఒక్కో భవనానికి రూ.65లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు.
జిల్లాలో గోపాలమిత్ర సర్వీస్‌సెంటర్, పశువైద్యశాలల భవనాలు మంజూరీ అయిన గ్రామాల వివరాలు ఇలా ఉన్నాయి. శంకరపట్నం మండలం రాజాపూర్, తాడికల్, మానకొండూర్ మండలం పచ్చునూర్, బెజ్జంకి మండలం బెజ్జంకి క్రాస్‌రోడ్, మాదాపూర్, తిమ్మాపూర్ మండలం లక్ష్మిదేవిపల్లి, అల్గునూర్, ఇల్లంతకుంట మండలం సిరికొండ, పొత్తూర్, మల్లాపూర్ మండలం రామన్నపేట, బోయినపల్లి మండలం విలాసాగర్, గంగాధర మండలం గర్షకుర్తి, చొప్పదండి మండలం కాట్నపల్లి, రాగంపేట, కొడిమ్యాల మండలం నల్లగొండ, రామడుగు మండలం వెలిచాల, వెల్గటూర్ మండలం కొత్తపేట, జగదేవ్‌పేట, ధర్మారం మండలం బంజేరుపల్లి, పత్తిపాక, అబ్బాపూర్, పెగడపల్లి మండలం ఎల్లాపూర్, చిగురుమామిడి మండలం ఇందుర్తి, రామంచ, హుస్నాబాద్ మండలం మల్లంపల్లి, మీర్జాపూర్, సైదాపూర్ మండలం ఆకునూర్, వెన్నంపల్లి, భీమదేవరపల్లి మండలం వీర్లగట్టతండా, ఎల్కతుర్తి మండలం దామెర, కోతులనడుమ, హుజూరాబాద్ మండలం చెల్పూర్, కందుగుల, వీణవంక మండలం మామిడాలపల్లి, గొడిశాల, కమలాపూర్ మండలం శంభునిపల్లి, కరీంనగర్ మండలం కొత్తపల్లి, చింతకుంట, చెర్లబూత్కూర్, మెట్‌పల్లి మండలం ఆత్మకూర్, ఇబ్రహీంపట్నం మండలం గూడూర్, కోరుట్ల మండలం మాదాపూర్, కమాన్‌పూర్ మండలం బేగంపేట, మల్హర్ మండలం రుద్రారం, మంథని మండలం ధర్మారం, ముత్తారం మండలం మైదంబండ, సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల, రాగడిమద్దికుంట, ఎలిగేడ్, పెద్దపల్లి మండలం నిట్టూర్, రామగుండం మండలం తక్కలపల్లి, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి, గర్జనపల్లి, గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్, ముస్తాబాద్ మండలం నామాపూర్, చందుర్తి మండలం రుద్రంగి, కోనరావుపేట మండలం మామిడిపల్లి, నిమ్మపల్లి, వేములవాడ మండలం వట్టెంల గ్రామాల్లో పశువైద్యశాల భవనాలకు నిధులు మంజూరయ్యాయి. గోపాలమిత్ర సర్వీస్‌సెంటర్‌లు, పశువైద్యశాలలకు రూ.6 లక్షల నుంచి 8లక్షల వరకు నిధులు కేటాయించారు.
పశువైద్యశాలలకు నిధులు
Published Sun, Jan 5 2014 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement