Animal hospitals
-
టాటా కలల ఆస్పత్రి ప్రారంభం.. ఇక్కడ వైద్యం ఎవరికో తెలుసా?
దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన బిలియనీర్ వ్యాపార వేత్తలలో రతన్ టాటా ఒకరు. దాతృత్వం, జ్ఞాన సంపద, వ్యాపార నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన రతన్ టాటాకు సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. మూగ జీవాలను ప్రేమించే ఆయన వాటి కోసం నిర్మించిన ప్రత్యేక ఆస్పత్రిని తాజాగా ప్రారంభించారు.ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెంపుడు జంతువుల ఆసుపత్రిని ప్రారంభిస్తున్నట్లు టాటా ట్రస్ట్‌ల చీఫ్ రతన్ టాటా ప్రకటించారు. 'వుయ్ ఆర్ ఓపెన్' అనే క్యాప్షన్‌తో పాటు వైద్యులతో తాను ముచ్చటిస్తున్న ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. జంతువుల పట్ల సానుభూతితో ఉండే టాటా గ్రూప్ దాని గురించి అవగాహన పెంచడానికి అనేక ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. అదే బాటలో కొనసాగుతూ దేశంలోనే అతిపెద్ద జంతు వైద్యశాలలలో ఒకదాన్ని ప్రారంభించింది.టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్‌ను ముంబైలో 2.2 ఎకరాలలో రూ. 165 కోట్ల ఖర్చుతో నిర్మించారు. కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, ఇతర చిన్న జంతువులకు ఇక్కడ వైద్యం అందిస్తారు. ఇది 24x7 పని చేస్తుంది. “నేడు మూగ జీవాలు కుటుంబ సభ్యుల మాదిరిగా మారిపోయాయి. జీవితాంతం అనేక పెంపుడు జంతువుల సంరక్షకుడిగా ఈ ఆసుపత్రి అవసరాన్ని నేను గుర్తించాను" అని రతన్ టాటా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ చెప్పారు.జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఈ కొత్త ఆసుపత్రి రాయల్ వెటర్నరీ కాలేజ్ లండన్‌తో సహా ఐదు యూకే వెటర్నరీ స్కూల్స్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. మల్టీడిసిప్లినరీ కేర్‌తో పాటు సర్జికల్, డయాగ్నోస్టిక్, ఫార్మసీ సేవలను ఆసుపత్రి అందిస్తుంది. నాలుగు అంతస్తులు ఉండే ఆసుపత్రి భవనంలో 200 జీవులకు వైద్యం అందించే సదుపాయం ఉంది. దీనికి బ్రిటిష్ పశువైద్యుడు థామస్ హీత్కోట్ నాయకత్వం వహిస్తున్నారు.We are open https://t.co/Dh4ndSMo7A— Ratan N. Tata (@RNTata2000) July 1, 2024 -
జంతువుల కోసం టాటా హాస్పిటల్ - ఎక్కడో తెలుసా?
ప్రముఖ వ్యాపారవేత్త, పరోపకారి 'రతన్ టాటా' ముంబైలో జంతువుల కోసం అత్యాధునిక హాస్పిటల్ నిర్మించడానికి సంకల్పించారు. సుమారు 2.2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ ఆసుపత్రిలో కుక్కలు, పిల్లులు, కుందేళ్ళు వంటి ఇతర చిన్న జంతువులను 24x7 సేవలు అందించనున్నట్లు సమాచారం. రతన్ టాటా నిర్మించనున్న ఈ జంతువుల హాస్పిటల్ కోసం ఏకంగా రూ. 165 కోట్లు వెచ్చించినట్లు, టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ పేరుతో రానున్న ఈ ఆసుపత్రి వచ్చే నెలలో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా భావిస్తారని, నా జీవిత కాలంలో అనేక పెంపుడు జంతువులను చూసాను, కాబట్టి పెంపుడు జంతువుల కోసం ఆధునిక పరికరాలతో ఒక హాస్పిటల్ కావాలనే ఆవశ్యకతను అర్థం చేసుకున్నానని రతన్ టాటా ప్రస్తావించారు. జంతు ప్రేమికులు తమ కుక్కలకు లేదా పిల్లులకు చికిత్స కావాలనుకున్నప్పుడు వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా.. వాటికి మెరుగైన చికిత్స ఆంచించడానికి ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆసుపత్రి ముంబైలో నిర్మించనున్నారు. ఇదీ చదవండి: ఖరీదైన వస్తువులు పోతున్నాయ్.. ఆందోళనలో భారతీయ సీఈఓలు నిజానికి రతన్ టాటాకు జంతువుల మీద ఉన్న ప్రేమ ఎటువంటిదో అందరికి తెలుసు. జంతువుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించిన 'శంతను నాయుడు' రతన్ టాటాకు దగ్గరవడానికి ప్రధాన కారణం ఇద్దరికీ జంతువుల మీద ఉన్న ప్రేమ అని గతంలో చాలా సందర్భాల్లో చాలా మంది వెల్లడించారు. -
పశువైద్యశాలలకు నిధులు
శంకరపట్నం, న్యూస్‌లైన్ : జిల్లావ్యాప్తంగా పశువుల సంఖ్య ఎక్కువగా ఉన్న గ్రామాల్లో నూతనంగా పశువైద్యశాలలను ఏర్పాటు చేసి, భవనాల నిర్మాణానికి పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్లో రూ.5కోట్లతో వెటర్నరీ పాలీక్లినిక్, రూ.1.76 కోట్లతో ప్రాంతీయ పశువైద్యశాల భవనం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. పెద్దపల్లి, జగిత్యాల, మెట్పల్లిలో రైతుశిక్షణా కేంద్రలను ఏర్పాటు చేసి, ఒక్కో భవనానికి రూ.65లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. జిల్లాలో గోపాలమిత్ర సర్వీస్‌సెంటర్, పశువైద్యశాలల భవనాలు మంజూరీ అయిన గ్రామాల వివరాలు ఇలా ఉన్నాయి. శంకరపట్నం మండలం రాజాపూర్, తాడికల్, మానకొండూర్ మండలం పచ్చునూర్, బెజ్జంకి మండలం బెజ్జంకి క్రాస్‌రోడ్, మాదాపూర్, తిమ్మాపూర్ మండలం లక్ష్మిదేవిపల్లి, అల్గునూర్, ఇల్లంతకుంట మండలం సిరికొండ, పొత్తూర్, మల్లాపూర్ మండలం రామన్నపేట, బోయినపల్లి మండలం విలాసాగర్, గంగాధర మండలం గర్షకుర్తి, చొప్పదండి మండలం కాట్నపల్లి, రాగంపేట, కొడిమ్యాల మండలం నల్లగొండ, రామడుగు మండలం వెలిచాల, వెల్గటూర్ మండలం కొత్తపేట, జగదేవ్‌పేట, ధర్మారం మండలం బంజేరుపల్లి, పత్తిపాక, అబ్బాపూర్, పెగడపల్లి మండలం ఎల్లాపూర్, చిగురుమామిడి మండలం ఇందుర్తి, రామంచ, హుస్నాబాద్ మండలం మల్లంపల్లి, మీర్జాపూర్, సైదాపూర్ మండలం ఆకునూర్, వెన్నంపల్లి, భీమదేవరపల్లి మండలం వీర్లగట్టతండా, ఎల్కతుర్తి మండలం దామెర, కోతులనడుమ, హుజూరాబాద్ మండలం చెల్పూర్, కందుగుల, వీణవంక మండలం మామిడాలపల్లి, గొడిశాల, కమలాపూర్ మండలం శంభునిపల్లి, కరీంనగర్ మండలం కొత్తపల్లి, చింతకుంట, చెర్లబూత్కూర్, మెట్పల్లి మండలం ఆత్మకూర్, ఇబ్రహీంపట్నం మండలం గూడూర్, కోరుట్ల మండలం మాదాపూర్, కమాన్‌పూర్ మండలం బేగంపేట, మల్హర్ మండలం రుద్రారం, మంథని మండలం ధర్మారం, ముత్తారం మండలం మైదంబండ, సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల, రాగడిమద్దికుంట, ఎలిగేడ్, పెద్దపల్లి మండలం నిట్టూర్, రామగుండం మండలం తక్కలపల్లి, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి, గర్జనపల్లి, గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్, ముస్తాబాద్ మండలం నామాపూర్, చందుర్తి మండలం రుద్రంగి, కోనరావుపేట మండలం మామిడిపల్లి, నిమ్మపల్లి, వేములవాడ మండలం వట్టెంల గ్రామాల్లో పశువైద్యశాల భవనాలకు నిధులు మంజూరయ్యాయి. గోపాలమిత్ర సర్వీస్సెంటర్లు, పశువైద్యశాలలకు రూ.6 లక్షల నుంచి 8లక్షల వరకు నిధులు కేటాయించారు.