
ప్రముఖ వ్యాపారవేత్త, పరోపకారి 'రతన్ టాటా' ముంబైలో జంతువుల కోసం అత్యాధునిక హాస్పిటల్ నిర్మించడానికి సంకల్పించారు. సుమారు 2.2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ ఆసుపత్రిలో కుక్కలు, పిల్లులు, కుందేళ్ళు వంటి ఇతర చిన్న జంతువులను 24x7 సేవలు అందించనున్నట్లు సమాచారం.
రతన్ టాటా నిర్మించనున్న ఈ జంతువుల హాస్పిటల్ కోసం ఏకంగా రూ. 165 కోట్లు వెచ్చించినట్లు, టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ పేరుతో రానున్న ఈ ఆసుపత్రి వచ్చే నెలలో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.
పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా భావిస్తారని, నా జీవిత కాలంలో అనేక పెంపుడు జంతువులను చూసాను, కాబట్టి పెంపుడు జంతువుల కోసం ఆధునిక పరికరాలతో ఒక హాస్పిటల్ కావాలనే ఆవశ్యకతను అర్థం చేసుకున్నానని రతన్ టాటా ప్రస్తావించారు.
జంతు ప్రేమికులు తమ కుక్కలకు లేదా పిల్లులకు చికిత్స కావాలనుకున్నప్పుడు వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా.. వాటికి మెరుగైన చికిత్స ఆంచించడానికి ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆసుపత్రి ముంబైలో నిర్మించనున్నారు.
ఇదీ చదవండి: ఖరీదైన వస్తువులు పోతున్నాయ్.. ఆందోళనలో భారతీయ సీఈఓలు
నిజానికి రతన్ టాటాకు జంతువుల మీద ఉన్న ప్రేమ ఎటువంటిదో అందరికి తెలుసు. జంతువుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించిన 'శంతను నాయుడు' రతన్ టాటాకు దగ్గరవడానికి ప్రధాన కారణం ఇద్దరికీ జంతువుల మీద ఉన్న ప్రేమ అని గతంలో చాలా సందర్భాల్లో చాలా మంది వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment