బండి మోజు ఓ యువడిని బలిగొంది. బండి కొనివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బె దిరించి పంతం నెగ్గించుకున్న యువకుడు అదే బైక్‌పై ప్రయాణిస్తూ మృతిచెందాడు.
మల్యాల/జగిత్యాలరూరల్, న్యూస్‌లైన్ : బండి మోజు ఓ యువడిని బలిగొంది. బండి కొని వ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బె దిరించి పంతం నెగ్గించుకున్న యువకుడు అదే బైక్‌పై ప్రయాణిస్తూ మృతిచెందాడు. జగిత్యాల మండలం ధరూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం లో ఈయన సోదరుడితోపాటు మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని పోతారంలో ఈ ఘటన విషాదం నింపింది. స్థాని కులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పోతారం గ్రామానికి చెందిన జాలిగపు నరేశ్(22) జగిత్యాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
తన ఫ్రెండ్స్ అందరికి బైక్ ఉందని, తనకూ కొనివ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని నరేశ్ తన తల్లిదండ్రులను బెదిరించేవాడు. దీంతో వారు అప్పులు చేసి శనివారం కొత్త బైక్ కొనిచ్చారు. ఈ బైక్‌పై నరేశ్, తమ్ముడు హరీశ్‌తోపాటు మిత్రుడు కృష్ణ ఆదివారం జగిత్యాలలో ఓ పెళ్లి బరాత్‌కు వెళ్లారు. సోమవా రం వేకువజామున 3గంటలకు పోతారం వస్తుండగా ధరూర్ శివారులో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. నరేశ్ చనిపోగా, హరీశ్, కృష్ణలకు తీవ్రగాయాలయ్యాయి. ఇందులో హరీశ్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు పంపించారు. మృతుడి తండ్రి దేవయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జగి త్యాల ట్రాఫిక్ ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు.