జగిత్యాల: కొడుకు మృతిని తట్టుకోలేక ఓ తల్లి ప్రాణాలు వదిలింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం ఇల్లంతకుంటలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకన్న (50) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి వరంగల్‌లో మృతి చెందాడు. అతని మృతదేహాన్ని గురువారం స్వస్థలానికి తీసుకురాగా అది చూసి తట్టుకోలేక తల్లి నాగమ్మ(70) కొడుకు మృత దేహం వద్దే ప్రాణాలు వదిలింది. ఒకే ఇంట్లో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.