బాలికలతో సోషల్ వెల్ఫేర్ అధికారి సురేందర్, వార్డెన్
-
విచారణ అనంతరం తల్లికి అప్పగింత
జగిత్యాల అర్బన్ : పట్టణంలోని వసతి గృహం ఆనంద నిలయం నుంచి గతనెల 30న వెళ్లిపోయిన వొల్లెపు వీరమణి, వొల్లెపు గంగమణిని అధికారులు శనివారం జగిత్యాలకు తీసుకువచ్చారు. ముంబయ్‌లో తన తల్లివద్ద ఉన్న వీరిని అక్కడి పోలీసుల సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాలకు తీసుకువచ్చి స్థానిక పోలీస్ స్టేషన్‌లో విచారణ చేశారు. అనంతరం తల్లిదండ్రులు వెంకటి, లక్ష్మికి కౌన్సెలింగ్ చేశారు. తర్వాత పిల్లలను తల్లికి అప్పగించారు. తమ మధ్య తలెత్తిన గొడవలతో పిల్లలిద్దరూ తండ్రి వద్దే ఉంటున్నారని, వారిపై ఉన్న ప్రేమతో కూతుళ్లను తీసుకుని ముంబయ్ వెళ్లానని లక్ష్మి తెలిపింది. హాస్టల్ అధికారులను అడిగితే పంపించరని, బయటకు రప్పించి ఆటోలో తీసుకెళ్లానని చెప్పింది. తర్వాత తానే హాస్టల్ అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పానని పేర్కొంది. అదృశ్యం కథ సుఖాంతమవడంతో సంక్షేమశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.